అక్కిరాజు రమాపతిరావు
Jump to navigation
Jump to search
అక్కిరాజు రమాపతిరావు | |
---|---|
జననం | అక్కిరాజు రమాపతిరావు 1934, మే 4. గుంటూరు జిల్లా,మాచవరం మండలంలోని వేమవరం |
నివాస ప్రాంతం | వేమవరం |
ఇతర పేర్లు | మంజుశ్రీ |
వృత్తి | పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ |
ప్రసిద్ధి | రచయిత ,ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత |
మతం | హిందూ |
తండ్రి | రామయ్య |
తల్లి | అన్నపూర్ణమ్మ |
అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ పేరుతో ప్రసిద్ధులు ) తెలుగులో ఒక ప్రసిద్ధ రచయిత. మొదట్లో సృజనాత్మక రచనలు కొన్ని చేసినా, క్రమేపీ పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ మొదలైన ప్రక్రియలలో - దరిదాపుగా 60 పుస్తకాలవరకూ రచించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]"మంజుశ్రీ" అనే కలం పేరుతో రచనలు చేసిన ఈయన జననం: 1934, మే 4. పుట్టిన ఊరు: గుంటూరు జిల్లా, మాచవరం మండలంలోని వేమవరం. తల్లిదండ్రులు: అన్నపూర్ణమ్మ, రామయ్య
విద్య, ఉద్యోగం
[మార్చు]- ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. (తెలుగు) పట్టా పొందాడు.
- "వీరేశలింగం పంతులు జీవితం - సాహిత్యం"పై పి.హెచ్.డి. పొందాడు.
- "డిప్లొమా ఇన్ లింగ్విస్టిక్స్" చేశాడు. తెలుగు అకాడమీలో పరిశోధనాధికారిగా పనిచేశాడు.
రచనలు, అవార్డులు
[మార్చు]- వ్యావహారిక భాషా వికాసం - చరిత్ర" అనే పరిశోధవా గ్రంథానికి 1971లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
- వీరు పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్ర లోని దీక్ష, పురాతన ప్రకరణాలను 2003 సంవత్సరంలో తెలుగు వచనంలోకి అనువదించారు.[1]
- నవ్యసాహితీలహరి - యువభారతి ప్రచురణ
- కంచి మీదుగా నా అరుణాచలయాత్ర
- అక్కిరాజు రమాపతిరావు. "ప్రతిభామూర్తులు". Retrieved 2018-09-23.
మూలాలు
[మార్చు]- ↑ పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్ర (దీక్ష, పురాతన ప్రకరణాలు) (వచనం), అక్కిరాజు రమాపతిరావు, సుపథ ప్రచురణలు, 2003.
వెలుపలి లంకెలు
[మార్చు]- అవిశ్రాంత రచయిత అక్కిరాజు రమాపతిరావు Archived 2023-12-24 at the Wayback Machine
వర్గాలు:
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- తెలుగు రచయితలు
- 1934 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు
- గుంటూరు జిల్లా రచయితలు
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు
- గుంటూరు జిల్లా సాహితీ విమర్శకులు
- కలం పేరుతో రచనలు చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు