కళా వెంకటరావు
| కళా వెంకటరావు | |||
![]()
| |||
మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రి
| |||
| పదవీ కాలం మార్చి 23, 1947 – జనవరి 24, 1949 | |||
| ముందు | కడప కోటిరెడ్డి | ||
|---|---|---|---|
| తరువాత | హాలహర్వి సీతారామరెడ్డి | ||
ఆంధ్రరాష్ట్ర శాసనసభ్యుడు
కొత్తపేట | |||
| పదవీ కాలం 23 ఏప్రిల్ 1955 – 28 మార్చి 1959 | |||
| ముందు | కొత్తగా ఏర్పడింది | ||
| తరువాత | ఎం.వి.ఎస్.ఎస్. రాజు | ||
మద్రాసు రాష్ట్ర శాసనసభ్యుడు
అమలాపురం (జనరల్) | |||
| పదవీ కాలం 1937 – 1952 | |||
| తరువాత | నడింపల్లి రామభద్ర రాజు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | జూలై 7, 1900 నడిపూడి, ఆంధ్ర ప్రదేశ్ | ||
| మరణం | మార్చి 28, 1959 | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
| జీవిత భాగస్వామి | రాజేశ్వరమ్మ | ||
| మతం | హిందువు | ||
కళా వెంకటరావు లేదా కళా వెంకట్రావు (జూలై 7, 1900 - మార్చి 28, 1959) ప్రముఖ స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి.
జననం
[మార్చు]ఈయన జూలై 7, 1900 సంవత్సరంలో అమలాపురం తాలూకా ముక్కామల గ్రామంలో జన్మించాడు.
జీవితంలో విశేషాలు
[మార్చు]1921లో బి.ఏ. చదువుతున్న సమయంలోనే సహాయ నిరాకరణోద్యమంలో ఈయన పాల్గొన్నాడు. తరువాత శాసనోల్లంఘనోద్యమం లో, వ్యక్తి సత్యాగ్రహం లో, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని కొన్ని సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. కోనసీమ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుకు 20 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశాడు. 1940-1946 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాను, మద్రాసు ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగాను, 1949-51 వరకు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాను పనిచేశాడు. 1951-1959 మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఆరోగ్య, ఆర్థిక శాఖలకు మంత్రిగా పనిచేశాడు. 1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్లో మద్రాస్ తరపున ఎన్నికై అందులో కడవరకు సభ్యులుగా ఉన్నారు.
1937, 1946 ఎన్నికలలో అమలాపురం శాసనసభ నియోజకవర్గం (జనరల్) నుండి భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరపున మద్రాసు శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. కాగా 1946 ఎన్నికలలో అదేచోట పోటిచేయగా ఓడీపోయి రెండవస్థానంలో నిలిచారు. 1955 ఎన్నికలలో కొత్తపేట శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరపున ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.[1]
అయిన పూర్వీకులు నడిపూడి ఊరిలో ఉండేవారు. అందుకే ఆయనకి నడిపూడి అంటే బాగా మక్కువ అనేవారు. అందుకే గొదావరి పైన ఆలమూరు వంతెనకి, సిద్ధాంతం వంతెనకి ఆయన గట్టిగా మద్రాసు అస్సెంబ్లిలో పోరాడి తన రాజకీయ పలుకుబడితో నిధులు మంజూరు చేయిపించి, చివరికి ఈ రెండు వంతెనలకు శంకుస్థాపన కూడా చేసారు.[2] ఇప్పటికి శిలాఫలకం పైన ఆయన పేరుంటుంది.
వివాహం
[మార్చు]ఇతడు 1914 ఏప్రిల్లో గొప్ప దేశభక్తుడు, దాత, ముక్కామల గ్రామ మున్సిఫ్ అయిన దువ్వూరి వెంకటేశ్వర్లు గారి కుమార్తె రాజేశ్వరమ్మను వివాహమాడారు కాని సంతతి లేరు. ఆంధ్రరాష్ట్ర తొలి ఆస్థానకవి అయిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారికి,[3] ఫ్రెంచి యానాంలో అప్పటి రాజకీయాల్లో పేరుగాంచిన బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రులుగారికి వెంకటరావు బావమరిది.
మరణం
[మార్చు]ఈయన 1959 సంవత్సరం మార్చి 28 న పరమపదించాడు.
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్ర శాసనసభ్యులు, 1955, పేజీ: 2.
- ↑ Madras Legislative Assembly Debates. Official Report, 1946
- ↑ శ్రీకృష్ణకవి చరిత్రము (1933), అనంతపంతుల రామలింగస్వామిగారు
- ↑ http://books.google.com/books?lr=&client=firefox-a&cd=20&id=rCZYAAAAMAAJ
- S-bef: 'before' parameter includes the word 'created'
- Template:Succession box: 'before' parameter includes the word 'created'
- 1900 జననాలు
- 1959 మరణాలు
- తూర్పు గోదావరి జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- తూర్పు గోదావరి జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు
- మద్రాసు ప్రెసిడెన్సీలో మంత్రులుగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- ఆంధ్ర రాష్ట్రంలో శాసన సభ్యులు
- ఆంధ్ర రాష్ట్రంలో మంత్రులు
- మద్రాసు ప్రెసిడెన్సీలో శాసన సభ్యులుగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
