హాలహర్వి సీతారామరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతారామరెడ్డి

హాలహర్వి సీతారామరెడ్డి, రాయలసీమకు చెందిన రాజకీయనాయకుడు, స్వాతంత్ర్యసమరయోధుడు. బళ్ళారి నుండి మద్రాసు శాసనసభకు ఎన్నికై 1947 నుండి 1952 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ, పరిశ్రమలు, శ్రామిక శాఖల మంత్రిగా పనిచేశాడు.

సీతారామరెడ్డి, 1900, మే 14న అప్పటి బళ్ళారి జిల్లాలోని హాలహర్విలో జన్మించాడు. ఈయన తండ్రి బొజ్జి రెడ్డి. సీతారామరెడ్డి మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో బీ.ఏ పట్టభద్రుడై, లా కళాశాల నుండి బీ.ఎల్ పట్టా పుచ్చుకున్నాడు. 1930లో మద్రాసులో న్యాయవాదిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన సీతారామరెడ్డికి గోవిందమ్మతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు.[1] 1937లోనూ, తిరిగి 1946లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు.

రాయలసీమ అభివృద్ధి సంఘం అధ్యక్షునిగా ఉన్నాడు. ఆంధ్రోధ్యమంలో చురుకుగా పనిచేసిన సీతారామరెడ్డి 1937లో కడప కోటిరెడ్డి అధ్యక్షతన విజయవాడలో జరిగిన రజతోత్సవ ఆంధ్ర మహాసభలను ప్రారంభించాడు.[2] రాయలసీమ నేతగా శ్రీబాగ్‌ ఒడంబడికలో కూడా పాల్గొన్నాడు. 1960 నుండి బెంగుళూరు కాఫీ బోర్డు అధ్యక్షునిగా పనిచేశాడు.[3] 1962లో ఆదోని నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]