ఆంధ్ర మహాసభ (ఆంధ్ర)
ఆంధ్ర మహాసభ - సంయుక్త మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఆంధ్ర మహాసభలు. ఆంధ్రమహాసభ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు అస్తిత్వాన్ని పెంపొందించడానికి, తమిళుల ఆధిపత్యాన్ని అడ్డుకోవటానికి ప్రారంభమైన ఒక సాంస్కృతిక సంస్థ.[1] ఈ ఆంధ్రమహాసభలే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి బీజాలు వేశాయి.
ప్రారంభ నేపథ్యం
[మార్చు]చాలా ఉద్యమాల మాదిరిగానే చరిత్ర, రచనలు, పత్రికలు ఆంధ్రరాష్ట్ర ఉద్యమానికి పునాదులు నిర్మించాయి. 1911లో ‘తెలుగు ప్రజల నేటి పరిస్థితి’ శీర్షికతో హిందూ పత్రిక ఆరు వ్యాసాలు ప్రచురించింది. ప్రభుత్వ సర్వీసులలో ఆంధ్రులను ఎంత చిన్నచూపు చూస్తున్నారో వాటితో వెల్లడించింది. కొద్ది నెలల ముందు చిలుకూరి వీరభద్రరావు రచన ‘ఆంధ్రుల చరిత్ర’ను విజ్ఞాన చంద్రికా మండలి 1910లో ప్రచురించి అప్పటికే ఒక అవగాహన తెచ్చింది. జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ, చట్టి నరసింహారావు 1911లో ఆంధ్ర దేశ చిత్రపటం రూపొందించారు. 1912లో కొండా వెంకటప్పయ్య, కె.గురునాథం ఆంధ్రోద్యమం’ అన్న చిన్న పుస్తకం ప్రచురించి, ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి సూచనలు చేశారు.
1912 మే నెలలో వేమవరపు రామదాసు అధ్యక్షతన నిడదవోలులో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకుల సమావేశం జరిగింది. ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి చర్చించాలని ఈ సమావేశంలోనే చట్టి నరసింహారావు సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, సైన్యంలో, ప్రభుత్వ సర్వీసులలో ఆంధ్రులకు అవకాశం కల్పించాలని కూడా తీర్మానించారు. ఈ భావనలకు ‘దేశాభిమాని’, ‘భరతమాత’, ‘ఆంధ్రపత్రిక’, ‘కృష్ణాపత్రిక’ మద్దతు పలి కాయి.
నిడదవోలు సభ నిర్ణయం మేరకు 1913, may 26న బాపట్లలో ప్రథమ ఆంధ్ర మహాసభ జరిగింది. ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వేమవరపు రామదాసు ప్రతిపాదించారు. కానీ ఇలాంటి తీర్మానానికి సమయమింకా ఆసన్నం కాలేదని, వచ్చే సమావేశాలలో చర్చిద్దామని పలువురు పెద్దలు వాయిదా వేశారు. విశాఖ ఉత్తర ప్రాంతాలు, గంజాం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలకు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై వ్యతిరేకత ఉండేది. ఈ అంశంలో ఆ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని, వారిని కూడా సానుకూలురను చేసుకోవాలని సభ అభిప్రాయపడింది. తొలి ఆంధ్ర మహాసభ సమావేశాలు 1913లో బాపట్లలో జరిగాయి. ఆ సభకు రెండు వేల మంది అతిధులు, 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సభకు కోస్తా, రాయలసీమ ప్రతినిధులతో పాటు, నాగపూరు, వరంగల్, హైదరాబాదులనుండి కూడా ప్రతినిధులు వచ్చారు. ఆంధ్రమహాసభ కాంగ్రేసు పార్టీతో సన్నిహితంగా పనిచేస్తు ఉండేది. 1943లో క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్న తరుణంలో బ్రిటీషు ప్రభుత్వం ఈ సంస్థను నిషేధించింది.
తొలి ఆంధ్ర మహాసభ సమావేశాలు 1913లో బాపట్లలో జరిగాయి. ఆ సభకు రెండు వేల మంది అతిధులు, 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సభకు కోస్తా, రాయలసీమ ప్రతినిధులతో పాటు, నాగపూరు, వరంగల్, హైదరాబాదులనుండి కూడా ప్రతినిధులు వచ్చారు. ఆంధ్రమహాసభ కాంగ్రేసు పార్టీతో సన్నిహితంగా పనిచేస్తు ఉండేది. 1943లో క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్న తరుణంలో బ్రిటీషు ప్రభుత్వం ఈ సంస్థను నిషేధించింది.
సమావేశాలు
[మార్చు]సంవత్సరము | ప్రదేశం | అధ్యక్షులు |
---|---|---|
1913 | బాపట్ల | బయ్యా నరసింహేశ్వరశర్మ |
1914 | విజయవాడ | న్యాపతి సుబ్బారావు |
1915 | విశాఖపట్నం | పానగల్ రాజా |
1916 | కాకినాడ | మోచర్ల రామచంద్రరావు |
1917 | నెల్లూరు | కొండా వెంకటప్పయ్య |
1918 (ప్ర.స)[2] | గుంటూరు | కాశీనాథుని నాగేశ్వరరావు |
1918 | కడప | నెమిలి పట్టాభి రామారావు |
1919 | అనంతపురం | గాడిచర్ల హరిసర్వోత్తమరావు |
1920 | మహానంది | ఆర్కాట్ రంగనాథ మొదలియారు |
1921 | బరంపురం | కోటగిరి వెంకటకృష్ణారావు (గంపలగూడెం జమీందారు) |
1922 | చిత్తూరు | వేదం వెంకటరాయశాస్త్రి |
1924 | మద్రాసు | కట్టమంచి రామలింగారెడ్డి |
1925 | మచిలీపట్నం | సామి వెంకటాచలం శెట్టి |
1926 | ఏలూరు | మేకా వెంకటాద్రి అప్పారావు, (వుయ్యూరు జమిందారు) |
1927 | అనంతపురం | ఓ. లక్ష్మణస్వామిరావు |
1928 | నంద్యాల | సర్వేపల్లి రాధాకృష్ణన్ |
1929 | విజయవాడ | కె.కోటిరెడ్డి |
1931 | గుంటూరు | వి.వి.జోగయ్య |
1931 (ప్ర.స.)[2] | మద్రాసు | కె.కోటిరెడ్డి |
1932 | విజయవాడ | కె.వి.రెడ్డినాయుడు |
1934 (ప్ర.స.)[2] | విశాఖపట్నం | దేశపాండ్య సుబ్బారావు |
1936 | కాకినాడ | వేమవరపు రామదాసు |
1937 | విజయవాడ | కె.కోటిరెడ్డి (రజతోత్సవ సమావేశం) |
1938 | మద్రాసు | సర్వేపల్లి రాధాకృష్ణన్ |
1939 | గుంటూరు | మాడభూషి అనంతశయనం అయ్యంగార్ |
1941 | విశాఖపట్నం | పూసపాటి విజయానంద గజపతి రాజు |
1943 | బళ్ళారి | పూసపాటి విజయానంద గజపతి రాజు |
1947 (ప్ర. స.) | గుంటూరు | ఉయ్యూరు కుమార్ రాజావారు |
1951 | గుంటూరు | గాడిచర్ల హరిసర్వోత్తమరావు |
మూలాలు
[మార్చు]- ↑ Communism in India: miscellaneous pamphlets
- ↑ 2.0 2.1 2.2 ప్రత్యేక సమావేశం