ఆర్కాట్ రంగనాథ మొదలియారు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్కాట్ రంగనాథ మొదలియారు

ప్రజారోగ్య , ఎక్సైజు శాఖా మంత్రి (మద్రాసు ప్రెసిడెన్సీ)
పదవీ కాలం
డిసెంబర్ 4, 1926 – మార్చి 16, 1928
Premier పి.సుబ్బరాయన్
గవర్నరు George Goschen, 2nd Viscount Goschen
ముందు ఏ.పి.పాత్రో
తరువాత ఎస్.ముత్తయ్య ముదలియారు

వ్యక్తిగత వివరాలు

జననం జూన్ 29, 1879
బళ్ళారి, మద్రాసు ప్రెసిడెన్సీ
మరణం 1950
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ స్వతంత్ర పార్టీ, భారత జాతీయ కాంగ్రెసు
పూర్వ విద్యార్థి మద్రాసు క్రైస్తవ కళాశాల,
మద్రాసు న్యాయ కళాశాల
వృత్తి శాసనసభ్యుడు
వృత్తి న్యాయవాది

ఆర్కాట్ రంగనాథ మొదలియారు (జూన్ 29, 1879 - 1950) భారత రాజకీయనాయకుడు, బళ్ళారికి చెందిన దివ్యజ్ఞాన సమాజస్తుడు. ఈయన 1926 నుండి 1928 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో ప్రజారోగ్య, ఎక్సైజు శాఖా మంత్రిగా పనిచేశాడు.

రంగనాథ మొదలియారు 1879, జూన్ 29న బళ్లారిలోని ముదలియారు కుటుంబంలో జన్మించాడు.[1] రంగనాథ మొదలియారు విద్యాభ్యాసమంతా మద్రాసులోనే సాగింది. మద్రాసు క్రైస్తవ కళాశాల, మద్రాసు న్యాయ కళాశాలల నుండి పట్టభద్రుడై, 1901లో ప్రభుత్వ పేషీలో చేరి, అంచలంచెలుగా ఎదిగి 1915 కళ్లా డిప్యుటీ కలెక్టరై, బళ్లారి జిల్లా డిప్యుటీ కలెక్టరుగా రాజీనామాచేశాడు.[1] తర్వాత కాలంలో, దివ్యజ్ఞాన సమాజంతో ప్రభావితుడై, అనిబీసెంట్ అనుయాయి అయ్యాడు.

రంగనాథ మొదలియారు 1914లో యంగ్ మెన్స్ ఇండియన్ అసోషియేషన్ను స్థాపించి, 1915లో గోఖలే హాలును నిర్మింపజేశాడు. 1924లో అనిబీసెంట్‌తో పాటు జాతీయ సమావేశ సదస్య బృందంలో భాగంగా లండన్ ను సందర్శించాడు.

జస్టిస్ పార్టీ నాయకుడు పానగల్ రాజా యొక్క ప్రోద్భలంతో రంగనాథ మొదలియారు రాజకీయాలలో చేరి, మద్రాసు శాసనమండలికి బళ్ళారి నియోజకవర్గం నుండి పోటీచేసి సభకు ఎన్నికయ్యాడు. 1926 నుండి 1928 వరకు పి.సుబ్బరాయన్ ప్రభుత్వంలో ప్రజారోగ్య, ఎక్సైజు శాఖా మంత్రిగా పనిచేశాడు. 1928లో సైమన్ కమిషన్ రాకను నిరసిస్తూ, మంత్రిగా రాజీనామా చేశాడు. ఈయన స్థానంలో ఎస్. ముత్తయ్య ముదలియారు మంత్రి అయ్యాడు.

రాజీనామా చేసిన తర్వాత రంగనాథ మొదలియారు భారత జాతీయ కాంగ్రేసులో చేరి 1935 నుండి 1939 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు యొక్క ప్రథమ కమీషనరుగా పనిచేశాడు. ఈ పదవిలో ఉన్న నాలుగేళ్లలో ఉండిలో డబ్బులను ప్రతిరోజు లెక్కపెట్టే పద్ధతిని ప్రారంభించాడు. స్వామి వారికి కిరీటాన్ని చేయించాడు. గాన్నన్ డంకర్లీకి కొండమీద ఆలయానికి రోడ్డును మెరుగుపరచేందుకు, వాహనయోగ్యంగా తయారుచేసేందుకు కాంట్రాక్టునిచ్చాడు.[2]

చివరి రోజుల్లో రంగనాథ మొదలియారు, వి.ఆర్.రామలింగ ముదలియారుతో కలిసి హోస్పేటలో ఇండియా సుగర్స్ అనే పంచదార మిల్లును ప్రారంభించాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 The Who's who in Madras: A pictorial who's who of distinguished personages, princes, zemindars and noblemen in the Madras Presidency. Pearl Press. 1940. p. 206.
  2. The Besant influence Archived 2007-09-11 at the Wayback Machine The Hindu, Nov 06, 2006