మాతృభూమి (వారపత్రిక)
స్వరూపం
(మాతృభూమి(వారపత్రిక) నుండి దారిమార్పు చెందింది)
రకం | వారపత్రిక |
---|---|
యాజమాన్యం | అన్నే అంజయ్య |
ప్రచురణకర్త | అన్నే అంజయ్య |
సంపాదకులు | రాజ్యం సిన్హా |
స్థాపించినది | 1947, మద్రాసు |
కేంద్రం | మద్రాసు |
రాజ్యం సిన్హా సంపాదకత్వంలో ఈ వారపత్రిక వెలువడింది. జాతీయ, అంతర్జాతీయ విశేషాలు, రాజకీయ, ఆర్థిక, వైజ్ఞానిక, సాహిత్య, కళా సాంఘిక వ్యాసాలు, గేయాలు, నాటికలు, కథలు మొదలైన విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి. 1947లో ప్రారంభించబడింది. మద్రాసు నుండి వెలువడేది. అన్నే అంజయ్య ఈ పత్రికను నడిపాడు.
శీర్షికలు
[మార్చు]ఈ పత్రికలోని కొన్ని శీర్షికలు:
- పామరుడు వ్యాఖ్యలు
- మా చిన్నకథ
- గ్రంథ సమీక్ష
- రాష్ట్ర వార్తలు
- ప్రపంచం
- రైతాంగం
- కార్మికులు
- మనలోమాట
- వారం వారం
- చిత్రలోకం మొదలైనవి
రచనలు
[మార్చు]మాతృభూమి పత్రికలో వచ్చిన కొన్ని రచనలు ఈ విధంగా ఉన్నాయి.
- దక్షిణ దేశంలో ఆంధ్రులు
- సంఘం పునర్నిర్మాణం
- ప్రపంచ పర్యావలోకనం
- మత రాజకీయాలు ఇక వద్దు
- కాశ్మీరు ఎ నుండి జెడ్ వరకు
- నాలుగు కుటుంబాల చైనా
- రష్యా, బ్రిటన్ భ్రమరకీట న్యాయం
- మంత్రాలకు చింతకాయలు రాలలేదు
- అంతరించిన యుగంలో భారతీయ చిత్రకళ
- సోషలిస్ట్ ఇండియా: మన కర్తవ్యం
- నవ్యాంధ్ర నందనవనానికి వనమాలి:చిలకమర్తి
- హింద్ మజ్దూర్ పంచాయత్
- గాంధీజీ ఆదర్శం: మన ఆర్థిక అభ్యున్నతి
- మాతృత్వం, దేవత్వం
రచయితలు
[మార్చు]ఈ క్రింది రచయితల రచనలు ఈ పత్రికలో వెలుగు చూశాయి.
- రుక్మిణీదేవి అరండేల్
- వడ్లమూడి సీతారామారావు
- అన్నే కోటేశ్వరరావు
- తుర్లపాటి వెంకటకుటుంబరావు
- వి.వి.రమణ
- కె.సభా
- వి.విఠల్ బాబు
- బి.భావనారాయణ
- ఆర్.బి.పెండ్యాల
- దోనేపూడి రాజారావు
- రావి మహానంద
- బొద్దులూరి సత్యనారాయణ
- వడ్డూరి అచ్యుత రామారావు
- మామిళ్లపల్లి రాజమ్మ
- నటరాజ రామకృష్ణ
- అడవి బాపిరాజు
- వాడ్రేవు నారాయణమూర్తి
- గిడుతూరి సూర్యం
- మహతి
- ఉత్పల సత్యనారాయణాచార్య
- గొల్లపూడి సీతారామశాస్త్రి మున్నగువారు.