దోనేపూడి రాజారావు
Jump to navigation
Jump to search
దోనేపూడి రాజారావు | |
---|---|
జననం | 1924 |
విద్య | ఎం. ఎ |
వృత్తి | రచయిత, హిందీ అధ్యాపకుడు |
దోనేపూడి రాజారావు ప్రముఖ రచయిత. ఇతడు కథలు, నవలలు, నాటకాలు అనేకం వ్రాశాడు[1].
విశేషాలు
[మార్చు]ఇతడు 1924లో కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం, కొయ్యగూరపాడు గ్రామంలో జన్మించాడు. ఇతడు ఎం.ఎ. వరకు చదువుకున్నాడు. తెనాలిలోని వి.ఎన్.ఆర్.కళాశాలలో 30 సంవత్సరాలకు పైగా హిందీ అధ్యాపకుడిగా పనిచేశాడు. 1947 నుండి రచనలు చేయడం ప్రారంభించాడు.
రచనలు
[మార్చు]ఇతని రచనలు ఆంధ్రపత్రిక, అనసూయ, మాతృభూమి, యువ, పుస్తకం, స్వాతి, ప్రతిభ, ఆంధ్రప్రభ, ప్రజాతంత్ర, ఆంధ్రజ్యోతి, వసుధ మొదలైన పత్రికలలో వెలువడ్డాయి.
నవలలు
[మార్చు]- ధర్మలోగిలి
- నాగబంధం
- శిథిలరథాలు
- జీవనలీల
- రాజీనామా (అనువాదం)
నాటకాలు/నాటికలు
[మార్చు]- న్యాయం నెగ్గింది
- ధర్మకాటా
- గుజరాతీ ఏకాంకికలు (అనువాదం)
కథలు
[మార్చు]- అంతర్దాహం
- అగ్ని ప్రశ్నలు
- అగ్ని ముఖం
- ఉష్ణగుండం
- ఓరియంట్ ఎక్స్ ప్రెస్
- గోడదెబ్బ - చెంపదెబ్బ
- జగన్నాథుని రథచక్రాలు
- తానొకటి తలిస్తే
- నాడైరీలో రెండుత్తరాలు
- నేరం చిన్నదికాదు
- న్యూవేక్
- పగిలిన అద్దంలో...
- పచ్చదీపం
- పరమహంస
- పాతాళవృష్టి
- బుద్ధి నియంత్రణ
- బ్యూటీటెస్ట్
- భోగిమంటలు
- రెండుత్తరాలు
- విరోధాభాసం
- విషచక్రం
- వ్యతిక్రమం
- సెక్షన్323
- స్వయంవరం
- హత్యలు ఆత్మహత్యలు
- కొత్తడైరీ (కథల సంపుటి)
- మూగ తుమ్మెద (కథల సంపుటి)
ఇతరములు
[మార్చు]- రచయితగా గోపీచంద్
- రవీంద్ర దర్పణం
- అగ్నితరంగాలు (కవిత్వం)
- ఖడ్గసంహారం
మూలాలు
[మార్చు]- ↑ బోనేపూడి, మురళి (24 May 1981). "శ్రీ దోనేపూడి రాజారావు 'నామతం మానవతావాదం'". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 68 సంచిక 52. Retrieved 11 February 2018.[permanent dead link]