అన్నే అంజయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నే అంజయ్య
Anne anjaiah.jpg
జననం1905
కృష్ణా జిల్లాలోని ముదునూరు
మరణంజూన్ 22, 1975
వృత్తి"మాతృభూమి" పత్రికకు సంపాదకులు

అన్నే అంజయ్య (1905 - జూన్ 22, 1975) ప్రముఖ దేశ సేవకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.

ఈయన కృష్ణా జిల్లా లోని ముదునూరు గ్రామంలో జన్మించాడు. ఈయన సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరి, కార్యకర్తల శిక్షణ కోసం వాల్మీకి ఆశ్రమాన్ని నెలకొల్పాడు. మహాత్మా గాంధీని అనుసరించి హైదరాబాద్ సంస్థానంలో ఖాదీ ప్రచారం కొరకు అనేక కేంద్రాలను స్థాపించాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఆరు నెలలు కఠిన కారాగార శిక్షను అనుభవించాడు. 1932 శాసనోల్లంఘనోద్యమంలో కూడా పాల్గొని మరొక ఆరు నెలలు శిక్షకు లోనయ్యాడు. ఈయన "కాంగ్రెస్" అను పేరుతో పత్రిక నడిపాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 33 నెలలు వివిధ కారాగారాలలో ఉన్నాడు.

సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాకు ఆంధ్ర శాఖకు అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేశాడు. "మాతృభూమి" పత్రికకు సంపాదకుడుగా మూడు సంవత్సరాలు పనిచేశాడు.

ఈయన 22 జూన్ 1975 తేదీన హైదరాబాద్లో పరమపదించాడు.