Coordinates: 16°24′14″N 80°54′12″E / 16.403852°N 80.903406°E / 16.403852; 80.903406

ముదునూరు (వుయ్యూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముదునూరు
—  రెవెన్యూ గ్రామం  —
ముదునూరు is located in Andhra Pradesh
ముదునూరు
ముదునూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°24′14″N 80°54′12″E / 16.403852°N 80.903406°E / 16.403852; 80.903406
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం వుయ్యూరు
ప్రభుత్వం
 - సర్పంచి పల్లపోతు శ్రీనివాసరావు
జనాభా (2011)
 - మొత్తం 3,859
 - పురుషులు 1,903
 - స్త్రీలు 1,956
 - గృహాల సంఖ్య 1,171
పిన్ కోడ్ 521261
ఎస్.టి.డి కోడ్ 08676

ముదునూరు, కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన వుయ్యూరు నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 14 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1171 ఇళ్లతో, 3859 జనాభాతో 1220 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1903, ఆడవారి సంఖ్య 1956. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1506 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 3. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589568.[1] సముద్రమట్టానికి 11 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో చినపారుపూడి, బొల్లపాడు, ఏదులమద్దాలి, తాడంకి, పెదపారుపూడి గ్రామాలు ఉన్నాయి.

గ్రామ చరిత్ర[మార్చు]

స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్ర వహించి గాంధీజీ అడుగులో అడుగువేసిన మహనీయులెందరో పుట్టిన గడ్డగా ఈ గ్రామం పేరుగాంచింది. ఆ రోజులలో ఈ గ్రామం తెల్లవారి గుండెల్లో నిద్దురపోయింది. ఎన్నో చారిత్రిక సంఘటనలకు, ఉదంతాలకూ వేదికైనది. ఎంతోమంది సమరయోధులు ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. ఆ సమయంలో ఉత్తేజిత రచనలతో ఈ వూరునుంచే నాడు రహస్య పోరాటపత్రిక, స్వాతంత్ర్యోద్యమ వెలుగుల కరదీపిక "రెడి" రహస్య పత్రిక 1930లో ఇక్కడ ముద్రి తమయ్యేది. గుత్తా వెంకటగిరిరావు, కొల్లి వెంకటదాసు, మొవ్వ రామయ్యల నేతృత్వంలో ఇది వెలువడేది. రోజుకోప్రాంతంలో పెట్టి ముద్రించే సైక్లో స్టైల్ మిషనుని చేతనైతే స్వాధీనం చేసుకోమని బ్రిటిష్ బలగాలకు సవాలు విసిరిన ఘనులు, ఈ వూరి యోధులు. నాడు దానిని పట్టుకోవడం ఎవరివల్లా కాలేదు.

మహాత్మునికి తొలి విరాళం[మార్చు]

ముదునూరుకు 1933 డిసెంబరులో గాంధీజీ విచ్చేశారు. నాటి స్వాతంత్ర్యసమరయోధులు అన్నే అంజయ్య సతీమణి ప్రథమంగా ఉద్యమం కోసం ఆయన చేతికి తన నగల్ని తొలి విరాళంగా అందించారు. దాంతో స్పందించిన గ్రామ మహిళలు వారి నగల్నీ, నగదునూ గాంధీజీకి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంలో గాంధీజీ ప్రసంగం ఉద్వేగభరితంగా సాగిందని చరిత్రకారుల మాట. నిన్న మొన్నటి వరకూ, పలువురు స్వాతంత్ర్యసమరయోధులు గ్రామాభ్యుదయానికీ, విద్యాభివృద్ధికీ బాటలు వేశారు. 1976 లో ఇక్కడ స్వాతంత్ర్యసమరయోధుల సంస్మరణార్ధం స్థూపం నిర్మించారు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి వుయ్యూరులో ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల వుయ్యూరులోను, జూనియర్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు గుడివాడలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు గుడివాడలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం గుడివాడలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ముదునూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

ముదునూరులో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 8 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

ముదునూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 119 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 1 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 9 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 1 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 21 హెక్టార్లు
 • బంజరు భూమి: 5 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1062 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 7 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1081 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ముదునూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 975 హెక్టార్లు
 • బావులు/బోరు బావులు: 105 హెక్టార్లు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

వెంట్రప్రగడ, వుయ్యూరు,అప్పికట్ల, సాయపురము, జబర్లపూడీ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 36 కి.మీ, గుడివాడ-14 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

 1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న విద్యార్థులను, ప్రతి సంవత్సరం నవంబరులో నిర్వహించే జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల పోటీలకు, పాఠశాలలోనే ఉచిత శిక్షణ ఇచ్చుచూ విద్యార్థులను ప్రోత్సహించ్చుచున్నారు. దీనిలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు, 9వ తరగతి నుండి ఇంటరు వరకు ప్రతి సంవత్సరం ఆరువేల రూపాయలు ఉపకారవేతనం అందించుచున్నారు. ఈ పాఠశాలనుండి ప్రతి సంవత్సరం ఒకరిద్దరు విద్యార్థులు ఈ విధంగా లబ్ధిపొందుచున్నారు.
 2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో పల్లపోతు శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనాడు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామదేవత శ్రీ కూరాకుల సుబ్బయ్య బూసిమ్మతల్లి (పేరంటాలు)[మార్చు]

ముదునూరు గ్రామములో సుమారుగా మూడు వందల అరవై సంవత్సరాల క్రితం బూసిమ్మతల్లి గ్రామ పేరంటాలు గా వేలిసినారు ప్రతి సంవత్సరం ముదునూరు గ్రామములో 15 రోజులు పాటు సుబ్బయ్య బూసిమ్మతల్లి తిరునాళ్ళు అత్యంత వైభవంగా కూరాకుల వారి వంశస్థులు జరిపిస్తారు. మాఘశుద్ధ ఏకాదశి రోజు రాత్రి సుబ్బయ్య బూసిమ్మతల్లి అమ్మవారు మేళతాళాలు డప్పు వాయిద్యాలు తో గ్రామ ఊరేగింపు కి బయలుదేరుతుంది ఈ సందర్భంగా బూసిమ్మతల్లి కి భక్తులు పసుపు కుంకుమలు గండదీపాలు ఎదురుగుండా దీపాలు సమర్పిస్తారు. అమ్మవారు గ్రామములో ప్రతి ఇంటికి పల్లకిలో వచ్చి భక్తుల పూజలు అందుకుంటుంది. మరుసటిరోజు సాయంత్రం ఊరేగింపు అనంతరం సుబ్బయ్య బూసిమ్మతల్లి అమ్మవారికి ఉయ్యాల ఉత్సవం జరుగుతుంది. అనంతరం అమ్మవారు ఆలయప్రవేశం జరుగుతుంది.

తిరునాళ్ళ కార్యక్రమాలు

పౌర్ణమి రోజునా కూరాకుల సుబ్బయ్య బూసిమ్మతల్లి కి గ్రామ అధికారిచే గ్రామబోణం కార్యక్రమం జరుపుతారు. తిరునాళ్ళు జరిగే 9వ రోజున కూరాకులవారి వంశస్థులు గంగమ్మతల్లి కి ఇంటిబోణం కార్యక్రమం జరుపుతారు

శిడిబండి

తిరునాళ్ళు జరిగే చివరి రోజులలో కూరాకుల సుబ్బయ్య బూసిమ్మతల్లి అమ్మవారికి శిడిబండి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, ఇతర చూట్టూ ప్రక్కల గ్రామాలకు చెందిన రైతులు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.తిరునాళ్ళు జరిగే రోజులలో గ్రామంలో పండుగ వాతావరణం కనపడుతుంది.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం[మార్చు]

ఇక్కడ ఒక కళ్యాణమంటపం గూడా ఉంది.ఈ ఆలయ 13వ వార్షికోత్సవం, 2016, మే-1వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు.

శ్రీ గంగమ్మదేవరతల్లి ఆలయం[మార్చు]

గ్రామంలోని ఈ అమ్మవారు కుందేరు, కుందేటి వంశస్తుల ఇంటి వేలుపుగా పూజలందుకొనుచున్నారు. అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం 2016,అక్టోబరు-8వతేదీ శనివారంనాడు అత్యంత వైభవంగా నిర్వహించారు.

ప్రముఖులు[మార్చు]

అన్నే అంజయ్య (1905 - 1975) ప్రముఖ దేశ సేవకులు, స్వాతంత్ర్య సమరయోధుడు

గ్రామ విశేషాలు[మార్చు]

 1. ముదునూరు గ్రామంలోని విశ్రాంత హిందీ ఉపాధ్యాయుడు కె.రామలింగేశ్వరరావు, తనకు వచ్చే పింఛనులో మూడోభాగం, సేవాకార్యక్రమాలకు వెచ్చించుచున్నారు. 2004లో పదవీ విరమణ పొందిన వీరు, గ్రామాభివృద్ధితో పాటు, విద్యాప్రగతికి పాటు పడుచున్నారు. కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవాలనే లక్ష్యంతో సేవాకార్యక్రమాలను కొనసాగించుచున్నారు.
 2. ముదునూరుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, విశ్రాంత ఉపాధ్యాయుడ నాగులపల్లి సీతారామయ్య కుమారుడు భాస్కరరావు, ఎస్.ఎస్.ఎల్.సి వరకు, ఈ గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోనే విద్యనభ్యసించారు. ఉన్నత విద్యను వేరే ప్రాంతాలలో చదివి, 40 సంవత్సరాలక్రితం, వ్యాపార రీత్యా ఢిల్లీలో స్థిరపడినారు. కానీ ఆయన తన స్వగ్రామాన్ని మరచిపోలేదు. గ్రామానికి ఏదో ఒక మంచిపని చేయాలనే సదుద్దేశంతో, గ్రామానికి లక్షల రూపాయల వ్యయంతో తనవంతు సాయం అందించుచున్నారు. ప్రతి సంవత్సరం వీరు తన తల్లి సోమదేవమ్మ వర్ధంతి అయిన జూన్-19వ తేదీన గ్రామానికి వచ్చి, వివిధ సేవాకార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. వీరు ప్రస్తుతం ఢిల్లీలో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అను సంస్థకు ఛైరమనుగా ఉన్నారు. వీరు "బ్రెడ్" అను స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యులుగా ఉన్నాడు.
 3. ఈ గ్రామానికి చెందిన ముక్తినేని రవిబాబు, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై, గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4125. ఇందులో పురుషుల సంఖ్య 2070, స్త్రీల సంఖ్య 2055, గ్రామంలో నివాస గృహాలు 1164 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1220 హెక్టారులు.

మూలాలు[మార్చు]

 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]