నాగులపల్లి సీతారామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగులాపల్లి సీతారామయ్య

నాగులపల్లి సీతారామయ్య, గాంధేయవాది. స్వాతంత్ర్య సమరయోధుడు. అతను గ్రామీణ అభ్యున్నతి, సామాజిక సేవలు, సామాజిక న్యాయం వంటి అనేక రంగాలలో తన సేవలనందించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను కృష్ణా జిల్లా ముదునూరుకు చెందినవారు. అతను పునాదిపాడులో 1930లో ఉన్నతపాఠశాలలో చదువుతుండగా ఉప్పు సత్యాగ్రహానికి ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో అజ్ఞాత కార్యకర్తగా చేరాడు. 1942లో అతను 'రడీ' అనే పేరుతో రాత్రివేళ రహస్యంగా పత్రిక ముద్రిస్తూ అరెస్టు కాబడి జైలుకు వెళ్లాడు. జిల్లా గ్రంథాయాల సంఘానికి 18 ఏళ్లు కార్యదర్శిగా, జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల కమిటీకి ఐదేళ్లు కార్యదర్శిగా పనిచేశాడు. సీతారామయ్య రాష్ట్ర గ్రంథాయాల సంఘానికి కార్యనిర్వహక కార్యదర్శిగానూ సేవలందించాడు. కృష్ణా జిల్లా ముదునూరులో 1953లో ఉన్నతపాఠశాలను స్థాపించాడు. దాదాపు 37 ఏళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. విజయవాడలో ఆయన పేరుతోనే సమరయోధుల భవనం ఉంది[1].

అతను 1930లో కాంగ్రెస్ లో చేరాడు. అతను 1932 నుండి స్వాతంత్ర్యోద్యమంలో పనిచేసి 1932 లో శాసనోల్లంఘన సమయంలో "రెడీ" అనే పేరుతో రహస్య పత్రికను నడిపాడు. అతను 1942 వరకు తన కార్యకలాపాలను కొనసాగించాడు. చివరకు అతన్ని అరెస్టు చేసి దోషిగా నిర్ధారించారు. అతను మూడు 3 నెలల సబ్ జైలులో, 1943లో 4 నెలల జైలు శిక్షను అనుభవించాడు. గోరా (గోపరాజు రామచంద్రరావు), అన్నే అంజయ్యలతో కలిసి సంబంధిత రాజకీయ కార్యకర్తలను తయారు చేసి శిక్షణ ఇవ్వడానికి రాజకీయ పాఠశాలలను ఏర్పాటు చేశాడు. ఈ విషయంలో అతను చేసిన కృషికి గుర్తింపుగా, విజయవాడ నడిబొడ్డున స్వాతంత్ర్య సమరయోధులు నిర్మించిన మల్టీస్టోరీడ్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్‌కు “నాగులపల్లి సీతారామయ్య కాన్ఫరెన్స్ హాల్” అని పేరు పెట్టారు.

1935 నుండి 1975 మధ్య అతను ‘గోరా’తో కలిసి సామాజిక విందుల భావనను ప్రోత్సహించాడు. అతను కుల రహిత వర్గాలతో అనేక కార్యక్రమాలను నిర్వహించాడు.

అతను మహాత్మా గాంధీని ముదునూరుకు ఆహ్వానించాడు. 1933 లో హరిజనుల కోసం ఆలయ (శివాలయం) ప్రవేశాన్ని ఏర్పాటు చేశాడు.[2]

మరణం

[మార్చు]

అతను హైదరాబాద్‌లోని తన కుమారుని ఇంట్లో 2013 జూలై 21న తుదిశ్వాస విడిచాడు. అతనికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. Dr.seshagirirao-mbbs (2013-04-03). "Telugu Eminent Persons - తెలుగు మహానుభావులు: Freedom fighter Sitaramayya,స్వాతంత్ర్య సమరయోధుడు సీతారామయ్య". Telugu Eminent Persons - తెలుగు మహానుభావులు. Retrieved 2020-01-20.[permanent dead link]
  2. hansindia (2013-07-26). "Nagulapalli, a true Gandhian". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-01-20.

బయటిలింకులు

[మార్చు]