గుంటూరు శేషేంద్ర శర్మ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గుంటూరు శేషేంద్ర శర్మ | |
---|---|
జననం | నాగరాజపాడు, నెల్లూరుజిల్లా | 1927 అక్టోబరు 20
మరణం | 2007 మే 30 హైదరాబాదు | (వయసు 79)
భార్య / భర్త | జానకి [1] |
పిల్లలు | వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు) |
తండ్రి | సుబ్రహ్మణ్య శర్మ |
తల్లి | అమ్మాయమ్మ |
గుంటూరు శేషేంద్రశర్మ, తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త, వక్త. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితుడు. వచన కవిత్వం, పద్యరచన - రెండింటిలో సమాన ప్రతిభావంతుడు. ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.[ఆధారం చూపాలి] బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.[ఆధారం చూపాలి] కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు.ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి.[2] "నా దేశం-నా ప్రజలు" 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది.[ఆధారం చూపాలి]
జీవిత విశేషాలు
[మార్చు]శేషేంద్ర శర్మ 1927 అక్టోబర్ 20న నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, నాగరాజుపాడులో జన్మించాడు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాక, మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ పొందాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మునిసిపల్ కమిషనరుగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. 2007 మే 30 రాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు. ఆయన భౌతిక కాయానికి మే 31న అంబర్‌పేట శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. పోలీసులు మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవం వందనం సమర్పించారు. శేషేంద్ర కుమారుడు సాత్యకి చితికి నిప్పటించాడు. శేషేంద్రకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[3]
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ముఖ్య పురస్కారాలు.[ఆధారం చూపాలి] గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు. నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడశి రామాయణ రహస్యాలు, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు. కవిత్వంలో, సాహిత్య విమర్శలో విలక్షుణులు.
శేషేంద్ర శర్మ కూడా యుగ విభజన చేసి తనది కూడా సహేతుకమైన యుగ విభజన అంటూ 1. వాచ్యార్థ ప్రధానయుగం, 2. లక్షణార్థ ప్రధానయుగం, 3. ద్వితీయ వాచ్యార్థ ప్రధానయుగం, 4. ద్వితీయ లక్షణార్థ ప్రధానయుగం అని విభజించాడు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు, వచన కవిత్వం, పద్యరచన - రెండిటిలో సమాన ప్రతిభావంతులు, ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
కవి : విమర్శకుడు
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ……….
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, (21 ఆగస్టు, 2000)
- * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు. భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు. నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు. కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు. ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు, వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు, ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత. వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు. బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. ఒకానొకశైలీనిర్మాత.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం) అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర “గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975)
ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది.
అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో
కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు.
విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి
నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ
సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు.
కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో
మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.” ఆచార్య పేర్వారం జగన్నాథం సంపాదకుడు అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు, (ప్రచురణ 1987) మాజీ వైస్ ఛాన్సలర్, తెలుగు యూనివర్సిటీ) Visionary Poet of the Millennium seshendrasharma.weebly.com
రచనలు
[మార్చు]- 1951 - "సోహ్రాబ్ - రుస్తుమ్" అనే పారశీక రచన తెలుగు అనువాదం (ఆంగ్ల రచననుండి)
- 1968-72 - శేషజ్యోత్స్న - కవిత, వచన రచనల సంకలనం
- 1974 - మండే సూర్యుడు
- 1974 - రక్తరేఖ
- 1975 - నా దేశం - నా ప్రజలు
- 1976 - నీరై పారిపోయింది
- 1977 - గొరిల్లా
- నరుడు - నక్షత్రాలు
- సాహిత్య దర్శిని
- కామోత్సవ్ - నవల
- షోడశి - రామాయణ రహస్యములు
- స్వర్ణ హంస
- ఆధునిక మహాభారతం
- జనవంశం
- కాలరేఖ
- కవిసేన మేనిఫెస్టో
- మబ్బుల్లో దర్బార్...
- 1968 - సాహిత్య కౌముది
- ఋతు ఘోష
- ప్రేమ లేఖలు
అవార్డులు
[మార్చు]- 1993 - సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం
- శేషేంద్ర రచించిన కాలరేఖకు 1994 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
- రాష్ట్రీయ సంస్కృత ఏకతా పురస్కారం
- 1994 - తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్
- భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం,
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
- కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు
సినిమా పాట
[మార్చు]శేషేంద్ర శర్మ, 1975లో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా ముత్యాలముగ్గులో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే ప్రసిద్ధమైన పాట రాశాడు.[1] ఆ సినిమాలో అధిక భాగం శేషేంద్ర నివాసమైన జ్ఞానబాగ్ పాలెస్ లో చిత్రీకరించబడింది. ఇది ఈయన సినిమాల కోసం రాసిన ఒకే ఒక్క పాట.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-06-09. Retrieved 2007-05-31.
- ↑ http://seshendrasharma.weebly.com/
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-06-01. Retrieved 2007-05-31.
బయటి లింకులు
[మార్చు]- శేషేంద్ర శర్మపై సమగ్ర సమాచారమున్న వెబ్ పేజీ
- మ్యూస్ఇండియా.కాం లో శేషేంద్ర శర్మపై ఒక వ్యాసం
- గ్రేటెస్ట్ సిటీస్.కాం లో శేషేంద్ర శర్మపై ఇంకో వ్యాసం
- డీఎల్ఐలో మండే సూర్యుడు కవితా సంకలనం
- శేషేంద్రశర్మ రాసిన చివరి కవిత, "పువ్వులు, పువ్వులు, పువ్వులు" (ఈమాట వెబ్ పత్రిక నించి)
- శేషేంద్రశర్మ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ (ఈమాట వెబ్ పత్రిక నించి)
- విస్తరించవలసిన వ్యాసాలు
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- 1927 జననాలు
- 2007 మరణాలు
- తెలుగు రచయితలు
- నెల్లూరు జిల్లా రచయితలు
- నెల్లూరు జిల్లా కవులు
- నెల్లూరు జిల్లా సినిమా పాటల రచయితలు
- నెల్లూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ రచయితలు