ఆచార్య తిరుమల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆచార్య తిరుమల ప్రముఖ కవి. ఇతడు 1945లో రాజమండ్రిలో జన్మించాడు. పెంటపాడు, ఏలూరు, విశాఖపట్నం లలో చదువుకున్నాడు. హైదరాబాదులో ఒక ప్రైవేటు కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు. వచన, పద్య, గేయకవిత్వాలు, నాటకము, విమర్శ, కథానిక ప్రక్రియలలో పాతికకు పైగా గ్రంథాలను వెలువరించాడు.

రచనలు[మార్చు]

  1. యమునాతటి
  2. కవి దర్శనం
  3. అమృత నేత్రాలు[1]
  4. నవ్వుటద్దాలు
  5. చక్రధ్వజం
  6. యుగద్రష్ట
  7. తెలుగు తెమ్మెరలు
  8. శ్రీ రామనామసుధ
  9. కవితా కళ
  10. ఆధునిక కవిత - అభిప్రాయవేదిక[2] (సంపాదకత్వం)
  11. పల్లవి
  12. హృదయభారతి
  13. స్వరవల్లరి
  14. గీతాభాషిణి
  15. రాగానందం
  16. గేయనందిని
  17. రాళ్ళ గాజులు
  18. చక్రార పంక్తి
  19. స్వేచ్ఛా భారతి
  20. వచన భగవద్గీత
  21. మాట్లాడే మల్లెలు

లలిత గీతాలు[మార్చు]

ఇతడు రచించిన లలితగీతాలు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారమయ్యాయి. ఇతడు రచించిన కొన్ని లలితగీతాల వివరాలు:

గీతం సంగీతం గానం ఇతర వివరాలు
దేశము మీరై తేజము మీరై మహాభాష్యం చిత్తరంజన్ బృందగానం
ఏ గీతము నీ రీతిగ వినిపించెడుదాన మహాభాష్యం చిత్తరంజన్ శాంతా చారి
వెలిగించు శాంతి దీపం మహాభాష్యం చిత్తరంజన్ మహాభాష్యం చిత్తరంజన్
నయనాలకు సుందర బిందువు మహాభాష్యం చిత్తరంజన్ సి.పద్మజ
ఉంటే భుజాన నాగలి మహాభాష్యం చిత్తరంజన్
నీలో ఉన్నదేదో మహాభాష్యం చిత్తరంజన్
ఈ వెన్నెలలోన నీ కన్నులలోన విన్నకోట మురళీకృష్ణ
పాడనా నేనీ రేయి పి.వి.సాయిబాబా
పాలింపవే నను గీర్వాణీ నల్లూరి సుధీర్ కుమార్
జోజో వెన్నెలమ్మా ఎం.ఆర్.కె. ప్రభాకర్
నిదురపోవే తల్లి కె.రామాచారి
పూవులే పిలిచే వేళ మహాభాష్యం చిత్తరంజన్ విజయలక్ష్మీ శర్మ
మానవజీవనం మధుమాసం మహాభాష్యం చిత్తరంజన్ శాంతా చారి రాగమాలిక
ఇది నా దేశం భారతదేశం పి.వి.సాయిబాబా విజయలక్ష్మీ శర్మ, కె.బి.కె.మోహన్ రాజు

పురస్కారాలు[మార్చు]

బిరుదులు[మార్చు]

  • కవికౌస్తుభ
  • సాహితీస్వరాట్
  • మధురభారతి

మూలాలు[మార్చు]