Jump to content

మహాభాష్యం చిత్తరంజన్

వికీపీడియా నుండి
మహాభాష్యం చిత్తరంజన్
జననం1938 ఆగస్టు 25
హైదరాబాదు
మరణం2023 జూలై 21(2023-07-21) (వయసు 84)
వృత్తిఆకాశవాణిలో లలిత గీతాల రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1971- 1998
గుర్తించదగిన సేవలు
లలిత సంగీత సౌరభం, లలిత సంగీతం-80 సంగీత సారస్వత మలయమారుతాలు తదితర పుస్తకాలు
జీవిత భాగస్వామిడా.పద్మిని
పిల్లలుఅమృతవల్లి
(మూడో కుమార్తె )
శ్రీనివాస హరీష్ (కుమారుడు)
తల్లిదండ్రులు
  • రంగాచారి (తండ్రి)
  • పేరిందేవి (తల్లి)

మహాభాష్యం చిత్తరంజన్ (1938 ఆగస్టు 25 - 2023 జూలై 21) ప్రముఖ లలిత గీతాల రచయిత, సంగీత దర్శకుడు. ఆయన ఆల్ ఇండియా రేడియోలో చాలాకాలం పనిచేశాడు. ఆకాశవాణిలో ప్రసారమైన అనేక లలితగీతాలకు స్వరకల్పన చేశాడు.

ఎనిమిదేళ్ల వయసు నుంచి నిజాం ప్రభుత్వ హయాంలోని దక్కన్‌ రేడియోలో పాడటం మొదలుపెట్టిన ఆయన ఆరు దశాబ్దాలకు పైగా లలిత సంగీతానికి సేవలందించాడు. 1972లో ఆలిండియా రేడియోలో ‘ఏ’ గ్రేడ్‌ గాయకుడిగా గుర్తింపు పొందాడు. 2008లో ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక మండలి ఆయనను కళారత్న బిరుదుతో సత్కరించింది.[1]

రచనలు

[మార్చు]

ఇతడు వెలువరించిన పుస్తకాలు:

  1. లలిత సంగీతం: 80 సంగీత సారస్వత మలయమారుతాలు
  2. లలిత సంగీత సౌరభం
  3. శ్రీ చిత్తరంజనం: కీర్తనలు, లలిత భక్తి గీతాలు, మంగళహారతులు

లలిత గీతాలు

[మార్చు]

ఇతడు స్వరపరచిన లలిత గీతాల జాబితా:

గీతం రచన గానం ఇతర వివరాలు
నదీసుందరి సుధాస్యందిని దేవులపల్లి కృష్ణశాస్త్రి మహాభాష్యం చిత్తరంజన్ 1957లో రచించారు ఈ పాట
చూచే కొలదీ సుందరము బోయి భీమన్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1988లో ఈ మాసపు పాట - ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం
చూచేకొలదీ సుందరము డా.బోయి భీమన్న కె.బి.కె.మోహన్ రాజు
మోహన రాగ రాగిణి డా.బోయి భీమన్న కె.బి.కె.మోహన్ రాజు
ఏ గాలి వడిరాలి డా.బోయి భీమన్న మోహన రాగం
ఎత్తవోయీకేల యీ బేల సుమబాల డా.బోయి భీమన్న శాంతా చారి
ఆరాధింతును డా.బోయి భీమన్న శాంతా చారి
ఎవ్వరిదోయీ ఈ రేయి డా.దాశరథి కృష్ణమాచార్య కె.బి.కె.మోహన్ రాజు
నింగిపై నీలాల తెరపై ఓలేటి శశాంక కె.బి.కె.మోహన్ రాజు
గుండెల్లో ఉండాలి కులాసా దేవులపల్లి కృష్ణశాస్త్రి కె.బి.కె.మోహన్ రాజు
పయనించు సెలయేటి డా.బోయి భీమన్న మహాభాష్యం చిత్తరంజన్
ఎంత కాలమాయెరా డా.బోయి భీమన్న కనకవల్లీ నాగేందర్
ముదురు ముదురు వెన్నెలలో ముదిగొండ వీరభద్రమూర్తి
మరపురాని కలలు కని మల్లవరపు విశ్వేశ్వరరావు
తెప్పవోలె చంద్రబింబం మల్లవరపు విశ్వేశ్వరరావు
వదలండీ ద్వేషం మనసులు విరిచే విషం మల్లవరపు విశ్వేశ్వరరావు
మరవకుడీ ఓ ప్రజలారా మన గాంధి మహాత్ముణ్ణి మల్లవరపు విశ్వేశ్వరరావు
జైహిందని నిద్దుర లేవండి మల్లవరపు విశ్వేశ్వరరావు చైనాయుద్ద సమయంలో పాట
ఇదెవత్తునని చెప్పి మటిమాయమయ్యె ఓలేటి శశాంక శాంతా చారి కాంతామణి రాగం
కొమ్మల్లో చిక్కుకున్న కొంటె చందమామ ఓలేటి శశాంక
దూర దూర గగనాలకు సాగుదాం ఓలేటి శశాంక
వలరాజు నా మీదనా ఓలేటి శశాంక
దూరతీరాలలో ఆ పిలుపు ఎవరిదో డా.ఎం.పద్మినీ దేవి శాంతా చారి పీలు రాగం
ప్రణయానికి చల్లదనం విరహానికి వెచ్చదనం కోపల్లె శివరాం శాంతా చారి యమన్ రాగం
మధురోహలు ఊగే మలయసమీరం బొమ్మనబోయిన సోమసుందరం శాంతా చారి పహాడీ రాగం
మానవజీవనం మధుమాసం డా.ఆచార్య తిరుమల శాంతా చారి రాగమాలిక
ఏల యీ మధుమాసము డా.సి. నారాయణరెడ్డి
ఓహో నా కలువ కన్నెలారా డా.సి. నారాయణరెడ్డి రాగం సారంగ
సారేజహాన్ సే అచ్ఛా డా.సి. నారాయణరెడ్డి పల్లవి ఇక్బాల్ రచన. చరణాలు నారాయణరెడ్డి రచించారు ఈ పాటలో
మీరా చరితమ్మును డా.సి. నారాయణరెడ్డి
చిరునవ్వును పలికించే డా.సి. నారాయణరెడ్డి
మృగనయనా రసికమోహినీ వోలేటి వెంకటేశ్వర్లు దర్బారీ కానడ రాగం
హోలీ ఇదేనోయ్ హోలి వోలేటి వెంకటేశ్వర్లు కేదార్ రాగం
ఎవరికున్నది ఇంత శక్తి డా.వేటూరి ఆనందమూర్తి వేదవతీ ప్రభాకర్ 1974 అక్టోబర్ ఈ మాసపు పాట
కొమ్మలో కోయిలనై పూయనా వేదవతీ ప్రభాకర్
విరబూసి యిరుల తరులు వేదవతీ ప్రభాకర్
నా అన్నవారెవరు వేదవతీ ప్రభాకర్
ఈ తరం మారిందిరా అంతరం లేదందిరా డా.వేటూరి ఆనందమూర్తి
వందనమభివందనం డా.వేటూరి ఆనందమూర్తి
ధన్యవహో మాతృభూమి డా.వేటూరి ఆనందమూర్తి
ఇది చల్లని తల్లిరా కోపల్లె శివరాం
దేశము మీరై తేజము మీరై డా.ఆచార్య తిరుమల బృందగానం
ఏ గీతము నీ రీతిగ వినిపించెడుదాన డా.ఆచార్య తిరుమల శాంతా చారి
వెలిగించు శాంతి దీపం డా.ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్
నయనాలకు సుందర బిందువు డా.ఆచార్య తిరుమల సి.పద్మజ
ఉంటే భుజాన నాగలి డా.ఆచార్య తిరుమల
నీలో ఉన్నదేదో డా.ఆచార్య తిరుమల
పదిలమహో పదిలమహో బాలంత్రపు రజనీకాంతరావు మహాభాష్యం చిత్తరంజన్
మరపురాని కలలు కని మల్లవరపు విశ్వేశ్వరరావు మహాభాష్యం చిత్తరంజన్ ఈ మాసపు పాట
ఇది మన భారతదేశం డా.జె.బాపురెడ్డి
కోకిలా నా పాట కూడా వినిపించుకో డా.జె.బాపురెడ్డి కె.బి.కె.మోహన్ రాజు ఈ మాసపు పాట
వెలుగు పండే తెలుగు తీరంలో విలయ తిమిరం తాండవించింది డా.జె.బాపురెడ్డి మహాభాష్యం చిత్తరంజన్ 1977 కోస్తా తుఫాన్ అప్పటి పాట
నా దేశం నవ్వుతూంది నందనవనంలా డా.జె.బాపురెడ్డి ఎం.ఎస్.రామారావు ఈ మాసపు పాట
మురళి ఏదో నా మదిలో డా.జె.బాపురెడ్డి మాడపాటి సరళారాణి
నను విడబోకుమా క్షణమైన ప్రియతమా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ శివకామేశ్వరి శివరంజని రాగం
నీలి నీలి గగనంలో ఒక తార మెరిసింది ఫాదర్ మాథ్యూస్ రెడ్డి కె.బి.కె.మోహన్ రాజు, వేదవతీ ప్రభాకర్ శివరంజని రాగం
మాధవా మాధవా ఎ.వి.సావిత్రి
మరల కొత్త చిగురులు ఎ.వి.సావిత్రి
హృదయాల తోటలు పూయగా డా.దాశరథి కృష్ణమాచార్య మహాభాష్యం చిత్తరంజన్, శాంతా చారి, ఎ.వి.సావిత్రి
రమ్మంటే చాలుగాని డా.దాశరథి కృష్ణమాచార్య
పూవులే పిలిచే వేళ డా.ఆచార్య తిరుమల విజయలక్ష్మీ శర్మ
ఎంత రాతి మనసు నీది శారదా అశోకవర్ధన్ విజయలక్ష్మీ శర్మ
పదిమందికి చాటాలి ఈ మాట పదే పదే పాడాలి ఈ పాట శారదా అశోకవర్ధన్
నవ్వకే నెలవంక నవ్వకే జొన్నవాడ రాఘవమ్మ విజయలక్ష్మీ శర్మ
పిల్లన గ్రోవి మెల్లన ఊది జొన్నవాడ రాఘవమ్మ విజయలక్ష్మీ శర్మ
అనురాగ మందిరాన మైత్రేయ విజయలక్ష్మీ శర్మ
పిడికెడు యెదలో పాలవెల్లువలు వి.సంపత్ కుమార్ విజయలక్ష్మీ శర్మ బిందుమాలిని రాగం
దేవా దీనబంధు రావా దయాసింధు డా.ఎం.పద్మినీ దేవి నఠభైరవి రాగం
మరచితివా నను పరమేశ్వరి డా.బి.ఆర్.శాస్త్రి నఠభైరవి రాగం
ఓ నవభారత జాతిపితా వింజమూరి శివరామారావు నఠభైరవి రాగం
నేల నవ్వుతోందా ఓలేటి శశాంక కె.బి.కె.మోహన్ రాజు ఈ మాసపు పాట
అంతులేని ఆశలున్న అంతరంగమా డా.వడ్డేపల్లి కృష్ణ
జగతిరథం జైకొడుతూ డా.వడ్డేపల్లి కృష్ణ
వెన్నెలంత చల్లనిదీ స్నేహము డా.వడ్డేపల్లి కృష్ణ
మళ్ళీ జన్మించు ప్రభూ డా.వడ్డేపల్లి కృష్ణ మానాప్రగడ నరసింహమూర్తి
మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి డా.వడ్డేపల్లి కృష్ణ
వేయి తీయని భావనలు ఈ రేయి విరిసినవే చెలీ పి.వి.రోహిణీ కుమార్ సరసాంగి రాగం
నిదురలేని ఈ రేయి ఎటుల గడచేనో డా.ఎం.పద్మినీ దేవి సరసాంగి రాగం
ఆసేతు హిమశీతలం బొమ్మనబోయిన సోమసుందరం
దశరధనందన రామా ఘనశ్యామా మునికామా నరసదాసు
కేశవ మాధవ గోవిందాయని కీర్తన సేయుట యెన్నటికో నరసదాసు
నన్ను గన్నయ్యా ననుగనవయ్యా నరసదాసు
రామా నా ముందు నిలిచి నరసదాసు
ఎంతని కీర్తింతునురా ఏమో నీ కరుణ కలుగ పుట్టపర్తి నారాయణాచార్యులు
మనసు విషయకామాదుల కొసగితె మాధవసేవౌనా పుట్టపర్తి నారాయణాచార్యులు
మతమంటే ఏమిటన్నా పుట్టపర్తి నారాయణాచార్యులు
నామరూప రహితుండవైన పుట్టపర్తి నారాయణాచార్యులు
కొమ్మరో విరిరెమ్మరో కోపల్లె శివరాం హంసధ్వని రాగం. 'త్రిపథ' సంగీత రూపకంలోనిది
వచ్చెను కనవే ఆమని వన్నెలు చిందే యామిని డా.ఎం.పద్మినీ దేవి జంఝూటి రాగం
ప్రతి హృదయం ఊగుతుంది ఆనందడోలిక డా.ఎం.పద్మినీ దేవి
ప్రతిపూవులో సొగసుందిలే పెద్దింశెట్టి సత్యనారాయణ ఎమ్.ప్రసన్నలక్ష్మి నాసికాభూషణి రాగం. 1995లోఈ మాసపు పాట
తిమిరాలను ఛేదించే సమరాలే దీపాలు సుధామ
మీరా చరితమ్మును డా.సి. నారాయణరెడ్డి
నీ దయారసవాహిని డా.ఎం.పద్మినీ దేవి
తెష్టవోలె చంద్రబింబం మల్లవరపు విశ్వేశ్వరరావు

మరణం

[మార్చు]

85 ఏళ్ల మహాభాష్యం చిత్తరంజన్‌ 2023 జూలై 21న హైదరాబాద్‌లో కన్నుమూశారు.[2] ఆయన భార్య డా.పద్మిని, పెద్ద కుమార్తె విజయలక్ష్మి దేశికన్‌, రెండో కుమార్తె వందన పవన్‌ గతంలోనే మృతిచెందారు.

మూలాలు

[మార్చు]
  1. "లలిత సంగీత శిఖరం.. చిత్తరంజన్‌ ఇకలేరు |". web.archive.org. 2023-07-22. Archived from the original on 2023-07-22. Retrieved 2023-07-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "ప్రముఖ లలిత సంగీతకారుడు చిత్తరంజన్‌ కన్నుమూత | Popular classical musician Chittaranjan passed away". web.archive.org. 2023-07-22. Archived from the original on 2023-07-22. Retrieved 2023-07-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)