ఓలేటి శశాంక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓలేటి శశాంక
శశాంక
జననంఓలేటి సుబ్బారావు
ప్రసిద్ధికవి
భార్య / భర్తహైమవతి
పిల్లలుఓలేటి పార్వతీశం,
సుభద్ర
తండ్రిఓలేటి పార్వతీశం

ఓలేటి శశాంక ప్రముఖ రచయిత. జంటకవులు వేంకట పార్వతీశ కవులలో ఒకరైన ఓలేటి పార్వతీశం ఇతని తండ్రి.[1] ఇతని అసలు పేరు ఓలేటి సుబ్బారావు. ఇతడు గేయకవిగా, భావకవిగా ప్రసిద్ధి చెందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి రచయితల సంఘానికి స్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతడు ప్రముఖ కవి కందుకూరి రామభద్రరావు కుమార్తె హైమవతిని 1954లో వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం జరిగిన రోజు ఇతని ఖండకావ్య సంపుటి "నయాజమానా" ఆవిష్కరణ జరిగింది. [2]

లలిత గీతాలు[మార్చు]

ఇతని కలం నుండి వెలువడిన లలిత గీతాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. వాటిలో కొన్ని వివరాలు:

గీతం సంగీతం గానం ఇతర వివరాలు
ఇదెవత్తునని చెప్పి మటిమాయమయ్యె మహాభాష్యం చిత్తరంజన్ శాంతా చారి కాంతామణి రాగం
కొమ్మల్లో చిక్కుకున్న కొంటె చందమామ మహాభాష్యం చిత్తరంజన్
కోపమా ప్రియతమా మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
చాటాలిరోయన్న శాంతి సందేశం పాలగుమ్మి విశ్వనాథం
తొలిప్రొద్దు రేయిలో ఈమని శంకరశాస్త్రి
దూర దూర గగనాలకు సాగుదాం మహాభాష్యం చిత్తరంజన్
నింగిపై నీలాల తెరపై మహాభాష్యం చిత్తరంజన్ కె.బి.కె.మోహన్ రాజు
నేల నవ్వుతోందా మహాభాష్యం చిత్తరంజన్ కె.బి.కె.మోహన్ రాజు ఈ మాసపు పాట
రావమ్మ స్వాతంత్ర్య భారత సావిత్రీ పాలగుమ్మి విశ్వనాథం
వలరాజు నా మీదనా మహాభాష్యం చిత్తరంజన్
శిరసెత్తు గగనమ్ము దాకా పాలగుమ్మి విశ్వనాథం
సెలవింక నెలవంక ఎస్.బ్రహ్మానందం ఎస్.బ్రహ్మానందం నాసికా భూషిణి రాగం
స్వాతంత్ర్యమే నా జీవితాశయని పాలగుమ్మి విశ్వనాథం శాంతా చారి

రచనల నుండి ఉదాహరణ[మార్చు]

ఇతని రచనలలోని సత్తాను తెలుసుకోవడానికి మచ్చుకు ఒక గేయంలో కొంత భాగం. ఇది ఉదయ ఘంటలు అనే కవితా సంకలనం నుండి గ్రహించబడినది.[3]

 

నయా జమానా

శ్రీకారం నిర్మించిన సాలిగూళ్ళలో దాగిన
గరళమ్మీ ప్రపంచమై...
దౌత హిమాచలోచ్చలిత జలదాలే
జీవిత ఋతుపవానాలై...
పర్జన్యపు గర్జనలే
జగజ్జనుల నినదాలై...
భూవలయిత బాధార్ణవ
తరంగాల ఆర్తరుతులు
ఆకాశపుటవధులలో
ప్రతిధ్వనిత గాత్రాలై...
ఆకాశపు మహాదర్శదర్శనలో
రక్తాక్షత జగద్దేహ
చలనం ప్రతిబింబితమై...
శ్రమాఖిన్న విశ్వషాల
స్నపిత శ్వేదఝరీవారి
వియత్తల సువిశాలాక్షి
ఆర్ద్ర హృదయ వీక్షణలై...
గంగా, యమునా, గౌతమి,
వాల్గా, డాన్యూబు, థేమ్సు,
ఒరెనాకో, నైలు, రైను,
నయాగార, జరామాలు,
హోయాంగ్ హో, స్వర్ణముఖీ,
యాంగ్-సీ-ఐరావతీ
మహానదుల ప్రవాహాలు
విప్లవ జనసమూహమై...
ప్రాచ్యప్రతీచీ మహోదధీ
హృదయాంతర జ్వలిత
అరుణోదయ రాగసంధ్య
భూగోళాందోళనలో
ఆరోహిత కేతకమై
పురోగామి దీపకమై...
విశ్వశ్రామిక హృదయం
విలపించే సముద్రమై
త్రికాలాల ప్రభవించే
ప్రకృతిలీల విచిత్రమై
...............
...............
...............
...............
నవగానా లాలపించి మ్రోగుతోంది శరీరం...
నవరాగము మేళవించి తిరుగుతోంది భూగోళం...
నవజీవము మేలుకొలిపి ప్రసరించెను సమీరం...
నవకాంతుల రంగరించి రగులుతోంది ఖగోళం!

మూలాలు[మార్చు]

  1. "ప్రసార ప్రముఖులు/దూరదర్శన్ కేంద్రం - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-05-17.
  2. కందుకూరి, నటరాజు (1 July 2017). "కల్యాణ ప్రాంగణంలో కవనకన్య". సాహితీ కిరణం మాసపత్రిక. 9 (5): 17–19.
  3. ఉదయఘంటలు పుటలు:85-88