ఉదయ ఘంటలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉదయ ఘంటలు
కృతికర్త: 56మంది కవులు
సంపాదకులు: తెలంగాణా రచయితల సంఘం
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: గేయకవితా సంపుటి
విభాగం (కళా ప్రక్రియ): తెలుగు సాహిత్యం
ప్రచురణ: దేశోద్ధారక గ్రంథమాల, హైదరాబాదు
విడుదల: 1953
పేజీలు: 200


ఉదయ ఘంటలు తెలంగాణా రచయితల సంఘం సంపాదకత్వంలో వెలువడిన అఖిలాంధ్ర కవుల గేయ సంపుటి.[1] దీనిని వట్టికోట ఆళ్వారుస్వామి ఆధ్వర్యంలో నడిచిన దేశోధ్ధారక గ్రంథమాల తన 15వ ప్రచురణగా 1953, డిసెంబరు నెలలో హైదరాబాదు నుండి వెలువరించింది. ఈ సంపుటిలో 56గురు సుప్రసిద్ధ కవులు రచించిన 82 శీర్షికలు ఉన్నాయి. ఈ గేయకవితలు దేశీయ సాంఘిక సమస్యలు, ఆర్థిక సమస్యాలోపాలు, ప్రపంచ క్లిష్ట పరిస్థితులు, పీడిత మానవ సంఘటనలను ఇతివృత్తాలుగా కలిగి ఉన్నాయి. ఈ పుస్తకానికి కిర్మీరం పేరుతో సంపాదకీయం తెలంగాణా రచయితల సంఘం వ్రాసింది.

గేయాల జాబితా

[మార్చు]
క్రమ సంఖ్య గేయము పేరు కవి పేరు
1 అగ్నివీణ మల్లవరపు విశ్వేశ్వరరావు
2 ఓ భ్రమరీ!! పుట్టపర్తి నారాయణాచార్యులు
3 ఇన్‌ఖిలాబ్ పురిపండా అప్పలస్వామి
4 కోలాహలం విద్వాన్ విశ్వం
5 బరువు బండి పిలకా గణపతిశాస్త్రి
6 కాలిబాట పొట్లపల్లి రామారావు
7 సామాన్యుని కామన శ్రీ శ్రీ
8 వేదాంతం సి.వి.కృష్ణారావు
9 కొత్త పెళ్ళి పన్యాల రంగనాథరావు
10 పోటీ తెన్నులు కాళోజీ నారాయణరావు
11 ఓక్కా ఓ చెలియా! ఆరుద్ర
12 ఏ గంట? కొనకళ్ల వెంకటరత్నం
13 మస్తిష్కంలో లేబొరేటరీ దాశరథి కృష్ణమాచార్య
14 విగతం తరణమత్ర వైతరణి రెంటాల గోపాలకృష్ణ
15 గోదానది పొంగింది రాంషా
16 శర్వరీ గీతం ఆవంత్స సోమసుందర్
17 ఓ సఖా! ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
18 జలదగీతి సి.నారాయణరెడ్డి
19 ఉషోబాల వి.దుర్గాప్రసాదరావు
20 పిలుపు మసూనా
21 ఆవల నార్ల వెంకటేశ్వరరావు
22 నవోదయం కరుణశ్రీ
23 ఆత్మ ఘోష ప్రయాగ కోదండరామశాస్త్రి
24 జీవన చిత్రణ పల్లా దుర్గయ్య
25 ధమ్మఘోష కె.వి.రమణారెడ్డి
26 నటరాట్టు పఠాభి
27 మధ్యాహ్నం వేళ ఆలూరి బైరాగి
28 చావని సంతానం తాళ్ళూరి రామానుజస్వామి
29 గాలి వాన వానమామలై వరదాచార్యులు
30 శాంతి దేవులపల్లి కృష్ణశాస్త్రి
31 ఆంధ్రగీతి పైడిమర్రి సుబ్బరామశాస్త్రి
32 కవి హృదయం అమరేంద్ర
33 బతుకు కిటుకు ఊటుకూరి రంగారావు
34 నవ భవనం నారపరెడ్డి
35 మరామత్ వేముగంటి నరసింహాచార్లు
36 నయాజమానా ఓలేటి శశాంక
37 సముద్ర ఘోష బులుసు-జీ-ప్రకాష్
38 పాముపాట కనకమేడల
39 మహారాత్రి భాగి నారాయణమూర్తి
40 బలి వితర్ది రాజేశ్వరీరాణి
41 పిచ్చిపాట మల్లవరపు విశ్వేశ్వరరావు
42 లంపటం చిల్లర భావనారాయణరావు
43 స్వర్గానికీ - నరకానికీ పురిపండా అప్పలస్వామి
44 నాన్యః పంథా... విద్వాన్ విశ్వం
45 ఏకత కవి రాజమూర్తి
46 కాళరాత్రి కనపర్తి లక్ష్మీనరసయ్య
47 పొలిమేరలు మాదిరాజు రంగారావు
48 నాగి పుట్టపర్తి నారాయణాచార్యులు
49 ఆకాంక్ష గర్రెపల్లి సత్యనారాయణ
50 చీకటి బొమ్మలు కోవెల సంపత్కుమారాచార్య
51 గట్టు! పిలకా గణపతిశాస్త్రి
52 రొండూ రోకళ్లు ఆరుద్ర
53 చీమలబారు పొట్లపల్లి రామారావు
54 చెణుకులు జయంతి
55 ఏరు దాటిస్తా కొనకళ్ల వెంకటరత్నం
56 నీవూ నేనూ కలిసి స్వామి
57 నిత్య సత్యాలు పన్యాల రంగనాథరావు
58 వసంతం ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
59 కొత్త పాట భాస్కరభట్ల కృష్ణారావు
60 వీరేశలింగం గిడుతూరి సూర్యం
61 నూతిలో గొంతులు ఆలూరి బైరాగి
62 ప్రియురాలు వానమామలై వరదాచార్యులు
63 కిరణ శకలం దాశరథి కృష్ణమాచార్య
64 గేయం రాయాలి సి.నారాయణరెడ్డి
65 సరస్వతీ భక్తుల్లారా! కాళోజీ నారాయణరావు
66 అరుణ కరుణశ్రీ
67 మేల్కొన్న మనిషిని చూడ్డానికి వెళుతున్నాను దాశరథి కృష్ణమాచార్య
68 క్షుభిత పదయాత్ర ఆవంత్స సోమసుందర్
69 కరటకదమనకులు మల్లికార్జున్
70 తొమ్మిదితో కుచ్చూ ఆరుద్ర
71 ద్వందాతీతం నార్ల వెంకటేశ్వరరావు
72 కష్టజీవి పైడిమఱ్ఱి వేంకటసుబ్బారావు
73 ఖర కాళోజీ నారాయణరావు
74 నాడు నేడు భాగి నారాయణమూర్తి
75 జీవితం పొట్లపల్లి రామారావు
76 మృత సందేశం పి.ఎస్.ఆర్. ఆంజనేయశాస్త్రి
77 అసిధార పి.వి.రామనర్సయ్య
78 భవితవ్యంవేపు సింగరాజు లింగమూర్తి
79 పిల్లలమండీ పిల్లలము వెల్దుర్తి మాణిక్యరావు
80 హిరోషిమా రెంటాల గోపాలకృష్ణ
81 వెన్నెల నార్ల వెంకటేశ్వరరావు
82 ఓ రజనీ! పుట్టపర్తి నారాయణాచార్యులు

పత్రికాభిప్రాయం

[మార్చు]
  • ఈ కావ్యములోని భావాలు, శైలి పాఠకులలో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తించడమే కాక ప్రపంచసమస్యల పరిష్కారంపట్ల ఆసక్తిని రేకెత్తించగలవు. ఇందలి భావాలు కళారాధనను, తాత్కాలిక విప్లవాన్ని పురికొల్పేవి, శాశ్వతంగా ప్రపంచసమస్యల పరిష్కారమునకు దోహదమివ్వగలవి. కాని ప్రపంచసమస్యల పరిష్కారమునకు ఇందలి కవుల భావాలు ఆధారము కాకపోయినా ప్రజల హృదయాలు నవచైతన్యవిలసితములగుటకు, ప్రపంచ సమస్యల గురించి, వాని పరిష్కారావకాశములను పాఠకులు ఆలోచించి వ్యవహరించుట కవకాశములు విస్తృతము కాగలవు.[2] - గృహలక్ష్మి
  • “మెరపువలె పరుగిడు, మా ఊహాతరంగాలకు, బక్కెద్దులనాపే, పగ్గాలు పనికొస్తాయా?” అని కాళోజీ నారాయణరావన్నట్లు ఈ సంపుటము నిండా బ్రతికి ఉన్న వ్యావహారికంలోనే తళుక్కుమంటున్నాయి భావాలు. మరణించిన మాటల కూర్పుకి పనికొచ్చే వృత్తాలు ఉదయఘంటలులో లేవు. అయితే “గ్రాంథికభాష”లోని కూర్పులు వింత నడకలతో ఉన్నాయి. పఠాభి నటరాట్టు, పుట్టపర్తి ఓ భ్రమరీ, సి.నారాయణరెడ్డి జలద గీతి, వి.దుర్గాప్రసాదరావు ఉషోబాల ఈ రకము. అయితే దీనికి ప్రతిగా యెంకిపాటల భాషమాత్రము ఎక్కువగా వినబడదు ఉదయఘంటలులో. మాత్రాచ్చందస్సూ, మాటలాడేభాషా, ఈ రెండూ బొమ్మా బొరుసూను ఉదయ ఘంటలుకి. ఇదివరకటి కవులు దర్శించని సౌందర్యం పొట్లపల్లి రామారావు చీమలబారులో, పుట్టపర్తి ఓ రజనీలో, నార్ల వెన్నెలలో, మాణిక్యరావు పిల్లలములో, నారాయణరెడ్డి గేయం రాయాలిలో, సుబ్బరామశాస్త్రి ఆంధ్రగీతిలో కనబడుతుంది.[3] - కిన్నెర

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణా రచయితల సంఘం (1953). ఉదయ ఘంటలు (1 ed.). హైదరాబాదు: దేశోద్ధారక గ్ర్రంథమాల. Retrieved 27 March 2015.
  2. సి.సి.పున్నయ్య (1954-11-15). "స్వీకారము". గృహలక్ష్మి. 23 (11): 616. Archived from the original on 2016-03-05. Retrieved 27 March 2015.
  3. "పుస్తక సమీక్ష". కిన్నెర. 6 (4): 239–240. 1954-05-01. Archived from the original on 2016-03-05. Retrieved 28 March 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉదయ_ఘంటలు&oldid=3829642" నుండి వెలికితీశారు