పన్యాల రంగనాథరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పన్యాల రంగనాథరావు (1919-1987) ఆకాశవాణి వార్తా సంపాదకునిగా సుపరిచితుడు. కవి. కథకుడు. నాటక రచయిత. కేంద్రప్రభుత్వ ‘యోజన’ పక్షపత్రిక తొలి సంపాదకుడు రంగనాథరావు. ఇతడు బరంపురంలో జన్మించాడు. తండ్రి వెంకట గోపాలరావు. తల్లి మాడి కుడుతమ్మ.

ఇతడు కేంద్ర ప్రభుత్యోద్యోగంలో చేరి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోను, ఆకాశవాణి వార్తా విభాగంలోను సంపాదకుడిగా పనిచేశాడు.

రచనలు[మార్చు]

ఇతడు శేఖర్, గోపి, చైతన్య, అన్నయ్య మొదలైన కలం పేర్లతో రచనలు చేశాడు.

  1. గద్వాల చీర (నవల)
  2. ఒకే రక్తం ఒకే స్పర్శ
  3. అభయముద్ర[1]
  4. పన్యాల రంగనాథరావు కథలు
  5. ప్రేమలత
  6. అక్షరదీప్తి
  7. ఆద్యంతం
  8. నీ కోసం
  9. అనూరాధ
  10. కలసిరాని కాపురం

మూలాలు[మార్చు]