పిలకా గణపతిశాస్త్రి
Jump to navigation
Jump to search
పిలకా గణపతి శాస్త్రి ( జ:ఫిబ్రవరి 24, 1911 - మ:జనవరి 2, 1983) కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు.
జననం
[మార్చు]1911 ఫిబ్రవరి 24న తూర్పు గోదావరి జిల్లా కట్టుంగ గ్రామంలో జన్మించాడు. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహితీ విద్యా ప్రవీణ పట్టా పొందాడు. ఆయన రాజమహేంద్రవరం ఆంధ్ర యువతీ సంస్కృత పాఠశాలలోను, వీరేశలింగం పాఠశాలలోను తెలుగు పండితుడుగా పనిచేశాడు. కవిగా, వ్యాఖ్యాతగా, నవలా రచయితగా, అనువాదకునిగా, ఆర్ష విద్వాంసుడుగా పత్రికా సంపాదకుడుగా విశేష ఖ్యాతి పొందాడు. పిలకా గణపతి శాస్త్రి ఆంధ్ర శిల్పి, ఆంధ్రభారతి, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సహాయ సంపాదకుడుగా పనిచేశాడు.
మరణం
[మార్చు]గణపతి శాస్త్రిగారు జనవరి 2, 1983 లో మరణించారు. [permanent dead link]
రచనలు
[మార్చు]నవలలు
[మార్చు]- విశాల నేత్రాలు (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి)
- హేమపాత్ర - విప్రనారాయణ కథ ఆధారంగా
- అశోకవర్ధనుడు - అశోక చక్రవర్తి కథ
- మీనాంబిక
- కాశ్మీర పట్టమహిషి
- గృహిణి - నాటకరంగం నేపథ్యంలో నటీనటుల సంబంధాలు-దాంపత్య జీవితంపై వాటి ప్రభావాలు చిత్రీకరిస్తూ వ్రాయబడిన పెద్ద నవల. ఈ నవలను తన అర్ధాంగి శ్యామలకు అంకితమిచ్చాడు.
- [[ప్రాచీన గాథాలహర
వచనానువాదాలు
[మార్చు]- వ్యాసభారతం
- హరివంశం
- దేవీ భాగవతం
- గృహ దహనం - శరత్‌బాబు బెంగాలీ నవల
- రెడ్ లిల్లీ - అనటోల్ ఫ్రాన్స్
ఖండకావ్యాలు
[మార్చు]- విభ్రాంతామరుకము
- రత్నోపహారం