Jump to content

భాగి నారాయణమూర్తి

వికీపీడియా నుండి

భాగి నారాయణమూర్తి నాటక రచయితగా సుప్రసిద్ధుడు.[1]

జీవిత వివరాలు

[మార్చు]

ఇతడు సికిందరాబాదులో 1912వ సంవత్సరంలో జన్మించాడు. ఇతడు మంచి నటుడు, నాటకకర్త, కవి, కథారచయిత కూడా. ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సీ పట్టా పుచ్చుకున్నాడు. ఇతడు రోడ్డు రవాణా సంస్థ (R.T.C.)లో చాలా కాలం పనిచేశాడు. ఆచార్య ఆత్రేయ రచించిన ప్రగతి అనే నాటకంలో ఇతడు వేసిన పాత్ర నటుడిగా ఇతడికి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇతడు సాధన సమితి కార్యదర్శిగా ఉంటూ తెలంగాణా సాహితీ, సాంస్కృతిక రంగాలకు ఎనలేని సేవ చేశాడు. ఇతడు వ్రాసిన కథలను పద్మం కథల పేరుతో వెలువరించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని ఫలించలేదు.

రచనలు

[మార్చు]

నాటకాలు

[మార్చు]
  1. పరీక్ష చదువు
  2. డాక్టరు యజ్ఞం
  3. పరీక్షలపుడు
  4. పరీక్షల తర్వాత

ఖండకావ్యాలు

[మార్చు]
  1. జయగంట
  2. రుధిర రేఖలు
  3. దీపావళి
  4. వలపు
  5. కాపు పడుచు
  6. కాలమహిమ
  7. వీడ్కోలు
  8. తెనుగు మొర

మూలాలు

[మార్చు]
  1. సంగిశెట్టి శ్రీనివాస్ (2005). తొలినాటి కతలు (తెలంగాణా తొలితరం కథలు రెండో భాగం) (1 ed.). హైదరాబాదు: ముదిగంటి సుజాతారెడ్డి. p. xxxiv.