పెనుగొండ (ప.గో)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెనుగొండ (ప.గో)
—  మండలం  —
పశ్చిమ గోదావరి జిల్లా పటములో పెనుగొండ (ప.గో) మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో పెనుగొండ (ప.గో) మండలం యొక్క స్థానము
పెనుగొండ (ప.గో) is located in Andhra Pradesh
పెనుగొండ (ప.గో)
పెనుగొండ (ప.గో)
ఆంధ్రప్రదేశ్ పటములో పెనుగొండ (ప.గో) యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°39′25″N 81°44′46″E / 16.656915°N 81.74612°E / 16.656915; 81.74612
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రము పెనుగొండ (ప.గో)
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 68,755
 - పురుషులు 34,675
 - స్త్రీలు 34,080
అక్షరాస్యత (2001)
 - మొత్తం 75.03%
 - పురుషులు 80.92%
 - స్త్రీలు 69.06%
పిన్ కోడ్ 534320
పెనుగొండ (ప.గో)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పెనుగొండ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 16,038
 - పురుషుల సంఖ్య 8,308
 - స్త్రీల సంఖ్య 8,195
 - గృహాల సంఖ్య 3,948
పిన్ కోడ్ 534320
ఎస్.టి.డి కోడ్ 08819

పెనుగొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, గ్రామము.[1]. పిన్ కోడ్ నం. 534 320., ఎస్.టి.డి.కోడ్ = 08819.

  • శ్రీ నగరేశ్వర వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవస్థానము ద్వారా పెనుగొండ పట్టణము సుప్రసిద్దము. ఈ నగరము పాలకొల్లు మరియు నిడదవోలు ప్రధాన రహదారిన

కలదు. పాలకొల్లుకు 15 కి.మీ. మరియు తణుకుకు 16 కి.మీ. దూరంలో ఉంది.

కన్యక వృత్తాంతము[మార్చు]

పూర్తి వ్యాసం కొరకు చూడండి. కన్యకా పరమేశ్వరి

పెనుగొండ ప్రధాన బస్ స్టాండ్

కన్యక లేదా వాసవి కన్యకా పరమేశ్వరీదేవి పేరుతో కుసుమశ్రేష్టి పుత్రికగా జన్మించి విష్ణువర్ధనుడు అనే అహంకార రాజ్యాధిపతితో వివాహానికి అంగీకరించక ఆత్మత్యాగం చేసుకొనుట ద్వారా వైశ్యులకు కన్యకా పరమేశ్వరి ఆరాద్య దైవంగా నిలిచిన యువతి. ఈమె దైవాంశ సంభూతురాలని ఆమె మరణానికి ముందు ఆమె దైవాంశను అందరూ దర్శించారని వాసవిదేవి గాథలలో వ్రాయబడి ఉంది.

నగర చరిత్ర[మార్చు]

ఈ నగరము చారిత్రక ప్రాదాన్యత కలిగిన నగరము.రాజ్యపరిపాలన జరుగుతున్నకాలమందు ఈ ప్రాంతమునకు పెనుగొండ రాజదానిగా ఉండేది.

దేవాలయములు[మార్చు]

శ్రీ నగరేశ్వర స్వామివారి దేవస్థానముఇది ఊరికి దక్షణాన కల అతి పురాతన దేవాలయము.మొదట ఈ దేవాలయము తక్కువ విస్తీర్ణము కలిగి చిన్న దేవాలయముగా ఉండేది. తదనంతరము దీనిలో అంతర్భాగముగా కన్యకా పరమేశ్వరీ దేవస్థానము కట్టడంతో అతి పెద్ద దేవాలయముగా వృద్ది చెందినది. ఈ దేవాలయము నిడవోలు,నర్సాపురం ప్రధాన కాలువ తీరాన ఉంది.
శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయము .
కన్యకాపరమేశ్వరి ఆలయ గోపురము మరియు ఆవరణ

ఆర్యవైశ్యుల కులదైవమయిన శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయము చారిత్రక నేపథ్యము కలిగి ఉంది. నిజానికి ఈ ఆలయము శ్రీ నగరేశ్వరస్వామి వారి దేవస్థాన ప్రాంగణములోనే వేరొక ప్రక్క నిర్మింపబడింది. తరువాత గోపురము మరియు విశ్రాంతి మందిరములు కళ్యాణ మండపము ఇత్యాదులతో అభివృద్ధి చేయుటచే పెద్ద యాత్రా స్థలముగా మారినది.

పెనుగొండలో కల వాసవీధామ్ వద్ద ఉన్న 30 అడుగుల వాసవీమాత విగ్రహము

విద్యాలయాలు[మార్చు]

నగరంలో ప్రదానంగా ఒకే ప్రాంగణంలో గల రెండు కళాశాలలు ఉన్నాయి.

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ సైన్స్ మరియు ఆర్ట్స్ కళాశాల.దీనిని 1974 లో నిర్మించారు.జిల్లాలోని అన్ని కళాశాలలకన్న మిన్నగా ఉత్తీర్ణతాశాతం ఎక్కువగా ఉండేందుకు అహర్నిసలూ కృషి చేసే కళాశాల యాజమాన్యం ఈ కళాశాల ప్రధాన బలం. దీనిని చిన్న విశ్వవిద్యలయం అని కుడా పిలుస్తారు.
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ మరియు పితాని వెంకన్న జూనియర్ కళాశాల.

ఈ కళాశాల డిగ్రీ కళాశాల కంటే ముందుగా నిర్మింపబడింది.

నగరంలో సౌకర్యాలు[మార్చు]

  • బస్టాండ్స్. నగర ఉత్తరదిక్కున అన్ని సౌకర్యాలతో కూడిన అతి పెద్ద జవ్వాది రంగనాయకులు ప్రయాణీకుల విశ్రాంతి మందిరము {బస్టాండ్} ఉంది.ఇక్కడి నుండి ఆంధ్రదేశంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు బస్సులు ఉన్నాయి.
  • రక్షణభట నిలయము. {పోలీస్ స్టేషను} నగరం రెండు పోలీస్ స్టేషనుల పరిధిలో ఉంది. కాని రెండు పోలీస్ కార్యాలయాలు ఒకే ప్రాంగణము కలిగిఉండి కార్యకలాపాలు ఎవరి పరిధిలో వారు నిర్వహిస్తుందురు.
  • ఎల్లాప్రగడ రామచంద్రరాజు మొమొరియల్ హాస్పిటల్{కాలువ అవతల పాతవంతెన ప్రక్క}
  • గవర్నమెంట్ వారి ఆసుపత్రి {సిద్దాంతం మార్గములో}
  • మార్కెట్ యార్డు {పాత మర్కెట్ వెనుక సిద్దాంతం మార్గములో}
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ {కాలువ మార్గము}
  • వైశ్యాబ్యాంక్ {ఉన్నత పాఠశాల వద్ద}
  • సబ్ ట్రెజరీ కార్యాలయము {కన్యకా పరమేశ్వరీ దేవస్థానము వద్ద}
  • ప్రధాన తపాలా కార్యాలయము {జవ్వాది వారి వీధి}

వినోద సాధనాలు[మార్చు]

ఊరిలో రెండు సినిమా ప్రదర్శన శాలలు ఉన్నాయి.

  • మొదటిది మినర్వా దియేటర్ ఇది మర్కెట్ ఎదురుగా ఉంది.
  • రెండవది ప్యాలెస్ ఇది సిద్దాంతము వైపు తిరిగే మలుపులో ఉంది. మినార్వా దియేటర్ జిల్లాలో ఉన్న పురాతన సినిమా దియేటర్లలో ఒకటి.

ఇవేకాక ప్రధాన కూడళ్ళలో పూర్వము నాటక ప్రధర్శన కొరకు నిర్మించిన కళా మండపములు ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ దసరా ఉత్సవాలకు పలు ప్రదర్శనలు జరుగును.

ఊరిలో ప్రముఖులు[మార్చు]

పెనుగొండ నియోజకవర్గం[మార్చు]

పెనుగొండ 1952లో ఏర్పడింది. మొదటి సారి ఎన్నికలలో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ నుండి ద్వారంపూడి బసివిరెడ్డి ఎన్నికయ్యాడు.

పెనుగొండ నియోజక వర్గ ఎమ్మెల్యేలు

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 16,503.[1] ఇందులో పురుషుల సంఖ్య 8308, మహిళల సంఖ్య 8195, గ్రామంలో నివాస గృహాలు 3948 ఉన్నాయి. పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన తణుకు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4320 ఇళ్లతో, 16038 జనాభాతో 1116 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7857, ఆడవారి సంఖ్య 8181. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1798 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 63. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588681[2].పిన్ కోడ్: 534320.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల తణుకు లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, ఏలూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

పెనుగొండలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో 3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు 8 మంది ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

పెనుగొండలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

పెనుగొండలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 128 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 111 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 875 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 111 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 875 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

పెనుగొండలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 875 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

పెనుగొండలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అరటి, కూరగాయలు

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

ఇటుకలు, ట్రంకుపెట్టెలు & బకెట్లు

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".