గోస్తని నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భీమిలీ వద్ద గోస్థని నది
గోస్థని నది పై తాటిపూడి ప్రాజెక్టు

ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్లో తూర్పు దిక్కుగా ప్రవహించే నదులలో ఒకటైన గోస్థని నది తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలలో జన్మించి విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలలో ప్రవహిస్తుంది. చివరకుఈ నది బంగాళాఖాతంలో చారిత్రాత్మక నగరమైన భీమునిపట్నం వద్ద కలుస్తుంది. బొర్రా గుహలు దీని జన్మస్థానంలో ప్రవాహం వలన సున్నపురాయి కోత మూలంగా భావిస్తున్నారు.

గోస్తని నదిపై నిర్మించిన ప్రాజెక్టులు[మార్చు]

తాటిపూడి రిజర్వాయర్ ప్రాజెక్టు గోస్తని నదిమీద 1963-68 మధ్యకాలంలో[1] నిర్మించారు. ఇది విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలంలో తాటిపూడి గ్రామంలో ఉంది. విజయనగరం జిల్లాలో15, 378 ఎకరాల ఆయకట్టు భూములను నీరందించడం మరియు విశాఖపట్నం నగరానికి త్రాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ రిజర్వాయర్ 3 శతకోటి ఘనపు అడుగుల (TMC) నీటిని నిలువచేస్తుంది.

మూలాలు[మార్చు]