సువర్ణముఖి (విజయనగరం జిల్లా)

వికీపీడియా నుండి
(సువర్ణముఖి, నాగావళి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఇది శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి నది ఉపనది.ఈ నది సాలూరు, విజయనగరం జిల్లా కొండలలో (ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాకి చెందింది) పుట్టి, తూర్పుదిక్కుగా ప్రయాణించి సంగం దగ్గర నాగావళి నదిలో కలుస్తుంది.

సువర్ణముఖి నది ఒడిషా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో ఉద్బవించింది.ఈ నది విజయనగరం జిల్లా, వంగర మండలం కొండశేఖరపల్లి వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తుది. జిల్లాలో మొత్తం 17 కి.మీ. మేర ప్రవహించి వంగర మండలంలోని సంగం గ్రామం వద్ద నాగావళి నదిలో కలుస్తోంది. సువర్ణముఖి నదిపై మడ్డువలస ప్రాజెక్టు నిర్మాణం చేయబడింది.దీనికి రెండు కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది.కుడి కాల్వ రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల పరిధిలో మొత్తం 50 కిలోమీటర్ల పొడవున ఉంది.ఎడమ కాల్వ వంగర మండలం పరిధిలో 5 కి.మీ. మేర విస్తరించి ఉంది.[1]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]