పాలేరు నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇదే పేరు గల గ్రామం కోసం 'పాలేరు (కూసుమంచి) వ్యాసం చూడండి.

పాలేరు ఖమ్మం జిల్లాలో ప్రవహించే ఒక నది. ఇది కృష్ణానదికి ఉపనది.

పాలేరు జలాశయం

ఈ గ్రామంలో పాలేరు నదిపై నిజాం ప్రభుత్వ కాలంలో ఒక చిన్న/మధ్య తరహా ఆనకట్ట నిర్మించి రిజర్వాయరు ఏర్పాటు చేశారు. దీని క్రింద కూసుమంచి, నేలకొండపల్లి మండల గ్రామాల్లో కొన్ని వందల ఎకరాల భూములకు నీటి వసతి కలుగుతున్నది. ఇటీవలి కాలంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వను ఈ రిజర్వాయరు గుండా త్రవ్వటంవలన కరవు కాలంలో కూడా నీటికి ఎద్దడి కలుగటములేదు. నాగార్జునసాగరు ఎడమ కాల్వపై ఒక మైక్రో విద్యుత్కేంద్రము ఏర్పాటు చేశారు కానీ అది విజయవంతం కాలేదు. హైదరాబాదు నుండి భద్రాచలం వెళ్ళేటప్పుడు ఈ రిజర్వాయరు కట్టపై చేసే ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది. ఎవరైనా కాసేపు ఆగినట్లయితే నీటి స్కూటర్లు బోట్లు విహరించటానికి దొరుకుతాయి. ప్రభుత్వం ఈ గ్రామంలో జవహర్ నవోదయ విద్యాలయం నెలకొల్పింది.