Coordinates: 18°27′22″N 83°55′58″E / 18.4561976°N 83.932809°E / 18.4561976; 83.932809

దంతపురి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


దంతపురి
—  రెవిన్యూ గ్రామం  —
దంతపురిలోని ప్రాగైతిహాసిక శిలలు
దంతపురిలోని ప్రాగైతిహాసిక శిలలు
దంతపురిలోని ప్రాగైతిహాసిక శిలలు
దంతపురి is located in Andhra Pradesh
దంతపురి
దంతపురి
అక్షాంశరేఖాంశాలు: 18°27′22″N 83°55′58″E / 18.4561976°N 83.932809°E / 18.4561976; 83.932809
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం సరుబుజ్జిలి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

దంతపురి శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలానికి చెందిన గ్రామం. ఆమదాలవలస నుండి హీరమండలం వెళ్ళే మార్గములో ఉన్నది. ఇది ఆమదాలవలస పట్టణానికి 10 కి.మీ, శ్రీకాకుళం పట్టణానికి 22 కి.మీ దూరంలో కలదు.

గ్రామ చరిత్ర[మార్చు]

ఈ ప్రాంతములో పురాతన బౌద్ధ స్థూపములు కలవు. ఈ ప్రాంతములో బౌద్ధ మతస్థులు నివసించేవారని ప్రతీతి. ఇది ముఖ్యమైన పురాతన భౌద్ధ ప్రదేశం.ఇది బుద్ధ జ్ఞాన దంతపురిగా పిలువబడుతుంది. పురాతత్వ పరిశోధకులు ఇచట కొన్ని ఇటుకలు, కుండలు, టెర్రాకోటా పాత్రలు, గాజులు, రాతి, ఇనుప వస్తువులను కనుగొన్నారు. క్రీ.ఫూ 261లో కళింగ యుద్ధం తర్వాత ఈ ప్రాంతం బౌద్ధ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని కళింగ రాజులు తమ మత రాజధానిగా భావించేవారు. బుద్ధుని నిర్యాణం తర్వాత అతని జ్ఞానదంతం అర్హఖేరుతేరుడు ద్వారా కళింగ రాజైన బ్రహ్మదత్తకు అందజేయబడినది. బ్రహ్మదత్తుడు ఈ దంతమును భూస్థాపితం చేసి దానిపై ఒక స్థూపమును నిర్మించినాడని ప్రతీతి. ఈ ప్రాంతంలో బుద్దుని జ్ఞాన దంతం ఉన్నందున దంతపురి లేదా దంతవరపుకోటగా పిలువబడుతున్నది. బౌద్ధ వాజ్ఞ్మయంలో ఈ ప్రదేశం దంతవక్తృని కోటగా వ్యవహరించబడింది.

అలికాం-బత్తిలి రహదారి నుంచి రొట్టవలస గ్రామానికి తూర్పు దిశలో ఉన్న కోట ప్రాంతాన్ని దంతపురి, దంతవరపుకోట పేర్లతో పిలుస్తారు. ప్రాచీన కళింగ సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన దంతపురికి ఘన చరిత్ర ఉంది. ధనగుప్తుడు అనేరాజు పరిపాలనలో మట్టితో నిర్మింపబడిన ఈ కోట సుమారు 500 ఎకరాల విస్తీర్ణం చుట్టూ 50 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు కలిగిన మట్టి గోడలు ఆనాటి కోటకు ఆనవాళ్లుగా ఇప్పటికీ ఉన్నాయి. దంతపురానికి అనుబంధంగా మూడు కోటలు, ఒక దుర్గం ఉండేవని చెప్తారు. కోటలున్న స్థానంలో నిర్మించిన గ్రామాలనే కొత్తకోట, ధనుకోట, పెద్దకోటగా పిలుస్తున్నారని చెప్తారు. కరకవలసలోని దుర్గంలో ఇప్పటికీ ప్రతిఏటా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.[1] కోట చుట్టూ ఎనిమిది ద్వారాలు ఉండేవి. అవి ఉన్న ప్రదేశాలలో ఇప్పుడు ఎనిమిది గ్రామాలు వెలసి ఉన్నాయి. అవే ఈనాటి రావివలస, పాలవలస, పెద్దపాలెం, చిన్నపాలెం, కొండవలస, మునగవలస, రొట్టవలస, అవతారాబాదులు. ఈ కోట చుట్టూ ఏర్పాటైనా ఆనాటి కందకమే ఈనాడు బందలుగా పిలువబడుచున్నవి. పూర్వం నుండి ఈ గ్రామాలకు సంబంధించిన రైతులు చరిత్ర అడగంటిన తరువాత వంశపారంపర్యంగా కోట ప్రాకారానికి లోపల గల మెట్టు భూమిపై ఉలవలు, జొన్నలు, వేరుసెనగ, జనపనార, మిరప, కూరగాయలు పండించుకొని జీవనాధారం గడుపుకొనేవారు. ఇలాగే కొనసాగుచుండగా అప్పుడప్పడు నూతులు త్రవ్వినపుడు ఏదైనా గోతులు త్రవ్వినపుడు వింత, వింతమట్టి పాత్రలు డిజైన్లతో కూడిన పెంకులు ఆనాటి సంస్కృతిలో వాడబడిన పాత్రలు ఆట వస్తువులు లభ్యమైనాయి. కొంత మందికి ఆభరణాలు భాగాలుగా, చిన్న చిన్న బంగారపు వస్తువులు, చిన్న చిన్న విడిభాగాలు దొరికాయని చెప్పుకొనేవారు పది సంవత్సరాలు క్రితం ఆంధ్రప్రదేశ్‌ పురావస్తు పరిశోదనశాఖ వారి ద్వారా వారి దగ్గర ఉన్న ఆధారాలు ప్రకారం భీమిలి, తుని, శ్రీకాకుళంలో త్రవ్వకాలు ప్రారంభించారు. వారి దగ్గర కొన్ని బ్లూ ప్రింట్సు దగ్గర పెట్టుకొని పురావస్తు పరిశోదనశాఖ డా.సుబ్రమణ్యం మ్యూజియం శాఖ ఆధ్వర్యంలో టెక్నికల్‌ అసిస్టెంటు శ్రీరామ కృష్ణ, చిట్టిబాబులు సుమారు 4 నుండి 5 సంవత్సరాలు వరుసగా దంతపురిలో మూలమూలలా పరిశోదనలు త్రవ్వకాలు జరిపారు. ఈ కార్యక్రమం ఆనాటి పురావస్తు పరిశోదన శాఖ కమీషనర్‌ ఎస్‌.కె. పఛేరి ఐఎఎస్‌ స్వయంగా వచ్చి మన జిల్లా కలెక్టర్‌ అనిల్‌ చంద్రపుణఠా ఐఎఎస్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు

ఈ ప్రాంతాల్లో పురాతత్వశాఖ జరిపిన తవ్వకాల్లో మూడు బౌద్ధ స్తూపాలు బయటపడ్డాయి. ఇంకా తవ్వకాలు చేపడితే మహా స్థూపం బయటపడుతుందని ఆశిస్తున్నారు. ఇదిలా చాలా ఏళ్ళ క్రితం నాటి బౌద్ధమతానికి చెందిన స్ధూపమని అప్పుడు కట్టడం ఇటుకల నిర్మాణం సాలిహుండం స్తూపాన్ని పోలి ఉండడం విశేషం. అలాగే అక్కడ పై పై త్రవ్వకాలలో బయట పడిన ఆధారముల ప్రకారం ఒక అంతఃపురం వంశధార నదికి ఒక సొరంగం ఉన్నట్లుగా శాఖా పరమైన సాంకేతిక నిపుణులు చెప్పారు. త్రవ్వకాలలో దొరికిన ఆధారాలు రిపోర్టులు ప్రకారం ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చుననే భావంతో పర్యాటక శాఖావారు శ్రీకాకుళం జిల్లా పర్యాటక కేంద్రంలలో ఒకటిగా ప్రకటించారు. 2002 జూన్‌ పదో తేదీ నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించారు. అప్పట్లో కోట మధ్య ప్రాంతంలో బుద్ధుని ఏకశిల విగ్రహాన్ని ప్రతిష్టించారు. 2003, 2004 సంవత్సరం బుద్దజయంతి ఏర్పాట్లుతో ఉత్సవాలు దంతపురిలోనే జరిగాయి.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దంతపురి&oldid=3689942" నుండి వెలికితీశారు