Jump to content

బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతపు కళాకృతి

వికీపీడియా నుండి
న్యూఢిల్లీ నేషనల్ మ్యూజియంలోని అలంకరణ కళల ప్రదర్శన మందిరంలో 20వ శతాబ్దిలో చెక్కిన ఏనుగు దంతపు కళాకృతి

బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగుదంతపు కళాకృతి ఒకే ఏనుగు దంతంపై అంతర్భాగాలతో చెక్కిన కళాఖండం, ప్రస్తుతానికి న్యూఢిల్లీ నేషనల్ మ్యూజియంలోని అలంకరణ కళల గాలరీలో ప్రదర్శింపబడుతోంది. [1] ఈ ఏనుగు దంతం ప్రదర్శనశాలకు వితరణగా లభించింది. దాదాపు ఐదు అడుగుల పొడవు ఉన్న ఈ ఏనుగు దంతపు కళాకృతిపై బుద్ధుని జీవితానికి సంబంధించిన 43 ఘట్టాలను చెక్కారు. దీనిని 20వ శతాబ్ది తొలినాళ్లలో ఢిల్లీ ప్రాంతానికి చెందిన కళాకారుడు తయారుచేసినట్టు భావిస్తున్నారు.

వర్ణన

[మార్చు]

పొడవైన, పూర్తి ఏనుగు దంతాలను చెక్కేందుకు ఉపయోగించడం 18, 19 శతాబ్దాలలోని భారతదేశంలో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఈ శైలి బర్మాలో కాక మళ్ళీ ఢిల్లీ ప్రాంతాల్లోనే ప్రాచుర్యం పొందింది. ఇలాంటి పూర్తి ఏనుగు దంతాల కళాకృతులు కాంగోకు చెందిన ఐవరీ కోస్టు ప్రాంతంలో [2][3], బెనిన్లోనూ కనిపిస్తాయి. ఐతే అవి ఆఫ్రికన్ ఏనుగుల దంతాలతో చేసినవి కావడం భేదం. ఏనుగు దంతాలు చెక్కి కళాకృతులు తయారుచేసే కళ భారతదేశంలో చాలా ప్రాచీనతరమైనది. కాళిదాసు రాసిన మేఘదూతంలో కూడా ఈ కళ గురించిన వివరాలు దొరుకుతాయి. లభ్యమవుతున్న పురాతన ఏనుగు దంతం కళాకృతుల్లో తక్షశిలలో దొరికిన సా.శ.2వ శతాబ్దానికి చెందిన దంతపు దువ్వెన ఉంది. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండి, కళకు మహారాజుల పోషణ లభించిన అస్సాం, మైసూర్‌ ప్రాంతాల్లో ఏనుగు దంతాలను చెక్కే కళ పరిఢవిల్లింది. ఏనుగు దంతాల కళాకృతులు రాజ్యల నడుమ వ్యాపారానికి కేంద్రంగా విలసిల్లాయి. ఆ కళాకృతులు ఎక్కడ ఈ కళకు పోషణ లభిస్తుందో అక్కడక్కడకు వెళ్ళాయి.[4] ఈ ఏనుగు దంతపు కళాకృతిపై బుద్ధుని జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు 43 వృత్తాకార అరల్లో చెక్కారు. వాటిలో మొదటి 25 బుద్ధుని జీవితంలో జననం నుంచి జ్ఞానోదయం వరకూ జరిగిన ఘట్టాల మాలిక కాగా, మిగిలిన 18 జ్ఞానోదయం నుంచి మహాపరినిర్వాణం వరకూ ఉన్న ఘట్టాలు కలిగినది. ఇలాంటి ఘట్టాలనే శిల్పాల్లో, చిత్రాల్లో ఎన్నోసార్లు చిత్రితమైనవి, ఈ దంతపు కళాకృతిలో మరికొన్ని కొత్త ఘట్టాలను కూడా కలిగుంది. ఉదాహరణకు సిద్ధార్థుడు పక్షి కోసం పోరాడడం, జంతుజాలాన్ని చంపడంపై అతని వ్యతిరేకత, మరణాన్ని గురించి గుర్తించడం వంటివి వాటిలో కొన్ని. పైకి వెళ్ళేకొద్దీ దంతం యొక్క మందం తగ్గిపోతుంది కనుక పైన ఉన్న అరల చుట్టుకొలత తగ్గించి, వృత్తం నుంచి అరలను వేరే ఆకారానికి మార్చి వాటిలో భూమిస్పర్శ ముద్ర, అభయముద్ర, ధర్మచక్రప్రవతన ముద్ర వంటి సుప్రసిద్ధమైన ముద్రలతో ఉన్న బుద్ధుణ్ణి చెక్కారు. అరల మధ్యలో లోపలికి చెక్కిన పూలతీగల వంటి నాడకట్టు కూడా దీనికి మరింత అందాన్ని చేకూర్చింది.

ఘట్టాలు

[మార్చు]

బుద్ధ జీవిత ఘట్టాలు దంతపు కళాకృతిపై కింది నుంచి పైకి గడియారం తిరిగే దిశలో (క్లాక్ వైజ్) అమర్చి ఉన్నాయి.[5]

బుద్దుని జీవితంలో జ్ఞానోదయ పూర్వపు ఘట్టాలు

[మార్చు]

జ్ఞానోదయం అనంతరం బుద్ధుని జీవిత ఘట్టాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "డెకరేటివ్ ఆర్ట్స్ గాలరీ ఎట్ నేషనల్ మ్యూజియం రీఓపెన్డ్ (నేషనల్ మ్యూజియంలోని అలంకరణ కళల గాలరీ తిరిగి తెరవబడింది)". ది హిందూ. న్యూ ఢిల్లీ. జూలై 6, 2013. Retrieved Jan 4, 2014.
  2. ఎడ్వర్డ్స్, ఒవెన్ (2008). "స్పైరల్స్ ఆఫ్ హిస్టరీ". స్మిత్‌సోనియన్ మేగజైన్.
  3. బ్రిటీష్ మ్యూజియం వెబ్‌సైట్‌లో దంతపు కళాకృతుల గురించిన వివరాలు
  4. భట్టాచార్య, అశోక్ కుమార్; సేన్‌గుప్తా, ప్రదీప్ కుమార్ (1991). ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ మ్యూజికాలజీ:పెర్సెప్షన్స్ ఇన్ ది ఫిలాసఫీ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ (ఆంగ్లం). అభినవ్ పబ్లికేషన్స్. p. 124.
  5. పాఠక్, అనామిక (1997–98). "బుద్ధుని జీవిత ఘట్టాలు ప్రదర్శించేలా చెక్కిన ఏనుగు దంతపు కళాకృతి". కళ - ది జర్నల్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్. IV. గౌహతి: ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్.
  6. పరిమూ, ఆర్. (1982). లైఫ్ ఆఫ్ బుద్ధా ఇన్ ఇండియన్ స్కల్చర్ (భారతీయ శిల్పకళలో బుద్ధుని జీవితం). న్యూఢిల్లీ. p. 11.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  7. స్టాన్లీ వొల్పెర్ట్ రచించిన ఇండియా (పేజీ 32)