Jump to content

సారనాథ్

అక్షాంశ రేఖాంశాలు: 25°22′52″N 83°01′17″E / 25.3811°N 83.0214°E / 25.3811; 83.0214
వికీపీడియా నుండి
  ?సారనాథ్
ఉత్తర ప్రదేశ్ • భారతదేశం
The ధమేఖ్ స్థూపం, సారనాథ్
The ధమేఖ్ స్థూపం, సారనాథ్
The ధమేఖ్ స్థూపం, సారనాథ్
అక్షాంశరేఖాంశాలు: 25°22′52″N 83°01′17″E / 25.3811°N 83.0214°E / 25.3811; 83.0214
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
పురావస్తు ప్రదేశం. (వెనుక వైపు ధమేఖ్ స్థూపం).

సారనాథ్, (ఆంగ్లం : Sarnath) (ఇంకనూ మృగదవ, మిగదాయ, రిషిపట్టణ, ఇస్పితాన), ఇదో జింకల వనం, ఇందు గౌతమ బుద్ధుడు తన మొదటి "ధర్మ" ఉపదేశాన్నిచ్చాడు, ఇచటనే బౌద్ధ సంఘాలు ఏర్పాటయ్యాయి. సారనాథ్ ఉత్తర ప్రదేశ్ వారణాసికి ఈశాన్యదిశలో 13 కి.మీ. దూరాన గలదు. ఇస్పితాన, గౌతమ బుద్ధుని చే వర్ణించబడినది, నాలుగు ప్రధాన బౌద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. బౌద్ధ మత భక్తులు సందర్శించి తీరవలసిన క్షేత్రాలు నాలుగు క్షేత్రాలలో సారనాధ్ ఒకటి.[1] తక్కిన మూడు - కుశీనగరం, బోధిగయ, లుంబిని.

మృగదావ అంటే జింకల పార్కు. "ఉసీపట్నం" లేదా "ఉసీనగరం" అంటే ప్రాకృత భాష పదాల ఆధారంగా ఋషులు అవతరించిన స్థలం.

బుద్ధుని జీవితంలో సారనాధ్

గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం తరువాత సుమారు 5 వారాలకు బోధిగయ నుండి సారనాధ్‌కు వెళ్ళాడు. అంతకు ముందు (జ్ఞానోదయం ముందు) బుద్ధుడు తన తీవ్ర తపోదీక్షను విరమించినపుడు, అతని సహచరులైన ఐదుగురు "పంచవాగ్గీయ సాధువులు" బుద్ధుని వదలి ఉసీపట్నం వెళ్ళారు.[2] తన జ్ఞానోదయం తరువాత ఆ ఐదుగురికి ధర్మోపదేశం చేయడానికి బుద్ధుడు కూడా అక్కడికి వెళ్ళాడు. దారిలో గంగానదిని దాటడానికి పడవ ప్రయాణానికి తనవద్ద లేణందున బుద్ధుడు గాలిలోనడచుకొంటూ దాటాడట. ఇది విన్న మౌర్యరాజు బింబిసారుడు సన్యాసులకు శుల్కాన్ని రద్దు చేశాడట. ఉసీనగరంలో ఐదుగురు సాధువులకు బుద్ధుడు ధర్మోపదేశం చేసినపుడు సంఘం ఆవిర్భవించింది. ఆ సమావేశంలో చేసిన బోధను దమ్మచక్క పరివత్తన సుత్తము (ధర్మచక్ర పరివర్తన సూత్రం) అంటారు. అది అషాఢ పూర్ణిమనాడు జరిగింది.[3] తరువాత ఐదు వర్ష ఋతువుల కాలం బుద్ధుడు సారనాధ్‌లో "మూలగంధ కుటీరం"లో గడిపాడు.[4] ఈ కాలంలో సంఘం 60 మందికి పెరిగింది. వారిని బుద్ధుడు నలుదెసలకూ పంపాడు. వారందరూ అర్హతులే.

ఉసీపట్నం (సారనాధ్‌) లో మొదటి ధర్మబోధ మాత్రమే కాకుండా బుద్ధుని జీవితంలో అనేక ఘటనలు జరిగాయి. యాసుడు అతని శిష్యుడయ్యాడు.[5] It was at Isipatana, too, that the rule was passed prohibiting the use of sandals made of talipot leaves.[6] రాజగిరి నుండి సారనాద్‌కు తిరిగి వచ్చిన తరువాత బుద్ధుడు కొన్ని మాంసాలను నిషేధించాడు. మనుష్య మాంసంకూడా అలా నిషేధించచబడింది (ఒకవిధమైన రోగ నివారణకు ఒక సాధువు స్వయంగా తన మాసంతో పులుసు కాశీ ఇచ్చాడట. కనుక మనిషి మాంసం నిషేధం కూడా అవుసరమైంది.) [7] ఇక్కడ బుద్ధుడు ఉన్న కాలంలో రెండుసార్లు మారుడు బుద్ధుని వశపరచుకోవాలని ప్రయత్నించి విఫలుడయ్యాడట.[8]

సారనాధ్‌లో ఉన్న సమయంలో ధమ్మచక్క పరివత్తన సుత్తం మాత్రమే కాకుండా మరొకొన్ని సుత్తములు (సూత్రాలు) బోధించాడు.

  • అనత్త లఖన సుత్తము
  • సచ్చవిభంగ సుత్తము
  • పంచ సుత్తము (S.iii.66f),
  • రథకార (పచేతన) సుత్తము (A.i.110f),
  • రెండు పాశ సుత్తములు (S.i.105f),
  • సమయ సుత్తము (A.iii.320ff),
  • కటువీయ సుత్తము (A.i.279f.),
  • మెత్తేయపంథ పరాయణ బోధ (A.iii.399f)
  • ధమ్మదిన్న సుత్తము (S.v.406f) (సామాన్యులకు ఆచరణీయమైన ధర్మము)
ఇస్పితానా జింకలవనం లో, మొదటి ఐదు బౌద్ధ శిష్యులు, ధర్మచక్రానికి నివాళులర్పిస్తూ.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. (D.ii.141)
  2. J.i.68
  3. Vin.i.10f.; on this occasion 80 kotis of Brahmas and innumerable gods attained the comprehension of the Truth (Mil.30); (130 kotis says Mil.350). The Lal. (528) gives details of the stages of this journey
  4. BuA., p.3
  5. Vin.i.15f
  6. Vin.i.189
  7. Vin.i.216ff.; the rule regarding human flesh was necessary because Suppiyā made broth out of her own flesh for a sick monk
  8. S.i.105f

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సారనాథ్&oldid=4055442" నుండి వెలికితీశారు