ఉదయగిరి (ఒడిషా)
ఉదయగిరి | |
---|---|
ଉଦୟଗିରି | |
మతం | |
అనుబంధం | బౌద్ధము |
స్థితి | సంరక్షితం |
ప్రదేశం | |
ప్రదేశం | భారత దేశం |
రాష్ట్రం | ఒడిషా |
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/భారత దేశం" does not exist. | |
భౌగోళిక అంశాలు | 20°38′30″N 86°16′09″E / 20.6416°N 86.2692°E |
బౌద్ధ |
పర్యాటక ప్రాంతాలు |
---|
ప్రముఖ బౌద్ధ స్థలాలు |
లలితగిరి
|
ఉదయగిరి (ଉଦୟଗିରି) ఒడిషా రాష్ట్రంలోని అతి పెద్ద బౌద్ధ ఆరామము.[1] ఇక్కడ ప్రధాన స్థూపం, బౌద్ధ విహారాలు ఉన్నాయి. దీని సమీపంలో ఉన్న లలితగిరి, రత్నగిరి బౌద్ధారామాలతో కలిపి ఇది కూడా 7వ శతాబ్దానికి చెందిన పుష్పగిరి బౌద్ధ విశ్వవిద్యాలయంలో ఒక భాగంగా ఉండేది.[2] ఈ మూడు వారసత్వ సంపదలను సంయుక్తంగా "వజ్ర త్రిభుజి" (రత్నగిరి - ఉదయగిరి - లలితగిరి)గా పేర్కొంటారు.[3] ఇక్కడ లభించిన శాసనాల ప్రకారం ఈ ప్రదేశానికి "మాధవపుర మహావిహారం" అనే పేరు ఉన్నట్లు తెలుస్తున్నది.[4] ఈ బౌద్ధ మహావిహారం 7వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు క్రియాశీలకంగా ఉన్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి.[1]
భౌగోళిక ఉనికి
[మార్చు]ఉదయగిరి ఒడిషా రాజధాని భువనేశ్వర్‌కు ఈశాన్యంలో 90 కి.మీల దూరంలో,[4] కటక్ నగరానికి ఈశాన్య దిక్కులో 70 కి.మీల దూరంలో[1][3] కొండల అడుగు భాగంలో నెలకొని ఉంది.
పరిశోధనలు
[మార్చు]ఈ ప్రాంతంలో 1958 నుండి భారత పురాతత్వ సర్వే సంస్థ అనేక తవ్వకాలను జరిపింది.[4] 1985-86, 1989-90ల మధ్యకాలంలో జరిపిన త్రవ్వకాలలో కొన్ని పురావస్తువులు బయల్పడ్డాయి. వాటిలో బౌద్ధ ఆరామం, దాని చుట్టూ ప్రహారీగోడ, ఏడు మీటర్ల ఎత్తువున్న ఒక స్థూపం దాని నలుదిక్కులా ధ్యానముద్రలో ఉన్న బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. లభ్యమైన శాసనాల ఆధారంగా ఈ ప్రదేశాన్ని "మాధవపుర మహావిహారం'గా నిర్ధారించారు. 1997-2000 ల మధ్య జరిగిన మలివిడత తవ్వకాలలో మరికొన్ని స్థూపాలు, బౌద్ధారామాలు బయల్పడ్డాయి. వాటిలో 8వ శతాబ్దానికి చెందిన రెండు ఆరామాలు, బుద్ధుడు, తారాదేవి, మంజుశ్రీ, అవలోకితేశ్వర, జాతముక్తలోకేశ్వర విగ్రహాలు, మరికొన్ని టెర్రకోట మట్టి వస్తువులు ఉన్నాయి.[4] మెట్లతో కూడిన ఒక దిగుడుబావి కనుగొనబడింది. ఆ మెట్లపై శాసనాలు చెక్కబడి ఉన్నాయి.[1] ఆ ప్రదేశంలో ఒక ప్రవేశద్వారం కూడా కనుగొనబడింది. ఆ ద్వారంపై హనుమంతుడు తన్మయంతో కళ్ళుమూసుకుని ఊయల ఊగుతున్నట్లు చెక్కబడి ఉంది.[3]
ఇటీవల 2001-2004లో జరిపిన తవ్వకాలలో చదును చేయబడిన రాతినేల, ఆరామంలో ఉత్తర దిక్కుకు నీరు ప్రవహించే విధంగా ఒక ప్రధాన కాలువ, 14.05 మీ Χ 13.35 మీ కొలతలు గల గారతో చేసిన ఒక తిన్నె దానికి చుట్టూ రాతి మెట్లు, ఆ తిన్నెకు ఉత్తరం వైపున ఒక చంద్రశిల బయటపడ్డాయి. వీటితో పాటు అర్థగోళాకృతిలో ఉన్న చైత్యగృహాలు వాటిలో తూర్పువైపుకు అభిముఖంగా రాయి, ఇటుకలతో కట్టిన స్థూపాలు బయలు పడ్డాయి. చైత్య గృహాలకు గవాక్షాలు కూడా ఉన్నాయి.[4]
ఉదయగిరి, లలితగిరి, రత్నగిరులలో తార కురుకుళ్ళ విగ్రహాలను కనుగొన్నారు. ఇవి లలితాసనం వేసి కూర్చొని వున్న అమితాభ మూర్తి నుండి ఉద్భవించినాయి.[5] అలాగే ఈ ప్రదేశాలలో హరితి విగ్రహాలు కూడా బయల్పడినాయి. హరితి పిల్లలను అపహరించే స్త్రీ మూర్తి. కానీ బుద్ధుడు ఆమెను పిల్లలను సంరక్షించే వ్యక్తిగా ప్రేరేపించాడు. ఈ హరితి విగ్రహాలు ఒడిలో పిల్లవానికి చనుబాలు త్రాగించే భంగిమలో ఉన్నాయి.[6]
చైత్యగృహాలలో అనేక స్థూపాల అవశేషాలు కనిపించాయి. ఈ చైత్యగృహాల ఆవరణలో అవలోకితేశ్వర, తథాగత, భికృతి తార, చండ విగ్రహాలు గూళ్లలో నాలుగు దిక్కులా కనుగొన్నారు. ఇంకా 1 నుండి 12వ శతాబ్దాలకు చెందిన ఇటుకలు, మట్టితో కట్టిన 14 స్థూపాలు, 5వ శతాబ్దం నుండి 13వ శతాబ్దాల వరకు సంబంధించిన అనేక శాసనాలను కనుగొన్నారు. చైత్యగృహాలకు తూర్పు దిక్కున 6 గదులున్న నివాస గృహాలు, వాటిలో గృహావసర సామాగ్రుల శిథిలాలు బయల్పడ్డాయి[4] ఇక్కడికి 5కి.మీల దూరంలో ఉన్న రత్నగిరిలో తాంత్రిక ఆచారలతో కూడిన వజ్రయాన బౌద్ధవిశ్వాసాలు ఉన్నట్లు తెలుస్తున్నది కాని ఉదయగిరిలో అటువంటి బౌద్ధ విశ్వాసాలు ఉన్నట్లు నిరూపించే శాసనాలు లభ్యం కాలేదు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Udayagiri". Government of Odisha, Department of Tourism. Archived from the original on 2012-02-20. Retrieved 2017-10-12.
- ↑ Hoiberg & Ramchandani 2000, pp. 175–176.
- ↑ 3.0 3.1 3.2 Kumar, Arjun (22 March 2012). "Sounds of silence at Buddhist sites in Odisha, Ratnagiri-Udayagiri-Lalitgiri". Economic times.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "Excavations – 2000–2005 – Orissa". Various Udaygiri-2, dt. Jajpur. Archaeological Survey of India. Archived from the original on 11 అక్టోబరు 2011. Retrieved 9 April 2015.
- ↑ Session 2000, p. 74.
- ↑ Session 2000, p. 76.
అధోజ్ఞాపికలు
[మార్చు]- హోయిబెర్గ్, డేల్; రాంచందాని, ఇందూ (2000). స్టూడెంట్స్ బ్రిటానికా ఇండియాStudents'. పాపులర్ ప్రకాశన్. ISBN 978-0-85229-760-5.
- సెషన్, ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ (2000). ప్రొసీడింగ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్. ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్.