కుసినార
కుసినగరం कुशीनगर కాసియా | |
---|---|
పట్టణం | |
దేశము | భారతదేశము |
రాష్ట్రం | ఉత్తరప్రదేశ్ |
జిల్లా | గోరఖ్‌పూర్ |
ప్రభుత్వం | |
• జిల్లా మెజిస్ట్రేట్ | రిగ్జియన్ సంఫెల్ |
జనాభా (2011) | |
• మొత్తం | 17,983 |
భాషలు | |
• అధికార భాష | హిందీ |
కాలమానం | UTC+5:30 (భా.ప్రా.కా) |
జాలస్థలి | www |
బౌద్ధ |
పర్యాటక ప్రాంతాలు |
---|
![]() |
ప్రముఖ బౌద్ధ స్థలాలు |
కుసినగరం (హిందీ: कुशीनगर , Urdu: کُشی نگر), కుసినగరం లేదా కుసినార భారతదేశం లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జిల్లాలోని ఒక నగర పంచాయతీ. ఇది 28వ జాతీయ రహదారి ప్రక్కన, గోరఖ్‌పూర్ కు 52 కి.మీ తూర్పున ఉంది.ఇది భౌద్ధమత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఈ ప్రాంతంలో గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందాడు[1]. దీని పరిసర నగరాలు హత, పద్రౌన, డియోరియా, ఫాజిల్ నగర్.
విశిష్టత[మార్చు]
బుద్ధుడు నిర్వాణం పొందిన చోటు. ఆయన తన అంతిమ దినాలను ఎక్కడెక్కడ గడిపాడో, ఎక్కడ నిర్వాణం పొందాడో ‘మహా పరినిబ్బాణ సుత్త’ తెలియజేస్తున్నది. వైశాలిలో ఉండగా తీవ్రమైన అనారోగ్యం కలిగింది. కాని, శిష్యులను కలుసుకొని మాట్లాడిన తరువాతనే దేహత్యాగం చేయాలనుకోవడం వల్ల సంకల్ప బలంతో తిరిగి ఆరోగ్యం పొందాడు. పరిసరాలలోని భిక్షువులను కలుసుకోవాలని అనుకొన్నాడు. భండగామ, బెలువ, పావ, జంబుగామ మొదలైన ప్రదేశాలకు వెళ్లాడు. తుదకు చేరిన ప్రదేశం కుసినార. అక్కడ సాల వృక్షాల వనం చేరాడు. మంచి నీరు దొరక్క ఇబ్బంది పడ్డాడు. శిష్యుడు ఆనంద్‌తో రెండు సాల వృక్షాల నడుమ తనకు శయ్య ఏర్పాటు చేయమని కోరాడు. అతడు అలాగే చేశాడు. ఆ శయ్యపై బుద్ధుడు నిర్వాణం పొందాడు. అది మహా పరినిర్వాణం. సంస్కృత భాషలో ఇది కుశి నగరం. ఒకప్పుడు మల్ల జనపదానికి ముఖ్య పట్టణం. బుద్ధుడి కాలంలో ఉత్తర భారతంలో మొత్తం పదహారు జనపదాలు ఉండేవి. (జనపదం రాజ్యం కంటే తక్కువ స్థాయిది.) అందులో మల్ల జనపదం ఒకటి. బుద్ధుడు నిర్వాణం పొందిన సాల వనం గోగ్రి ఉపనదీ తీరంలో, కుశి నగరానికి ఉత్తర దిక్కున ఉంది. బుద్ధుడి భౌతిక కాయానికి దహన క్రియలు కూడా ఇక్కడే ఊరి వెలుపల జరిగాయి.
మూలాలు[మార్చు]
- ↑ W. Owen Cole, Peggy Morgan Six Religions in the Twenty-First Century 2000 - Page 204 "Kushinara. Here, near modern Kasia in Uttar Pradesh, is the site of the Buddha's death. A temple commemorates the Buddha's final ..."
ఇతర లింకులు[మార్చు]
- Official Photo Gallery of Kushinagar
- Entry on Kusinara (Kushinagar) in the Dictionary of Pali Proper Names
- Photos of Kushinagar ruins and stupas
- Photos of Kushinagar
- Kushinagar Travel Guide Kushinagar Photo Gallery, Temples At Kushinagar
![]() |
Wikimedia Commons has media related to Kushinara. |
- Articles with short description
- Short description is different from Wikidata
- Infobox settlement pages with bad settlement type
- Pages using infobox settlement with unknown parameters
- Articles containing Hindi-language text
- Articles containing Urdu-language text
- బౌద్ధ పుణ్యక్షేత్రాలు
- ప్రాచీన భారతదేశ నగరాలు
- హిందీ భాషా పాఠాన్ని కలిగి ఉన్న వ్యాసాలు