నాసిక్ గుహలు
బౌద్ధ |
పర్యాటక ప్రాంతాలు |
---|
ప్రముఖ బౌద్ధ స్థలాలు |
లలితగిరి
|
నాసిక్ గుహలు నాసిక్ నగరమునకు దెగ్గరలో త్రిరశ్మి అను మూడు రాతికొండలయందు ఒక కొండపైన ఉన్నాయి. ఈ గుహలందు కనబడు అనేకశాసనముల ననుసరించి, ఇచటి తొలి గుహలు క్రీ.పూ. దాదాపు 160 సం, లేక 170 సం.ల నాడు నిర్మితమయినవి. శాతవాహనులు వమ్శపు రాజైన కృష్ణరాజు ఇచతి ప్రథమ విహారమును నిర్మించాడు. ఈగుహలు మొత్తం 17. ఇవాన్నియు నిర్మాణమగునప్పటికి క్రీస్తు తరువాత దాదాపు 6,7 శతాబ్దములు గడిచినవి. అందుచేత ఈ ప్రాంతమున ఆంధ్రసామ్రాజ్య అంతరించిన తరువాత క్షహరాతుల కాలమందు నిర్మితములయిన గుహలు సయితము ఈవర్గమందు ఉన్నాయి. ఈగుహలందు ఒకటి మాత్రమే చైత్య గుహ (ఆరాధన గుహ) మిగితావన్నియు విహారగుహలే. విహార మనగా బౌద్ధ సన్యాసుల నివాసగృహము. విహారమందు భిక్షువులు విడిగా ధ్యానమొనర్చుటకు వేరువేరు గదులేర్పది, వారందరు కూడి ధర్మచర్చలోనర్చుటకు ఒక శాలసయిత ఉండును. ఇదే శాలసయిత భిక్షుక గుహల యందు ఉండదు. ఇదే ముఖ్య భెధము.
చిన్నపుడు ఇసుకలో ఆటలు ఆడుకునే ఉంటారుకదా.. ఇసుకలో ఆటలాడు కోవడం తడి తడిగా వున్నఇసుకతో ఇళ్ళు, గోపురాలు కట్టడం, ఇసుకను గోపురంగా చేర్చి, లోపల కాలిని గాని, చేతిని గాని లేదా వస్తువునో గాని ఉంచి వాటిని మెల్లగా వెనక్కు తీసి, అక్కడి ఇసుకను తొలగించి ద్వారా మార్గాలు ఏర్పాటు చేయడం మనకందరికీ తెలిసినవిషయమే., మీ జ్ఞాపకాలకి ఆలోచనని జోడిస్తే కొండలను తొలచిన విధానం మీ ఉహకు అందుతుంది. సరిగ్గా అలాగే కొండలను తొలిచి మన శిల్పులు గుహాలయాలను నిర్మించారు.మన దేశంలో శిలలను తొలిచే విధానం దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆరంభమయింది. మొదట కొండల నుంచి ఏ భాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గుర్తుగా గీతలు గీసుకునే వారు. ఆ తరువాత తొలచడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు భాగం నుంచి తొలుచుకుంటూ కింది భాగానికి వచ్చేవారు.
గుహనిర్మాణము-శిల్పకళ
[మార్చు]నాసికుగుహలందు కొన్ని గుహలనిర్మాణము పూర్తికాలేదు. ఇచటి చైత్యగూహ అతిప్రాచీనమైనది. ఈగుహయందలి శాసనముల ఆధారముగా గుహముఖమదలి బౌద్ధప్రాకారశిల్పము, ద్వారబంధము ప్రక్కన నిలచియున్న యక్షరూపము నాదసిరి అనే శిల్పి నిర్మించినట్లు తెలియుచున్నది. ఈ చైత్యగృహమును మహాకుసిరి మనుమరాలు భట్టపాలిక పూర్తిచేయించెనని తెలియుచున్నది.దీనికంటె దాదాపు 10సం.లు పూర్వమే నిర్మితమైన విహారము శాతవాహనవంశజుడయిన కృష్ణరాజు నిర్మితము. చైత్యముఖమందు మహాగవాక్షమున కిరువైపుల అలంకరించియున్న పడగ నాగసర్పములు ఆంధ్రశిల్పుల ఉత్తమకళను తెలుపుచున్నవి.
చైత్యగుహాముఖము అతిప్రాచీనరీతిని, కలుపనిర్మాణక్రమమును అనుసరించినప్పటికిని, అతిసుందరమయి, మహాద్భుతముగ ఉన్నది. క్రిందిభాగము కొంతవరకు మాత్రము రాతితో నిర్మించి, పైభాగమందు అవసరమయిన అంశములను మాత్రము ఘనమయిన కలుపదులములచే నిర్మించి, మిగిలిన భాగమంతయు వెదురు అల్లిన విధముగ ఆనాటి వాస్తురూపమును తెలియుజేయుచు, ఈ గుహాముఖము అత్యద్భుతముగా మలిచియున్నది. ఈ చైత్యగుహకు ఒకటే ద్వారము. ఈ ద్వారబంధము అలంకారవిశేధమేమియు లేక, సామాన్యముగ నున్నది. దీనిపైన చైత్యరూప గవాక్షమురీతిన ఒక చూరును మలిచిరి. చూరుక్రింద ద్వారబంధఊర్ధ్వపట్టికపైన ఉన్న కుడ్యమును రెండు భాగములొనర్చిరి. ఇందు క్రింది భాగము అర్ధచంద్రాకారము. దీనిని అల్లిన తడికవలె అలంకారయుతముగ మలిచిరి.మిగిలిన పైభాగమందు జంతురూపములు మలిచిఉన్నవి. ద్వారబంధమునకు ఎడమ వైపున నాదశ్రీ మలిచిన యక్షరూపము ఉన్నది.ఈ యక్షరూపమున మధ్యన ఎత్తయిన ముడికలిగిన ప్రాచీనాఆంధ్ర తలపాగ కనబడుచున్నది.
సరిగ ద్వారముపైన చైత్యగృహమునకు అవసరమగు వెలుగుకొరకు ఒక పెద్ద చైత్యరూప గవాక్షము ఉంది. ఈ గవాక్షము క్రింది అడ్డపట్టికముఖము అలంకారయుతముగా బౌద్ధప్రాకారరీతిన మలిచిఉన్నది.దీనికి ఇరువైపుల నాగసర్పరూపములు ఉన్నాయి.ఇక్కడ అమర్చిన స్తంభరూపములు బోధికభాగమున మృగరూపములు కలిగి, భారతస్తూపప్రాకారమందలి స్తంభరూపములను, అశోక స్తంభరూపములను స్మృతికి తెచ్చునవి అయిఉన్నవి. మహాగవాక్షమునకు ఆనాదు నిర్మించిన కలుపాలంకారమంతయు ఇప్పుడు శిథిలమయిపోయినవి.
ఈగుహ అంతర్భాగమున చైత్యగృహము దాదాపు 39 అడుగుల పొడువు, 22 అడుగుల వెడల్పు, చివరన 2 అడుగుల అత్తయిన స్త్టూపము కలిగిఉన్నది. నట్టి (Nave) జరుగు సమయమున గీత వాయిద్యములకయి, ఒక చిన్న ఉపప్రచ్చాదనమును మహా గవాక్ష పీఠమునకు సరిగా ఏర్పరిచిరి. ఇది నిలుచుటకై రెండు స్తంభములను ఆశిల్పులు మలిచిరి.ఈ స్తంభద్వయము కాక, మరి మూడు స్తంభములు ఈ చైత్యగృహమందు ఉన్నాయి. ఈ స్తంభములందు గమనింపదగ్గ విశేషమేమన, కార్ల గుహలు వద్ద నున్న స్తంభములవలె, క్రింది భాగమమదు పీఠము, అధిష్ఠాన్ము ఏర్పడి, పైభాగమంతయు అష్టకోణాకారమున ఉంది.కాని ఈ స్తంభములకు శిరోభాగము మాత్రము లేదు.స్తంభరూప నిఋనయమునకు ఆంధ్రశిల్పులు ఈ గుహ నిర్మాణకాలమునాటి నుండియు కృషి చేసారు.
కళాభావమున ఈగుహలందు చూడదగినవి 3 మాత్రమే అని చెప్పవచ్చును.ఈగుహయందలి రూపశిల్పములు, గుహలు మలిచినానంతరము, చాలా కాలమునకు అప్పుడప్పుదు చేరినవి.వీటియందు గమనింప దగ్గ శిల్పవిశేషలేవియు లేవు. అందుచేత ఈ గుహలందు ఆంధ్రశిల్పగతి వాస్తువునందె పరికింపదగును. ఈమూడు నహపాన, యజ్ఞశ్రీ, గౌతమిపుత్ర గుహలూ . ఇవన్నియు విహార గుహలే.ఈ గుహలందున్న శాసనములననుసరించి వీటికి ఈపేర్లు ఏర్పడినవి.క్రీ.పూ.100 సం.కు నహపానగుహ, 130 సం.కు పూర్వము గౌతమిపుత్ర, 180 సం.కు పూర్వము యజ్ఞశ్రీగుహలు వరుసగా నిర్మితమయినవి. వీటియందు ఉన్న శాసనములననుసరించి ఆప్రాంతము అప్పుడు ధాన్యకటక ఆంధ్రరాజుల ఏలుబడిలో నుండి, నాసికునందు నివాసము ఏర్పరచుకున్న రాజప్రతినిధులచే పాలింపబడినట్లు తెలియుచున్నది.
నహపానుని గుహ
[మార్చు]నహపానుని గుహయందు ఆంధ్రరాజప్రతినిధి అయిన నహపానుని కుటుంబమునకు సంబంధించిన 6 శాసనములు ఉన్నాయి. ఇది విహార గుహాయినను, ఆనాటికి దాదాపు 150సం.కు పూర్వమే నిర్ణయమయి, సంప్రదాయపరమయిన చైత్యక్రమమును అనుకరించుట, నాతి ఆంధ్రశిల్పి సహజాఅంతర్యస్వేచ్ఛనువర్తిని ప్రకటించును.ఈగుహ దాదాపు 40 అడుగుల పొడవు అంతే వెడల్పు కలిగి చతురస్రముగ ఏర్పడినది. దీనియందు వెనుక కుడ్యమునకు 6, ప్రక్కకుడ్యములకు 5 చొప్పున 16 విడిగదులు ఉన్నాయి. ఈగుహ యందు 6 స్తంభములు ఉన్నాయి.ఇవి కార్ల గుహలు పోలియున్నవి.కాని శిరోభాగమయిన బోధికయందు మాత్రము ఒకింత భేదము కనిపించును. కార్లస్తంభముల బోధికలపైన ప్రచ్చాదనము మొదలడినట్లుండును. అచట బోధిక సయితము స్తంభభాగమని స్పష్టముగా తోచును. కాని ఇచట ప్రచ్చాదనమును భరించు దూలపు పట్టిక బోధికగుండా ప్రసరించును. అందుచేత బోధిక భాగమున అమర్చిన వృషభరూపములు స్తంభభాగముల్గా కనబడక, స్తమభముపైన దూలము ప్రక్కన విశ్రమించు విడిరూపములుగా కనిపించును.ఈగుహయందు వెనుకభాగమున పూర్వము అలంకరించియున్న స్టుపమును ఎవరో హైందవ శిల్పులు భైరవరూపముగ మలిచిరి. ఇదేరీతిన ఈగుహకు అగణభగమందుసయితము కుడ్యమఖమందు ఇరువైపుల ఈ భైరవరూపములే కనిపించును.
గౌతమిపుత్ర గుహ
[మార్చు]గౌతమిపుత్ర గుహ నహపానుని గుహకంటే కొంచెం పెద్దదయిన విహారము. ఇది నహపానుని గుహ తరువాత 30 సం.లకు మలిచిరి.ఈగుహసయితము 16 విడిగదులు కలిగి, చాల వరకు నహపానుని గుహను పోలియున్నది.కాని గుహ నిర్మాణము కార్ల గుహలు కన్హరిచైత్యమును పోలియున్నది.ఈగుహ సింహద్వారమును అలంకరించియున్న శిల్పములు కొలది మొరటుగా ఉండును.ఈ శిల్పముల శైలి సాంచి శిల్పములు శైలిని పోలియున్నవి. ద్వారబంధమునకు ఇరువైపుల గోడన అన స్తంభములు (Pilasters) మలిచియున్నవి. అను స్తంభములనగా గోడలోనికి పొదిపి, సగము మాత్రమే బయట ఉండునట్లు అగుపడు స్తంభములు. ఈ అనుస్తంభములు 6 భాగములోనర్చి ఈ భాగములందు ఒక చిత్రమయిన కథను చిత్రించిరి. ఈ కథ ఒక స్త్రీ, ఇద్దరు పురుషులను గూర్చింది.కథ చివరిభాగమందు ఆఇద్దరియందు ఒక పురుషుడు స్త్రీని ఎత్తుక పారిపోవును. ద్వారబంధము పైన బోధిమండస్తూపము, చక్రము మలిచి యున్నవి. ఈ ద్వారబంధమునకు ఇరువైపుల ద్వారపాలకులు కలరు.వీరు పూలగుత్తులను పట్టుకొనినారు. వీరు రూపములందు మాన ప్రమాణములు సరిగా ఏర్పడక, ఈశిల్పములు సరిగా కంపించవు. వీరి వసనాభరణములు, తలకట్టు అన్నియు సర్వసాంచీనాంధ్రశిల్పములందువలె, అజంతా 10 వ గుహయందలి వర్ణచిత్రములవలె నున్నవి.ప్రాచీనాంధ్రశిల్పులందు ఉత్తమశ్రేణికి చెందిన మహాశిల్పులేకాక, సామాన్య అధమశ్రేణులకు చెందిన శిల్పులు సయితము ఉండిరనుటకు ఈ శిల్పములు తార్కాణము. ఈ గుహాంగణమున ఉన్న వరాండాలో 6 స్తంభములు ఉన్నాయి.ఈ స్తంభశ్రేణికి ఇరువైపుల గోడలనానుకొని 2 స్తంభములు ఉన్నాయి. ఈ అనుస్తంభములు శిల్పములచే అతివిరివిగా అలంకృతమైఉన్నవి.ఈ వరాండా స్తంభములు నేలనుంచి మొదలవ్వకుండా ఒక చిన్న అంచుగోడపై నుంచి లేచిఉన్నవి. అందుచేత స్తంభపు క్రింది భాగములైన పీఠాధిష్టానములు వీటియందు లోపించినవి. ఈస్తంభముల గ్రీవమునందు ఒక ఘటమును పరివేష్టించిన పేటికకోణములందు కుబ్జరూపములు మలిచిఉన్నవి. ఈ కుబ్జులు స్తంభములకు అతిశయించిన అందమును ఇవ్వక, అతుకులవలె కనబడుచున్నవి. ఈస్తంభబోధికలందు వృషభములు, హయములు, స్ఫింక్సులు (Sphinxes- అనగా మానుషస్త్రీముఖము కలిగిన జంతురూపములు) మొదలైనవి ఉన్నాయి.నహపానుని గుహస్తంభములవలె బోధికయందు నాలుగు మృగరూపములను మలిచి, ప్రచ్చాదనమును భరించు అడ్డదూలములను బోధికలగుండా ప్రసరింపజేసిరి.ఈ అడ్డదూలపు పట్టికపైన దూరు కొంచెము ముందునకు వచ్చింది. ఈదూరు ముఖమంతట బౌద్ధప్రాకారరూపము అలంకారయుతముగా మలిచియున్నది.ఈ స్తంభములకు క్రింద నిర్మితమైన అంచుగోడమీద అలంకారశిల్పము అమరావతి స్తూపప్రాకార శిల్పముతో పోలియున్నది. అందుచే ఆనాటికి బహుశా ఆంధ్రగర్భమైన అమరావతియందు మహాస్తూపశిల్పముల నిర్మాణము జరుగుచుండి యుండవచ్చును. అందుచేత ఉత్తమశ్రేణికి చెందిన ఆంధ్రశిల్పులందరు ఏకముగా అమరావతిదివ్యస్తూపకార్యమందు నిమగ్నులయి ఉండవచ్చును.అందుచేత అతిదూరమగు నాసికు గుహలకు సామాన్య ఆంధ్ర శిల్పులే మలిచి ఉండవచ్చును.
శాతకర్ణి గుహ
[మార్చు]శాతకర్ణిగుహ కూడా ఒక పెద్ద విహారము. ఇది ప్రథమమున నిర్మితమయిన తరువాత అనేకమార్లు మలిచి గుహను పొడుగించుటేకాక రూపశిల్పములను సయితము చేర్చిరి. ఈ విహారమందు ఇరువైపుల కుడ్యమునకు 8 చొప్పున 16 ఉపగదులు ఉన్నాయి. ఇవికాక వెనుకభాగమందు ఒక ఆదిత్యమును తొలిచి, ఆదిత్యమునకు ఎడమవైపున మరిరెండు చిన్న గదులను తొలిచిరి. ఈ ఉపగదులందు అరుగులు రాతివే. విహారగర్భమదేర్పడిన ఆదిత్య మందిర ద్వారమునకు ఇరువైపుల 9 అడుగుల ఎత్తున ద్వారపాలకుల రూపములు ఉన్నాయి. వీరి చేతులందు తామర పువ్వు లను ధరించి, శిరముపైన మకుటములతో ఉండెను. ఒక ద్వారపాలకుని ఎదురున చిన్న స్తూపమును, రెండవవానికి ఎదురున బుద్ధ ప్రతిమ మలిచిరి. ఆదిత్యమందు 10 అడుగుల ఎత్తున పెద్ద బుద్ధప్రతిమ ఉంది. ఈ బుద్ధ రూపము ధర్మచక్రముద్రను ధరించి, పాదములు ఒక పద్మముపై నుంచి, పర్యంకాసనమున నిర్మితమైయున్నది. ఈప్రతిమకు ఇరువైపుల ఇద్దరు చామరు ధారులు ద్వారపాలకుల వలె కలరు. ఆదిత్యమందలి రూపశిల్పములు క్రీస్తుకు తర్వాత 7 వ శతాబ్దమున నిర్మాణమయినవని పండితుల అభిప్రాయము.
Gallery
[మార్చు]-
A విహార గుహ
-
చైత్యగుహ
-
చైత్య గుహ 18
-
విరిగిన ప్రతిమ
-
బుద్ధ ప్రతిమ
ఇవీ చూడండి
[మార్చు]- ప్రపంచ వారసత్వ ప్రదేశం
- ఆసియా, ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
- భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
- దర్శనీయ స్థలాలు
- కార్ల గుహలు
మూలాలు
[మార్చు]- ↑ "ఎల్లోరా గుహలు ఎలా నిర్మించారు". Archived from the original on 2011-08-11. Retrieved 2015-11-04.