ఎట్టుమనూర్ మహాదేవర్ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎట్టుమనూర్ మహాదేవర్ దేవాలయం కేరళ రాష్ట్రంలో కొట్టాయం జిల్లాలోని ఎట్టుమనూర్‌లో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో పరమేశ్వరుడు మహదేవునిగా భక్తులకు దర్శనమిస్తాడు.[1]

మహాదేవర్ దేవాలయం

స్థల పురాణం[మార్చు]

పూర్వం ఖార అనే రాక్షసుడు ఈశ్వరభక్తుడు. ఘోర తపస్సు చేసి ఆ శంభుని నుంచి మూడు శివలింగాలను పొందుతాడు. వీటిని తీసుకువెళ్లే సమయంలో ఒకటిని పళ్లతో ఉంచుకొని మిగిలిన వాటిని రెండు చేతులతో పట్టుకుంటాడు. అనంతరం వరుసగా కడుతురుత్తి, వైకొం, ఎట్టుమనూర్‌లో ప్రతిష్ఠిస్తాడు. తరువాత జింక అవతారం దాల్చి ఎట్టుమనూర్‌లో స్వామి సేవలో తరిస్తాడు. ఆయన భక్తికి మెచ్చిన లయకారకుడు జింక రూపంలో ఉన్న ఖారుడిని ఎత్తుకొంటాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు భక్తుని కోసం కైలాసం నుంచి విచ్చేసిన ప్రదేశం కావడంతో ఎట్టుమనూర్‌ దివ్యక్షేత్రంగా శోభిల్లుతోంది.[2][3]

దేవాలయ విశేషాలు[మార్చు]

మహదేవునికి ట్రావన్‌కూర్‌ రాజ్య స్థాపకుడు తిరునాళ్‌ మార్తాండవర్మ బంగారుతో చేసిన ఎనిమిది ఏనుగుల విగ్రహాలను కానుకలుగా సమర్పించాడు. వీటిలో ఏడు ఏనుగుల విగ్రహాలు రెండు అడుగుల ఎత్తుఉంటాయి. మరో ఏనుగు ఒక్క అడుగు ఎత్తులో ఉంటుంది. అందుకనే వీటిని ఎళారా పొన్నన అంటారు. మలయాళంలో ఎళారా అంటే ఏడున్నర అని అర్థం. పొన్నన అంటే బంగారు ఏనుగు అని. ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో వీటిని ప్రదర్శస్తారు.

ఉత్సవాలు[మార్చు]

ప్రతి నెల ఫిబ్రవరి-మార్చిలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో ఎనిమిది, పదోరోజున బంగారు ఏనుగులతో ఊరేగింపు జరుపుతారు. వేడుకల్లో భాగంగా అలంకరించిన ఏనుగులతో పాటు బంగారు ఏనుగుల విగ్రహాలను భక్తుల సందర్శనకు తీసుకువస్తారు.

ఆలయ శిల్పకళ[మార్చు]

ఆలయాన్ని కేరళ వాస్తురీతికి అనుగుణంగా నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో గోడలపై వేసిన చిత్రాలు అద్భుతంగా ఉంటాయి. అందర్ని అలరిస్తాయి. శివతాండవం చేస్తున్న చిత్రం ధ్వజస్తంభంపై వృషభమూర్తి బొమ్మను చూడవచ్చు.

రవాణా సౌకర్యం[మార్చు]

  • రైల్వేస్టేషన్‌: కొట్టాయం నుంచి 11 కి.మీ. దూరంలో ఉంది. కొట్టాయం చేరుకొని ఆటోలు, బస్సుల ద్వారా చేరుకోవచ్చు.
  • రోడ్డుమార్గం: దేశంలోని అన్నిప్రాంతాలనుంచి కొట్టాయానికి రోడ్డు మార్గముంది.
  • విమానాశ్రయం: కొచ్చిలోని విమానాశ్రయంలో దిగి అక్కడ నుంచి వాహనాల్లో చేరుకోవచ్చు. దూరం 77 కి.మీ.

మూలాలు[మార్చు]

  1. "Kerala Siva Temples - Hinduism Today | HighBeam Research". web.archive.org. 2015-09-24. Archived from the original on 2015-09-24. Retrieved 2020-03-07.
  2. "സർവ്വൈശ്വര്യങ്ങൾ തരും ഏഴരപ്പൊന്നാന ദർശനം!". ManoramaOnline. Archived from the original on 2019-12-20. Retrieved 2020-03-07.
  3. ఈనాడు (2020). "ఎట్టుమనూర్‌,మహదేవుని సన్నిధిలో బంగారు ఏనుగులు". {{cite journal}}: Cite journal requires |journal= (help)