Jump to content

చిత్రకూట్, మధ్యప్రదేశ్

అక్షాంశ రేఖాంశాలు: 25°00′N 80°50′E / 25.00°N 80.83°E / 25.00; 80.83
వికీపీడియా నుండి
చిత్రకూట్
మందాకిని నది, చిత్రకూట్ వద్ద ఘాట్‌ల దృశ్యం, హనుమాన్ ధారలోని దేవాలయాలు
చిత్రకూట్ is located in Madhya Pradesh
చిత్రకూట్
చిత్రకూట్
Coordinates: 25°00′N 80°50′E / 25.00°N 80.83°E / 25.00; 80.83
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాసత్నా జిల్లా
జనాభా
 (2001)
 • Total22,294
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
ISO 3166 codeఇండియా-ఎంపి
Vehicle registrationఎంపి

చిత్రకూట్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రం, సత్నా జిల్లాలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం, నగర పంచాయితీ. ఇది మతపరమైన, సాంస్కృతిక, చారిత్రక, పురావస్తు ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇది బాఘేల్‌ఖండ్ ప్రాంతంలో ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాకు సరిహద్దుగా ఉంది. దీని ప్రధాన కార్యాలయం చిత్రకూట్ ధామ్ సమీపంలో ఉంది.

అమావాస్య, సోమవతి అమావాస్య, దీపావళి, శరద్-పూర్ణిమ, మకర సంక్రాంతి, రామనవమి, ఉచిత నేత్ర సంరక్షణ వైద్య శిబిరాల వంటి సందర్భాలలో యాత్రికులను ఆకర్షిస్తోంది. 'ఆరోగ్యధామ్' వంటి ప్రముఖ 'ఆయుర్వేద', 'యోగ' కేంద్రాలు చిత్రకూట్‌లో ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

చిత్రకూట్ ప్రాంతం గురించిన ప్రస్తావన రామాయణ ఇతిహాసంలో కూడా ఉంది. ఈ ప్రాంతంలోనే భరతుడు తన అన్న రాముడిని అయోధ్యకు తిరిగి రావాలని కోరాడు. రాముడు తన తండ్రి దశరథుని అంత్యక్రియలను అందరి దేవతలు సమక్షంలో ఈ ప్రాంతంలోనే నిర్వహించాడు. చిత్రకూట్ అడవుల్లో ఆశ్రయం పొందిన రాముడు, సీత, లక్ష్మణుడు 12 సంవత్సరాలపాటు అడవుల్లో గడిపారు. ఇది ఇప్పటికే అనేకమంది మునులకు, రుషులకు నిలయంగా ఉంది.[1] అత్రి ముని, ఋషి అగస్త్యుడు, శరభంగ మహర్షితో సహా ప్రాచీన భారతీయ ఋషులు చిత్రకూట్ అడవులలో ధ్యానం చేసినట్లు చెబుతారు.[2]

భౌగోళికం

[మార్చు]

చిత్రకూట్ అంటే 'అనేక అద్భుతాల కొండ' అని అర్థం. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న ఉత్తర వింధ్య శ్రేణిలో ఈ చిత్రకూట్ ప్రాంతం ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లా, మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో చేర్చబడింది. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లా 1998 సెప్టెంబరు 4న ఏర్పాటుచేయబడింది.[3]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, చిత్రకూట్ జనాభా 23,316 ఉంది. ఈ జనాభాలో పురుషులు 54.36%, స్త్రీలు 45.63% ఉన్నారు. ఇందులో స్త్రీ లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 931కి కంటే తక్కువగా (840) ఉంది. చిత్రకూట్ సగటు అక్షరాస్యత రేటు 70.01%, జాతీయ సగటు 74% కంటే తక్కువగా, రాష్ట్ర సగటు 69.32% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 79.49%, స్త్రీల అక్షరాస్యత 58.40%గా ఉన్నాయి. ఈ జనాభాలో 15.72% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Chitrakoot: Mythology Revisited". OutlookIndia.com. Outlook Traveller. 15 May 2017. Retrieved 2022-11-05.
  2. Mohan, Vineeth (23 April 2018). "Places Connected To Lord Rama And Ramayana - Chitrakoot". NativePlanet.com. Native Planet. Retrieved 2022-11-05.
  3. District Unit Chitrakoot, National Informatics Centre

బయటి లింకులు

[మార్చు]