లక్ష్మణుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామునితో లక్ష్మణుడు

రామాయణంలో మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని రెండవ తమ్ముడు. దేవేంద్రుడు ఇంద్ర దేవుడు ఆదిశేషుడై సప్త ఋషుల అంశ వలన జన్మించాడు.

జననం[మార్చు]

ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు.కౌసల్య, సుమిత్ర, కైకేయి అయన భార్యలు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు.

వనవాస కాలంలో అన్నకు గొప్ప సహాయంగా నిలిచాడు, సీతను రావణాసురుని చెర నుంచి విడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. అన్నదమ్ములంటే రామలక్ష్మణుల్లా ఉండాలని లోకోక్తి. 1. శ్రీరాముని తమ్ములలో ఒకఁడు. తండ్రి దశరథుఁడు. తల్లి సుమిత్ర. ఇతఁడు తన అన్న అగు రామునియందు మిక్కిలి భక్తి కలవాఁడు. చిన్నప్పటి నుండి రాముని ఎడఁబాయక మెలఁగుచు ఉండి అతఁడు కౌశికయాగ సంరక్షణము చేయ పోయినప్పుడు అతని వెంట పోయినది కాక అరణ్యవాసము చేయ పోయినప్పుడును వెంట పోయి ఎల్లకష్టములకు ఓర్చి అన్నను కొలుచుచు ఉండెను. కనుకనే భరతుఁడు ఇతనికంటే పెద్దవాఁడుగా ఉండఁగాను, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని అనుక్రమ విరుద్ధముగా వీరు చెప్పఁబడుదురు.

వివాహం[మార్చు]

ఇతని భార్య జనక మహారాజు కూఁతురు అయిన ఊర్మిళ.శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనకుడు సీతాదేవి తరువాత జన్మించిన తన కూతురు ఊర్మిళను లక్ష్మణునికి వివాహం జరిపించాడు. ఊర్మిళ రామాయణంలో దశరథుని కోడలు, లక్ష్మణుని భార్య. సీతారాములతో లక్ష్మణుడు వనవాసాలకు పోయిన తరువాత, అతనికి శ్రీరామ సంరక్షణార్ధం నిద్రలేమి కలిగింది. అందువలన ఊర్మిళ ఆ పదునాలుగు సంవత్సరాలు నిదురపోయిందని అంటారు. ఆధునిక కాలంలో ఎక్కువసేపు నిద్రపోయే వారిని ఊర్మిళాదేవితో పోలుస్తారు. ఈమె భర్తయగు లక్ష్మణుఁడు తమ అన్నవెంట వనమునకు పోయి మరల అయోధ్యకు వచ్చి చేరునంతవఱకు ఇతర వ్యాపారములెల్ల మఱచి నిద్రించుచుండెను అనియు, అంతకాలమును లక్ష్మణుఁడు నిద్రలేక యుండెను అనియు ఇతిహాసము.

ఇవి కూడా చూడండి[మార్చు]