ఊర్మిళ (రామాయణం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఊర్మిళ రామాయణంలో లక్ష్మణుని భార్య. జనక మహారాజు కూతురు. ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్ళి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఊర్మిళ పాత్రకు ఆదికవి వాల్మీకి సముచితమైన స్థానాన్ని ఇవ్వకుండా ఉపేక్షించినాడని పలువురు విమర్శకుల అభిప్రాయము. అయితే రామాయణాన్ని అనువదించిన ఇతర కవులు ఊర్మిళ త్యాగమయ జీవితాన్ని అత్యంత సహజసుందరంగా చిత్రించారు.