ఖర (రామాయణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖర
సమాచారం
కుటుంబంరాకా (తల్లి)
దూషణ, త్రిశిర (సోదరులు)
శూర్పణఖ (సోదరి)

ఖర రామాయణ ఇతిహాసంలోని ఒక నరమాంస భక్షక రాక్షసుడు. శూర్పణఖకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రాముడిపై దాడి చేసినప్పుడు రామ- లక్ష్మణుల చేతిలో చంపబడ్డాడు.

కుటంబం[మార్చు]

దూషణకు కవల సోదరుడైన ఈ ఖర, రావణుడి బంధువైన కైకేసి సోదరి రాకా కుమారుడు.

నేపథ్యం[మార్చు]

లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును కత్తిరించిన తరువాత, ఖర వచ్చి రామలక్ష్మణులతో యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో, ఖర ఓడిపోయి చంపబడ్డాడు. ఆ తరువాత అతని సోదరులు దూషణ, త్రిశిరాలు కూడా చంపబడ్డారు.[1] దండ రాజ్యానికి పాలకుడైన ఖర జనస్థానం నాసిక్ నగరం అని తెలుస్తోంది. యుద్ధంలో ఆరితేరిన ఖర, తన ప్రధాన భూభాగంలో ఉత్తర రాజ్యమైన లంకను రక్షించాడు. రాముడు - రావణుడికి మధ్య జరిగిన రామాయణ యుద్ధంలోఖర కుమారుడు, మకరాక్షుడు, తన మేనమామ ప్రహస్తుడు, రావణుడి పక్షాన పోరాడి, రామునిచే చంపబడ్డారు.[2]

మూలాలు[మార్చు]

  1. Khara's Death
  2. A Classical Dictionary of Hindu Mythology & Religion by John Dowson