అక్షకుమారుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అక్షకుమారుడు లంకాధిపతి అయిన రావనాసురుడి కుమారుడు.

అశోక వనంలో హనుమ యుద్ధం[మార్చు]

అశొకవనములొ సీత దర్శనము జరిగిన తర్వాత రావణుడి సైన్యాన్ని పరీక్షించడం కోసము అశొక వనాన్ని చిన్నభిన్న చేయిచుండగా రావణాసురుడు రాక్షస సైన్యము హనుమంతుడి మీదకు వస్తుంది. ముందు హనుమ జంబుమాలి ని, 7 మంది మంత్రి సుతులను యుద్ధములొ చంపాక రావణాసురుడు ఐదుగు సేనాగ్రనాయకులను పంపిస్తాడు. వారే విరూక్ష, యుపాక్ష, దుర్ధర, ప్రగస, బాసకర్ణులు. వారు ఐదుగు ఐదు దిక్కులనుంది అశోకవనములొ ఉన్న హనుమను చుట్టు ముట్టుతారు. వారి ఒకరైన దుర్ధరుడు కొన్ని హనుమ లలాటములోకి ఇనుప బాణాలు కొడతాడు. దానితో కోపించిన హనుమ ఒక్కసారిగా ఆకాశానికి ఎగిపోయి శరీరాన్ని పెంచి దుర్ధరుడు ఉన్న రథం పై పడతాడు. అలా హనుమ ఆ సేనాగ్రనాయకుడి పై పడటంతో సేనాగ్రనాయకుడి రథం మడిసి పోతుంది, దుర్ధరుడు శరీరం పచ్చడిగా అయిపోయి హనుమ ఉదరానికి అంటుకొంటుంది. ఆ తరువాత మిగతా సేనాగ్రనాయకును ఒక సాల వృక్ష్ము పెకిలించి సాలవృక్షాన్ని గిరగిర త్రిప్పి వారి మీదకు విసిరితే వారి శరీరము కొత నేలకు మరికొత శరీరము చెట్టుకు అంటుకొంటుంది.

అక్ష కుమారుని యుద్ధము[మార్చు]

జంబుమాలిని, 7 మంత్రులను, 5 సేనాగ్రనాయకులను హనుమ చంపడంతో రావణాసురుడు క్రోధితుడై, ఈ వానరవీరుడిని పట్టుకోవడనికి ఎవరిని పంపాలి అని ఆలోచిస్తూ తన కుమారుడైన అక్షకుమారుడిని చూడడంతో అక్షకుమారుడు తండ్రికి నమస్కరిస్తాడు. వేంటనే తన రథంతో యుద్ధానికి బయలు దేరుతాడు. ఆవిధంగా బయలు దేరిన అక్షకుమారుడు ఒక ప్రజ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉంటాడు. హనుమ అక్ష కుమారుడిని చూసి ముచ్చట పడి వాడి యుద్ధాన్ని వీక్షించడానికి ఉపేక్షిస్తాడు. హనుమ ఉపేక్షణ చేయడం చూసి అక్షకుమారుడు క్రోధించి వానర వీరుడి పై మూడు బాణాలు కొడతాడు. హనుమ అఖ్సకుమారుడిని చూసి చిన్న పిల్లవాడని భావించి వాడి యుధ్దాన్ని ఇంకా వీక్షిస్తుంటాడు.ఆ విధం ఉపేక్షించడం చూసి అక్షకుమారుడు హనుమ పైకి శరవర్షం కురిపిస్తాడు. అది గాంచిన హనుమ సూక్ష్మరూపము ధరించి బాణాలు తగలకుండా ఇటు అటు తిరుగుతాడు. తనబాణాలు ఏవి హనుమను చేరక పోవడం చూసి అక్షకుమారుడు వేలాది బాణాలతో అకాశాన్ని కప్పేస్తాడు.అప్పుడు హనుమ తనలొ ఇక ఉపేక్షించి లాభం లేదు దేవతలు కుడా వీడి యుద్ధాన్ని చూసి సంతోషిస్తారు కాని అగ్ని హోత్రాన్ని ఇంటిలో ఉంచుకోవలేము కదా అని భావించి ఆకాశాంలొకి ఎగిరి శరీరాన్ని బాగా పెంచి అక్షకుమారుడి రథం పై పడతాడు.

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]