Jump to content

ఇంద్రజిత్తు

వికీపీడియా నుండి
మేఘనాదుని విజయం.
రాజా రవివర్మ గీసిన చిత్రం.

ఇంద్రజిత్తు (సంస్కృతం: इन्‍द्र जीत) రావణాసురుడికి మండోదరికి జన్మించిన కుమారుడు. ఇంద్రజిత్తు జన్మించినప్పుడు అరచిన అరుపు మేఘం ఉరిమిన పిడుగు శబ్దం వలే ఉండడం వల్ల వీనికి మేఘనాదుడు అని నామకరణం చేశారు. స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని జయించినందున ఇంద్రజిత్తు అయ్యాడు. ఈ సందర్భంగా పరమేష్ఠి అనుగ్రహం వల్ల బ్రహ్మాస్త్రాన్ని సంపాదిస్తాడు. యుద్ధ సంగ్రామంలో అకాశంలోకి వెళ్ళి మేఘాలలో యుద్ధాలు చెయ్యగలగడం ఇంద్రజిత్తు గొప్పతనం. ఇంద్రజిత్తు యొక్క సంగ్రామ చాతుర్యాన్ని వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండలో వర్ణిస్తారు.

రామ రావణుల మధ్య జరిగిన మహాయుద్ధములో ఇంద్రజిత్తు చురుకైన పాత్రను పోషించాడు. ఇంద్రజిత్తు ఆ యుద్ధములో రామలక్ష్మణులను నాగపాశముతో బంధించాడు. అయితే గరుడుడు వారిని నాగాపాశమునుండి విడిపించాడు. ఇంద్రజిత్తు ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు యజ్ఞము చేసి వెళ్లేవాడు. ఆ యజ్ఞమహిమ వలన ఈయనను యుద్ధంలో ఓడించటం ఎవరివల్లా సాధ్యంకాదు. ఆ యజ్ఞాన్ని భంగం చేయటమే ఈయనను చంపటానికి ఏకైక మార్గమని గ్రహించిన లక్ష్మణుడు యజ్ఞానికి ఆటంకం కల్పించి ఇంద్రజిత్తు ధ్యానంలో ఉండగా చంపాడు.

ఇంద్రజిత్తు ఆదిశేషుని కుమార్తె అయిన సులోచన (ప్రమీల) ను వివాహమాడినాడు. కొందరు ఆదిశేషుడు లక్షణ అంశ అని భావిస్తారు. ఈ విధముగా ఇంద్రజిత్తు లక్ష్మణుని అల్లుడని చెప్పవచ్చు. ప్రమీల నాగకన్య.

ఇంద్రజిత్తు మరణం


వీటిని కూడా చూడండి

[మార్చు]

మేఘనాథ వధ కావ్యం