మేఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మబ్బులు లేదా మేఘాలు (Clouds) భూమిపై వర్షాలకు మూలం.

మేఘాల్లో రకాలు

[మార్చు]
మేఘాలు
Cloud classification by altitude of occurrence

క్యుములోనింబస్‌ మేఘాలకు మేఘరాజు అనే పేరు కూడా ఉంది. భూమి మీద ఏటా 44 వేల క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడతాయని అంచనా. భారీ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ ఎక్కువగా చేరడం, వాతావరణంలో అస్థిరత వంటి పరిస్థితుల్లో ఏర్పడతాయి. బొగ్గు, గ్రానైట్‌, కొండలు వంటివి ఉన్న ప్రాంతాల్లో ఇవి చాలా ఎత్తుకి ఎదుగుతాయి. రుతుపవనాల సమయంలో ఏర్పడే మేఘాలు భూ ఉపరితలం నుంచి 3-4 కి.మీ. ఎత్తు వరకు మాత్రమే వెళతాయి. కానీ క్యుములోనింబస్‌ మేఘాలు మాత్రం 12-15 కి.మీ. ఎత్తు వరకు వెళ్తాయి. విస్తీర్ణం 10-25 చ.కి.మీ. వరకు ఉంటుంది. భూమిపై ఐదున్నర కిలోమీటర్లు దాటిన తర్వాత వాతావరణం మైనస్‌ డిగ్రీల్లోకి మారుతుంది. దాంతో క్యుములోనింబస్‌ మేఘాల్లోని నీటి బిందువులు మంచు స్ఫటికాలుగా ఘనీభవిస్తాయి. ఇవే వడగళ్లుగా కురుస్తాయి.

క్లౌడ్స్ (సి. 1920ఎస్), యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నిర్మించిన క్లౌడ్స్ గురించి నిశ్శబ్ద డాక్యుమెంటరీ ఫిల్మ్.

క్యుములోనింబస్‌ మేఘాలు రెండు మూడు గంటల వ్యవధిలో ఏర్పడి గంటా గంటన్నరసేపు భీకర వర్షాన్ని కురిపించి వెళ్లిపోతాయి. ఈ కొద్ది వ్యవధిలోనే భారీ నష్టం జరుగుతుంది. సాధారణ మేఘాల్లో గాలుల తీవ్రత సెకనుకి సెంటీ మీటర్ల స్థాయిలో ఉంటే వీటిలో మాత్రం సెకనుకి 15-20 మీటర్ల వేగంతో విజృంభిస్తాయి. అందుకే ఈ మేఘాలు ఏర్పడినప్పుడు గంటకు 50 కి.మీ.కు మించిన వేగంతో పెనుగాలులు వీచి చెట్లు కూలిపోవడం వంటివి జరుగుతాయి. క్యుములోనింబస్‌ మేఘాల్లో పుట్టే రుణ, ధనావేశాల కణాల సమూహాల వల్ల మెరుపులు, ఉరుములు ఏర్పడి పిడుగులూ పడతాయి. గంటన్నర వ్యవధిలో గరిష్ఠంగా 25-30 సెం.మీ. వర్షం కురుస్తుంది.వీటిని ఈశాన్య భారతంలో 'కాలబైశాఖి' 'నార్వెస్టర్స్‌' అంటారు.

చిత్రమాలిక

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మేఘం&oldid=4304137" నుండి వెలికితీశారు