Jump to content

వానరులు

వికీపీడియా నుండి
సీత గురించి వానరులకు చెబుతున్న సంపాతి

వానరులంటే కోతి ఆకృతిని పోలిన మనుషులు. వానరము అను పదము సంస్కృతములో గల 'వనె చరె ఇతి వానర' నుండి ఉధ్బవించింది.

రామాయణంలో

[మార్చు]

రామాయణ పురణములో బ్రహ్మ ఆజ్ఞ మేర దేవతలు వానరులను శ్రుష్టించారని ఉంది. రామాయణంలో వీటి పాత్ర ఎంతో ఉంది. రామాయణ కాలం నాటి వానరులలో వాలి, సుగ్రీవుడు ముఖ్యమైన వానర రాజులు. వానర సైన్యంలో శ్రేష్ఠుడు ఆంజనేయస్వామి. అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం చేసి, సుగ్రీవుని సోదరుడు, శత్రువు అయిన వాలిని సంహరించి, ఆ రాజ్యానికి సుగ్రీవునికి పట్టాభిషేకం చేస్తాడు. అందుకు కృతజ్ఞతగా సుగ్రీవుడు తన వానర సైన్యం ద్వారా సీతాదేవి ఆచూకీ తెలుసుకొని, ఆపై రావణాసురునితో యుద్ధానికి శ్రీరామునికి అండగా వానర సైన్యాన్ని పంపిస్తాడు. ఆ విధంగా రామాయణంలో వానరులు అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=వానరులు&oldid=3483577" నుండి వెలికితీశారు