మాండవి
స్వరూపం
మాండవి | |
---|---|
తోబుట్టువులు | శ్రుతకీర్తి (సోదరి) సీత, ఊర్మిళ (బంధువులు) |
పిల్లలు | తక్ష, పుష్కల |
తండ్రి | కుశధ్వజ |
తల్లి | చంద్రభాగ |
మాండవి కుశధ్వజుని కుమార్తె. శ్రీరాముని తమ్ముడు భరతుని భార్య.[1]
హిందూ ఇతిహాసం ప్రకారం రామాయణంలో, కుశధ్వజ మహారాజు, చంద్రభాగల కుమార్తె మాండవి. కుశధ్వజ మహారాజు జనక మాహారాజుకు సోదరుడు. అతని సోదరుని కుమార్తె సీత రామాయణంలో ప్రధాన పాత్ర. ఆమె శ్రీరాముని వివాహం చేసుకుంది. ఆ సమయంలో శ్రీరాముని సోదరులైన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు లకు కూడా వివాహాలు జరిగాయి. ఆ సందర్భంలో మాండవి భరతుడిని వివాహమాడింది.
అప్పటి కుశధ్వాజ ఆస్థానం రాజ్‌బీరాజ్ ప్రాంతం చుట్టూ ఉండవచ్చు. ఈ ప్రాంతంలో మాండవి జన్మించి ఉండవచ్చు. వారి కుటుంబ ఆలయం చారిత్రక అవశేషాలు రాజ్‌దేవి ఆలయం చుట్టూ ఉన్నాయి. వారికి తక్ష, పుష్కల అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమెకు ఒక చెల్లెలు శ్రుతకీర్తి ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Mandavi: "I Am Bharata's Wife And The Loneliest Woman In The Kingdom"". Bonobology.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-04-10. Retrieved 2020-05-24.