సుబాహుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుబాహుడు
Rama killed Subhahu, smote Maricha and hurled him afar off into the ocean.jpg
రాముడు సుభాహుని చంపి, మారీచుడిని కొట్టి, దూరంగా సముద్రంలో పడవేసే దృశ్యం
సమాచారం
కుటుంబంతాటకి (తల్లి), మారీచుడు (సోదరుడు), కైకసి (సోదరి, రావణుడి భార్య)

సుబాహుడు, రామాయణంలో ఒక రాక్షస పాత్ర. ఇతడు రాక్షస రాజైన సుందుడు - తాటకి దంపతుల కుమారుడు.

కథ[మార్చు]

సుబాహుడు, మారీచుడు, వారి తల్లి అయిన తాటకి మొదలైన రాక్షసులు అడవులలో తపస్సులు చేసుకుంటున్న మునులను (విశ్వామిత్రుని), వారి యజ్ఞాలను రక్తమాంసపు వర్షాలతో భంగపరచి వేధించేవారు.[1] ఈ రాక్షసుల ఆగడాలను ఆపడానికి విశ్వామిత్రుడు వెళ్ళి, దశరథుడిని సహాయాన్ని కోరాడు. అప్పుడు దశరథుడు తన ఇద్దరు కుమారులైన రాముడు, లక్ష్మణులను విశ్వామిత్రునితో అడవికి పంపించి మునులను, వారి యజ్ఞాలను రక్షించమని ఆజ్ఞాపించాడు.[2] సుబాహుడు, మారీచ రాక్షసులు వచ్చి మళ్ళీ యజ్ఞాలపై మాంసాన్ని, రక్తాన్ని వేయడానికి వచ్చినపుడు శ్రీరాముడు తన బాణంతో సుబాహుని చంపాడు.[3] అది చూసీన మారీచుడు లంకకు పారిపోయి, అక్కడ ఒక ఋషిగా తన జీవితాన్ని కొనసాగించాడు.

మూలాలు[మార్చు]

  1. Gita Jnana Brahmacharini Sharanya Chaitanya (1 July 2018). "Rama Brings Ahalya Back to Her Living Form". The New Indian Express. Retrieved 2022-10-21.
  2. Shashtri, Hari Prasad (21 September 2020). "Dasaratha acquiesces [Chapter 21]". Wisdom Library - Valmiki Ramayana - Bala Kanda (in ఇంగ్లీష్). Wisdom Library. Retrieved 2022-10-21.
  3. "Subahu - Asura Slain by Rama". Indian Mythology. Retrieved 2022-10-21.
"https://te.wikipedia.org/w/index.php?title=సుబాహుడు&oldid=3702884" నుండి వెలికితీశారు