Jump to content

కైకసి

వికీపీడియా నుండి

కైకసి రామాయణంలో సుమాలి, కేతుమతికుమార్తె. ఈమె సోదరులు మారీచుడు, సుబాహుడు. విశ్రవసుని భార్య. ఆమె రావణ, కుంభకర్ణులూ, విభీషణ, శూర్పణఖలకు తల్లి.[1]

ఒక రోజు కైకసి తన తండ్రి రథంమీద వెళుతూ విశ్రవసుని చూసింది. తండ్రి సుమాలికి కూడా అతనికి తన కూతుర్ని యివ్వాలని పించింది. అందుకే విశ్రవసుని ఆశ్రమంలో కైకసిని విడిచి పెట్టాడు. కైకసి కూడా విశ్రవసునికి ఎన్నో సేవలుచేసింది. గమనించిన విశ్రవసుడు “ఎవరునువ్వు” అని అడిగాడు. కైకసి తన గురించి చెప్పడమే కాదు, తన మనసులోని కోరికనూ అతని ముందుంచింది. వాంఛను బయట పెట్టేలా ప్రవర్తించింది. సంధ్యవేళలో కోరావు కాబట్టి నీకు పుట్టిన వాళ్ళు రాక్షసులవుతారని చెప్పాడు. చెప్పిన విధంగానే ఆమె సంతానం రాక్షసులయ్యారు. అయితే తనకు పుట్టిన వాళ్ళందరూ దుర్మార్గులు కావలసిందేనా అని దుఃఖ పడింది కైకసి. అందరిలోకి చిన్నవాడు మంచి గుణవంతుడవుతాడని చెప్పి విశ్రవసుడు ఆమెకు ఊరట నిచ్చాడు. అతడే విభీషణుడు.[2]

విచిత్ర రామాయణం కథ ప్రకారమయితే – పుత్రుల్ని కోరిన కైకసితో విశ్రవసువు రుతువుకొక పుత్రుణ్ని యిస్తానన్నాడట. అప్పటికామె పదకొండు రుతువులయ్యానని చెపుతుందట. అంతమందిని కనక్కర్లేదనీ అంటుందట. దాంతో పది తలల పుత్రుడు రావణుడూ ఒక పుత్రిక శుర్పణఖా పుట్టిందట.

పురాణ కథనంప్రకారం లంకానగరంలో ఉన్న రావణాసురుడి తల్లి ‘కైకసి’ నిత్యం సముద్రపు ఒడ్డున ఇసుకమట్టితో శివలింగాన్ని చేసి పూజిస్తూ ఉండేది. ఇలా మట్టితో చేసిన శివలింగాన్ని “పార్థివలింగం” అంటారు. ఇటువంటి పార్థివలింగం పూజ అన్నింటికన్నా మిన్న అయినది. ఒక రోజు కైకసి ఎన్ని సార్లు పార్థివలింగాన్ని చేసినా సముద్రపు అలలు వాటిని నాశనం చేయసాగాయి. ఆరోజు పార్థివలింగాభిషేకం చేయకపోవడం వల్ల కైకసి కన్నీటి పర్యంతమవుతుంది. పార్థివలింగాభిషేకం తంతులో కన్నీరు పెట్టిన రావణాసురుడి తల్లి కైకసి నిత్యం పూజించుకోవడం కోసం రావణాసురుడు “పార్థివలింగం ఏమిటి నీకు శివుని ఆత్మలింగమే తెచ్చి ఇస్తానని” తన తల్లితో చెప్పి కైలాసానికి వెళతాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Kaikasi". rsvidyapeetha.ac.in. Retrieved 2020-04-15.[permanent dead link]
  2. Hari, Sri (2019-03-02). Ravana (in ఇంగ్లీష్). Bharatha Samskruthi Prakashana. ISBN 978-93-89020-74-8.
  3. "గోకర్ణేశ్వరుడనే ఆత్మ లింగము :". 9StaarTV (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-03-07. Retrieved 2020-04-15.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=కైకసి&oldid=3906245" నుండి వెలికితీశారు