గురువాయూరు శ్రీకృష్ణ మందిరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ ఆలయం కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లాలో ఉన్నది. ఈ ఆలయానికి ప్రతి రోజు సగటున ముప్పైవేల మంది భక్తులు వస్తుంటారు. పర్వ దినాలలో ఈ భక్తుల సంఖ్య లక్షకు పైగా ఉంటుంది. ఈ స్వామి వారి ఉదయాస్తమాన పూజలలో పాల్గొనాలంటే యాబై వేల రూపాయలు చెల్లించాలి. ఆ టికెట్లు రాబోవు నలబై ఏండ్ల వరకు అయిపోయాయి. ఈ ఆలయ వార్షికాదాయం రెండున్నర కోట్ల రూపాయలు. ఈ దేవుని ఆస్తుల విలువ రెండు వందల యాబై కోట్ల రూపాయలు. బీమా పథకం క్రింద ఏడాదికి యాబై లక్షలు చెల్లిస్తున్నారు. ఆలయ సంపదతో బాటు అక్కడ పనిచేసే ఉద్యోగులకు, దేవుని నగలకు, గుడిలోని 63 ఏనుగులకు, ఆవులకు, ఈ బీమా వర్తిసుంది. కృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు. శ్రీకృష్ణ దేవుడిని 'గురువాయూరప్పన్' అని భక్తిభావంతో పిలుస్తారు. దక్షిణ భారతంలో 'అప్ప' అనగా తండ్రి అనీ ప్రభువు, దేవుడు అనీ అర్థాలున్నాయి. గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం. దక్షిణ ద్వారకగా పిలువబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలువబడుతున్నాడు.