Jump to content

పాలక్కాడ్ జిల్లా

వికీపీడియా నుండి
Palakkad district
പാലക്കാട്
district
Paddy fields in Palakkad
Paddy fields in Palakkad
Country India
రాష్ట్రంకేరళ
ప్రధాన కార్యాలయంPalakkad
Government
 • CollectorK.Ramachandran
జనాభా
 (2011)
 • Total28,10,892[1]
 • జనసాంద్రత627/కి.మీ2 (1,620/చ. మై.)
భాషలు
 • అధికారMalayalam,ఆంగ్లం
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-KL-PKD
Literacy88.49%[1]

పాలక్కాడ్ జిల్లా, (మలయాళం:പാലക്കാട് ജില്ല) భారతదేశం కేరళ రాష్ట్రంలోని జిల్లా. [2]పాలక్కాడు జిల్లా మలప్పురం జిల్లాకు నైరుతీ దిశలో ఉంది. త్రిసూర్ జిల్లాకు ఆగ్నేయ సరిహద్దులో ఉంది. కోయంబత్తూరు జిల్లాకు తూర్పు సరిహద్దులో ఉంది. జిల్లా 13.62% నగరీకణ చేయబడి ఉంది.[3] జిల్లాకు కేరళ ధాన్యాగారం, రైస్ బౌల్ ఆఫ్ కేరళ అనే పేర్లు ఉన్నాయి.[4] ఇది 1 జనవరి 1957న పూర్వ మలబార్ జిల్లా ఆగ్నేయ ప్రాంతం నుండి విభజించుట ద్వారా ఏర్పడింది. ఇది కేరళ మధ్యలో ఉంది. 2006 నుండి రాష్ట్రంలో ఇది అతిపెద్ద జిల్లా. పాలక్కాడ్ నగరం జిల్లా కేంద్రంగా ఉంది. ఈ జిల్లాకు "ది గ్రేనరీ ఆఫ్ కేరళ" అని పేరు. పశ్చిమ కనుమలలో పాలక్కాడ్ గ్యాప్ ఉన్నందున పాలక్కాడ్ కేరళకు ప్రవేశ ద్వారం. పాలక్కాడ్ జిల్లా, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్‌లో నీలగిరి జిల్లా, మలప్పురం జిల్లా సరిహద్దులో ఉన్న 2,383 మీటర్ల ఎత్తైన అంగిండా శిఖరం పాలక్కాడ్ జిల్లాలో ఎత్తైన ప్రదేశం. పాలక్కాడ్ నగరం తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన నగరమైన కోయంబత్తూర్ నుండి కేవలం 50 కి.మీ దూరంలో ఉంది. దీనిని పురాతన కాలంలో పాలకాట్టుచేరి అని పిలువబడింది.[5]

భౌగోళికం

[మార్చు]
Nelliampathi mountains as seen from Nemmara village

పాలక్కాడ్ వాయువ్య సరిహద్దులో మలప్పురం జిల్లా, నైరుతి సరిహద్దులో త్రిసూర్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో నీలగిరి జిల్లా, తూర్పున తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా ఉన్నాయి. పాలక్కాడు జిల్లాలో గ్రామీణ ప్రాంతం అధికంగా ఉంది. పశ్చిమ కనుమలో ఉన్న పాలక్కాడు గ్యాప్ వాహన రాకపోకలకు అనుకూలంగా ఉన్నందున ఇది కేరళ ద్వారంగా భావించబడుతుంది. జిల్లా వైశాల్యం 4480 చ.కి.మీ. జిల్లా వైశాల్యంలో (4480చ.కి.మీ) ఇది 1360 చ.కి.మీ అరణ్యప్రాంతం ఉంది.

సరిహద్దులు

[మార్చు]
సరిహద్దు వివరణ జిల్లా
మిడ్‌లాండ్ 75-250 చ.కి.మీ
తూర్పు సరిహద్దు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా
దక్షిణ సరిహద్దు చిత్తూరు జిల్లాలోని నల్లియంపతి - పరంబికుళం తాలూకాలు
ఉత్తర సరిహద్దు అట్టపాడి - మాలంబుళా (250 మీ)
ఎత్తైన శిఖరాలు అంగిండ (2325మీ), కరిమల (1998మీ), నెల్లికోట లేక పదగిరి (1585మీ), కరిమల గోపురం (1439).

వాతావరణం

[మార్చు]
విషయ వివరణ నదులు వివరణ
వాతావరణ విధానం రాష్ట్రంలో అత్యుష్ణ ప్రాంతం
వేసవి
వర్షపాతం చాలినంత
ప్రధాననది భారత్‌పుళా
ఆనకట్ట మాలంబుళా, పరంబికుళం [6]

నిర్వహణ

[మార్చు]

తాలూకాలు

[మార్చు]

ఈ జిల్లా 5 తాలూకాలుగా విభజింపబడింది.[7]

తాలూకా జనాభా (2001 అంచనా.)
ఆలత్తూరు 421909
చిత్తూరు 425575
మన్నార్కాడు 355680
ఓట్టపాలెం 842286
పాలక్కాడ్ 571622 పట్టామ్బి
మొత్తం 2617072

పాలక్కాడ్ జిల్లాలోని పూరపాలకాలు

[మార్చు]
  • 2001 గణాంకాలను అనుసరించిజిల్లాలోని జనసంఖ్యతో తాలూకాల,[7] వివరణ.
  • పాలక్కాడ్ (పాప్. 160736)
  • షొర్నూర్ (పాప్. 42022)
  • చిత్తూరు- తట్టామంగళం (. పాప్ 31884)
  • ఓట్టపాలెం (పాప్. 49230)

పాలక్కాడ్ జిల్లాలో కేరళ అసెంబ్లీ సీట్లు

[మార్చు]
శాసన నియోజకవర్గం శాసన సభ్యులు పార్టీ ప్రాతినిధ్యం ఫ్రంట్
పాలక్కాడ్ షఫీ పరంబిల్ ఐ.ఎన్సి యుడిఎఫ్
చిత్తూరు కే అచుతన్ ఐ.ఎన్.సి యుడిఎఫ్
నెన్మర వి.చ.ంథమరక్షన్ సిపిఐ (ఎం) ఎల్డిఎఫ్
తరుర్ ఎ.కె.బాలన్ సిపిఐ (ఎం) ఎల్డిఎఫ్
అన్నర్క్కద్ ఏన్, షంసుధీన్ ఎస్జెడి యుడిఎఫ్
మలంపూజ వి. ఎస్ అచ్యుతానందన్ సిపిఐ (ఎం) ఎల్డిఎఫ్
ఆలథుర్ ఎం. చంద్రన్ సిపిఐ (ఎం) ఎల్డిఎఫ్
త్రిథల వి.టి. బలరాం ఐ.ఎన్.సి. యుడిఎఫ్
ఓత్తపలం ఎం.హంజా సిపిఐ (ఎం) ఎల్డిఎఫ్
పట్టామ్బి పోలీస్ కమిషనర్లు మహమ్మద్ ఈణ్ఛ్ యుడిఎఫ్
కొంగద్ కె.వి.విజయదస్ సిపిఐ (ఎం) ఎల్డిఎఫ్
షోరనూర్ కె.ఎస్.సలీఖ సిపిఐ (ఎం) ఎల్డిఎఫ్

శ్రీక్రిష్నపురం, ఖుజ్హల్మన్నం, ఖొల్లెంగొదే (గ్రామ పంచాయతీ), నియోజకవర్గాలు తొలగించబడ్డాయి, ఖొంగద్, షోరనూర్, నెమ్మర, టరుర్ (గ్రామ పంచాయతీ), నియోజకవర్గాలు 12 పాలక్కాడ్ జిల్లా రావడంవల్ల మొత్తం సీట్లను సంఖ్య పెరుగుతుంది కేరళ శాసనసభకు కోసం డీలిమిటేషన్ ఫలితంగా, 2011 జనరల్ ఎన్నికల సమయంలో సృష్టించబడ్డాయి.

పార్లమెంటు సభ్యులు

[మార్చు]
  • పాలక్కాడ్ - ఎం.బి. రాజేష్ (సీపీఐఎం)
  • ఆలత్తూరు - పరయంపరంబిల్ కుట్టన్ బిజూ (సీపీఐఎం)

జిల్లా పంచాయితీ

[మార్చు]

అధికార వికేంద్రీకరణ కేరళ రాష్ట్రంలో కూడా అమలులో ఉంది. జిల్లా పంచాయితీ ప్రధానకార్యాలయం పాలక్కాడు పురపాలకంలో ఉంది. జిల్లా పంచాయితీ కార్యాలయం సివిల్ స్టేషను సమీపంలో ఉంది.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో పాలక్కాడు జిల్లా ఒకటి అని గుర్తించింది.[8] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న కేరళ రాష్ట్ర 2 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[8]

పరిశ్రమలు

[మార్చు]

జిల్లాలో వివిధ పరిశ్రమలు ఉన్నాయి. కంజైకోడ్ వద్ద ది పబ్లిక్ సెక్టర్ కంపెనీలు,[9] ఇష్ట్రుమెంటేషన్ ప్లాంటులు ఉనాయి. ఇతర సంస్థలలో బి.పి.ఎల్ గ్రూప్, కోకో కోలా, పెర్సి కంపెనీలు ఉన్నాయి. కంజికోడ్ వద్ద పారిశ్రామిక ప్రాంతం పలు మద్యతరహా పరిశ్రమలు ఉన్నాయి.

వ్యవసాయం

[మార్చు]

పాలక్కాడు జిల్లా కేరళ రాష్ట్రంలోని అధికంగా వ్యవసాయ అనుకూల జిల్లాలలో ఒకటి. జిల్లాలో వరి పంట 83,998 హెక్టార్ల వైశాల్యంలో పండించబడుతుంది. వరి పంట ఉత్పత్తిలో జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉంది. వేరుశనగ, చింతపండు, పసుపు, కర్రపెడెలం, కూరగాయలు, పప్పుధాన్యాలు, మామిడి, అరటి, కూర అరటికాయలు, పత్తి, రబ్బర్, కొబ్బరి, పోక, నల్లమిరియాలు మొదలైన పంటలు కూడా కేరళ రాష్ట్రంలో విస్తారంగా పండించబడుతున్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,810,892,[1]
ఇది దాదాపు. జమైకా దేశ జనసంఖ్యకు సమానం.[10]
అమెరికాలోని. ఉటాహ్ నగర జనసంఖ్యకు సమం..[11]
640 భారతదేశ జిల్లాలలో. 138వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 627 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 7.39%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 1067:1000 [1]
జాతీయ సరాసరి (928) కంటే. ఎక్కువ
అక్షరాస్యత శాతం. 88.49%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
భాష 75% మలయాళం, 25% తమిళం .[12]

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

లిటరరీ వ్యక్తులు

[మార్చు]
  • కుంజన్ నంబియార్
  • ఒ.వి విజయన్
  • ఒలప్పమన్న
  • కుట్టికృష్ణ మరర్
  • వల్లతోల్ నారాయణ మీనన్ (పొన్నాని, ఓల్డ్ పాలక్కాడ్ జిల్లా)
  • ఒ.ఎం. సి నారాయణన్ నందూద్రిపాద్
  • ఎం.టి.వాసుదేవన్ నాయర్
  • అక్కిథాం అచుతన్ నంబూథిరి.
  • అనిత నాయర్
  • ముందూర్ కృష్ణన్ కుట్టి

కళ, డ్యాన్స్, డ్రామా, సంగీతం , చిత్ర వ్యక్తుల

[మార్చు]
  • వి.టి భట్టాచార్య (నాటకం)
  • చెంబై వైద్యనాథ భాగవతార్ (కర్నాటిక్)
  • కీళప్పడం కుమరన్ నాయర్ (కథాకళి)
  • పల్లవూర్ ట్రినిటీ (వధ్య కళ)
  • పాల్ఘాట్ మణి అయ్యర్ (మృదంగం )
  • నిజరలతు రామ పోడువాల్ (సొపన సంగీతం)
  • ఎం.జి రామచంద్రన్ (సినిమా-తమిళం)
  • ఉన్ని మీనన్ (నేపథ్య గాయకుడు)
  • ఎకే లోహితాదాస్ (ప్రముఖ కథా, దర్శకుడు)
  • ఆర్టిస్ట్ నంబూథిరి (పెయింటర్)
  • లాల్ జోస్ (దర్శకుడు)
  • తిరూర్ నంబిస్సన్ (కథాకళి సంగీతం)
  • చెర్పులసేరి శివన్ (మద్దళం కళాకారుడు)
  • కొంగాడ్ విజయన్ (తిమిల కళాకారుడు)
  • పల్లావూర్ అప్పు మారర్ (మేళా ప్రమని )
  • కుట్టి (కార్టూనిస్ట్) (కార్టూనిస్ట్)
  • విద్యా బాలన్ (నటి)
  • త్రిష కృష్ణన్ (నటి)
  • ప్రియమణి (నటి)
  • శంకర్ మహదేవన్ (నేపథ్య గాయకుడు)
  • మధుపాల్ (నటుడు)
  • ఒడువిల్ ఉన్నికృష్ణన్ (నటుడు)
  • రఘువరన్ (నటుడు)
  • స్టీఫెన్ దెవస్సీ
  • మేజర్ రవి (దర్శకుడు)
  • గౌతం వాసుదేవ్ మీనన్ (దర్శకుడు)
  • పి ఉన్నికృష్ణన్ (నేపథ్య గాయకుడు)
  • స్వర్ణలత (నేపథ్య గాయకుడు)
  • రామన్ కుట్టి నాయర్
  • ఎం. ఎస్ విశ్వనాథన్ (సంగీత దర్శకుడు)

సామాజిక, రాజకీయ , పరిపాలనా వ్యక్తులు

[మార్చు]
  • కె.పి కేశవ మీనన్ (ఆదర్శవాది, మాతృభూమి యొక్క ఫౌండర్)
  • కె.పి.ఎస్ మీనన్ (ఇంటర్నేషనల్ డిప్లొమాట్)
  • శివశంకర్ మీనన్ (ఇంటర్నేషనల్ డిప్లొమాట్)
  • టి. ఎన్. శేషన్ (మాజీ చీఫ్ ఎన్నికలు కమిషనర్)
  • శశి థరూర్ (అండర్ సెక్రటరీ జనరల్, యు.ఎన్)
  • ప్రకాష్ కారత్ (సిపిఎం ప్రధాన కార్యదర్శి)
  • ఇ శ్రీధరన్ (ప్రసిద్ధ ఇంజనీర్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్)
  • ఎం.కె నారాయణన్ (భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్)
  • వి.పి మీనన్ (సీనియర్ అతి బ్రిటిష్ భారతదేశం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్)
  • కుంహిరామన్ పలాత్ కాండెత్ (భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్)
  • కే శంకరనారాయణన్ (గవర్నర్ రాష్ట్ర)
  • చెత్తూర్ శంకరన్ నాయర్ (భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాత్రమే కేరళలోని)
  • మెళత్తూర్ విద్యామాడం నంబూథురి ( ఆర్యావైద్యన్)

భాషలు

[మార్చు]

జిల్లాలో ప్రధానంగా మలయాళం భాష వాడుకలో ఉంది. అలాగే ఆంగ్లం, హిందీ, తమిళం భాషలను అధికంగా అర్ధంచేసుకోవడం, మట్లాడడం వంటివి చేస్తున్నారు. అల్లన్ (ద్రావిడ భాష) భాషను 350 మంది ప్రజలలో వాడుకలో ఉంది.[13], అరేబియన్ భాష మరొక ద్రావిడ భాష కూడా 200 మంది ప్రజలలో వాడుకలో ఉంది.[14]

ప్రయాణసౌకర్యాలు

[మార్చు]

రైలు మార్గాలు

[మార్చు]

దక్షిణ భారతీయ రైల్వే స్టేషను‌లో పాలక్కాడు కూడలి ప్రధానమైనది. పొల్లాచి, దిండిగల్, మదురై మార్గం మీటర్ గేజి రైలుమార్గంతో అనుసంధానమై ఉంటుంది. మీటర్ గేజి రైలుమార్గం ప్రజల జీవనోపాధికి ఎంతగానో సహకరించింది. ఈ మార్గం ద్వారా ప్రజలకు కూరగాయలు, చేపలు, పాలత్పత్తులు చేరవేయబడుతున్నాయి. పాలక్కాడు డివిషన్ ఆఫ్ ది సదరన్ రైల్వే పాల్ఘాట్ రైల్వే కూడలి వద్ద ఉంది. తమిళనాడు నుండి వచ్చే రైళ్ళు షొరనూర్ కూడలి నుండి ఉత్తర, కేరళకు దారి మళ్ళించబడుతుంటాయి. ఇక్కడి నుండి కోళికోడ్, ఎర్నాకుళం, తిరువనంతపురం, షొరనూర్, నిలంబూర్‌లకు రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. షొరనూర్ కూడలి నుండి మంగళూరుతో అనుసంధానించబడి అక్కడి నుండి కొంకణి రైలు మార్గం ద్వారా గోవా, ముబయి చేరుకోవచ్చు.

రహదారులు

[మార్చు]

పాలక్కాడులో మాధ్యమిక రహదారి సౌకర్యాలు ఉన్నాయి. జిల్లాను సేలం, కన్యాకుమారిలను కలుపుతున్న జాతీయరహదారి 47, పాలక్కాడ్- కోళికోడ్, జాతీయ రహదారి 213 లు జిల్లా గుండా పయనిస్తున్నాయి. మరొక ప్రధాన రహదారిగా పాలక్కాడు - పొన్నేరి రహదారి జాతీయరహదారి 17, జాతీయరహదారి 47 లను అనుసంధానిస్తుంది.

వాయుమార్గం

[మార్చు]

జిల్లా కేంద్రానికి 60 కి.మీ దూరంలో " కోయంబత్తూర్ విమానాశ్రయం " ఉంది. ఇది భారతదేశంలోని ఇతర ప్రధాన పట్టణాలకు ప్రయాణవసతి కల్పిస్తుంది. కింగ్‌ఫిషర్ ( అక్టోబరు 2012 సస్పెక్ట్ చేయబడి ఉంది), గోఎయిర్, పారామౌంట్ ఎయిర్వేస్, ఎయిర్ అరేబియా, ఎయిర్ ఇండియా సర్వీసులు లభ్యం ఔతున్నాయి.

హాస్పిటల్స్

[మార్చు]
  • ఓట్టపాలెం నేత్ర పరిరక్షణ హాస్పిటల్[15]
  • తంగం హాస్పిటల్ [16]
  • అహలియ ఐ హాస్పిటల్ [17]
  • లక్ష్మీ హాస్పిటల్ [18]

పండుగలు

[మార్చు]
  • కులపుల్లరి శ్రీకృష్ణ ఆలయం - కులపుల్ల్య్ సంగీతం ఫెస్టివల్ ఏప్రిల్ / మే
  • నెన్మర వల్లంఘ్య్ వేల
  • కల్పతి రథొల్సవం
  • చినక్కతూర్ ఆలయం ( పూరం)
  • మనప్పుల్లికవు వెల
  • పదుర్ శ్రీ అయ్యప్పన్ ఆలయం (పనిచ్క్నరప్పన్), ఫిబ్రవరి నెలలో ప్రతి సంవత్సరంలో పదుర్ వద్ద వెల.
  • తత్తమంగలం కుతిర వెల
  • కన్న్యర్ కాళిలో వదవన్నుర్, చొయల్మన్నం, పుతుచొదె, కట్టుచెరి
  • తత్తమంగలం, అయ్యప్పన్ ఫెస్టివల్ వెస్ట్ విలేజ్ వద్ద
  • మన్నర్క్కద్ (పూరం)
  • పత్తంచేరి కుమ్మంచేరి, కరివెల, పవకూటి, కూటాభిషెకం
  • కొదుంథిరపుల్ల్య్ మహానవమి
  • కన్న్యర్ కాళి & కుమ్మట్టి కునిస్సెరి

నవరాత్రి

[మార్చు]

నవరాత్రి ఉత్సవాలు భారతదేశం అంతటా వివిధ విధానాలుగా, సంప్రదాయాలుగా కోలాహలంగా నిర్వహించబడుతుంటూంది. పాలక్కాడు జిల్లాలోని కొడుంతిరపుళ్ళి అగ్రహారంలో నవరాత్రి ఉత్సవాలు వారి ప్రత్యేక పద్ధతిలో నిర్వహిస్తారు. అగ్రహారం 3 చ.కి.మీ విస్తీర్ణంలో ఉత్తర దక్షిణాలుగా బారులు తీరిన గృహాలతో అందంగా ఉంటుంది. వీరు వైష్ణవ జైమిని సమవేది తలవక్కర గురు పరంపరకు చెందినవారమని చెప్పుకుంటారు. అగ్రహారంలో 100 బ్రాహ్మణ గృహాలు చక్కని వీధులుగా ఉన్నాయి. అగ్రహారంలో బ్రాహ్మణులు మాత్రమే నివసిస్తుంటారు. అగ్రహారానికి వారి ప్రత్యేక బాణి జీవనసరళి ఉంటుంది. అగ్రహారం వారి పూర్వీక సంప్రదాయాలను చాలావరకు కాపాడుకుంటూ ఉంది. అగ్రహారానికి వేరెక్కడా చూడడానికి వీలుకాని ప్రత్యేకతలు ఉన్నా దూరప్రాంత పర్యాటకులను ఇవి అంతంగా ఆకర్షించడం లేదుకాని ఇక్కడ నిర్వహించే నవరాత్రి ఉత్సవాలు మాత్రం పలువురు భక్తులను ఆకర్షిస్తూ ఉన్నాయి. నరాత్రి ఉత్సవాలు ఆశ్వీజమాస అమావాస్య నుండి నవమి వరకు దేవి ఆరాధన జరుగుతూ ఉంటుంది.

బొమ్మల కొలువు

[మార్చు]

నవరాత్రి సమయంలో అగ్రహారంలో ప్రతి ఇంట బొమ్మల కూడా జరుపుకుంటారు. కొడుంతిరపల్లి బ్రాహ్మణ కుటుంబాలు బొమ్మలకొలువును ప్రత్యేకంగా జరుపుకుంటారు. అలాగే అచ్చమైన కేరళ విధానం, సంప్రదాయం అనుసరిస్తూ ఏనుగులు, ఊరేగింపులు, డ్రమ్స్, పంచవాయిద్యాలు, క్రాకర్లు కాల్చడం వంటి వినోదాలను ఉత్సాహంగా నిర్వహిస్తారు.అలాగే శ్రీరామాలయంలో కూడా పండుగ ఉత్సవాలు నిర్వహించబడతుంటాయి. శ్రీరాముడు రావణుని వధించడానికి ముందు దుర్గాదేవిని తొమ్మిదిరాత్రులు ఆరాధించాడని భక్తులు విశ్వసిస్తుంటారు. దశమినాడు శ్రీరాముడు రావణుని వధించాడని విశ్వసిస్తున్నారు. నవరాత్రి రోజులలో అగ్రహారంలో శ్రీరాముని దీవెనలు అందుకోవాలని అగ్రహారవాసులు భావిస్తున్నారు.

ఉత్సాహం

[మార్చు]

నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రమంతా ఉత్సాహంగా నిర్వహించబడుతున్నాయి. తొమ్మొది రోజులూ రోజుకొక విధంగా ఉత్సాహభరితంగా నిర్వహించబడుతుంది. ఇది కుటుంబం తిరిగి కలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. జివనోపాధి వెతుక్కుంటూ పలుప్రాంతాలకు వెళ్ళి నివసిస్తున్న ప్రజలు తమ స్వస్థలాలకు చేరుకుని బంధుమిత్రులలో కలిసి ఉత్సవాలను ఆనందంగా చూసి ఆనందిస్తుంటారు. 9 రోజుల ఉత్సవాలలో కుటుంబాలు 9 బృందాలుగా విభజించబడి ఒక్కొకరోజు ఒక్కొకరు పూర్తి బాధ్యత తీసుకుని ఉత్సవాలను నిర్వహిస్తారు. భక్తులకు అన్నదానంకూడా ఇందులో భాగంగా ఉంటుంది. ఒకరికంటే మరొకరు అధికంగా చేస్తూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. మహార్నవమి నాడు భక్తులు శ్రీదేవి భూదేవి సహిత ఆదికేశవపెతుమాళ్‌ను దర్శించుకుంటారు.

రాత్రి ఉత్సవాలు

[మార్చు]

తరువాత రోజు ఉత్సవాలు రోజంతా జరుగుతుంటాయి. ఉత్సవాలు తెల్లవారు ఝామువరకు కొనసాగుతుంటాయి. పలు అలంకరించబడిన 18 కంటే అధికమైన ఏనుగులు ఊరేగింపు పంచాయత సంప్రదాయంలో చండమేళం, నాదస్వరం వెంటరాగా ముందుకు సాగుతుంది. రాత్రి పగలు జరిగే ఊరేగింపులో ఏనుగుల ఊరేగింపు ప్రధాన్యత వహిస్తుంది. కనుల విందుగా జరిగే ఈ ఉత్సవం చూడడానికి అనేకమది భక్తులు తరలి వస్తారు.

  • మహార్నవమి రోజున ఆలయం తెల్లవారు ఝామున 4 గంటలకు నిర్మాల్య దర్శనంతో తెరవబడుతుంది. తరువాత గణపతి హోమం, ఒకచర్తు, ఉషా పూజ, అష్టపది నిర్వహించబడుతుంది.7 గంటలకు ఉదయకాలపు పూజ నిర్వహించబడుతుంది.
  • 7 గంటలకు ఏనుగులకు స్నానం చేయించిన తరువాత అగ్రహారం వీధిలో వరుసగా నిలబడుతుంటాయి. ఏనుగులకు కొబ్బరి, బెల్లం, పండిన అరటిపండు, నెయ్యి కలిపిన అటుకులు ఆహారంగా ఇస్తారు.
  • 7.30 ఉదయం ఉత్సవమూర్తి, అయ్యప్ప కోదండరామస్వామి అలంకారంలో నాదస్వర మేళంతో ఆభరణాలతో అలంకరించబడిన ఏనుగులతో పంచాయత సంప్రదాయ వేడుకతో ఆదికేశవ పెరుమాళ్ వద్దకు వెళతాడు. మేళతాళాలలో తిల్మా, మద్దెల, ఎడక, ఎలతలం, కొంబు, శంఖు, కుళల్ వంటి సహాయవాద్యాలు చోటు చేసుకుంటాయి. ఊరేగింపు మద్యలో 3 మార్లు శంఖు ఊదబడుతూ ఉంటుంది. శఖనాదం భక్తులమనసును భక్తిపరవశంలో ముంచుతుంది.

అయ్యప్ప

[మార్చు]

పంచాయిత ఊరేగింపు వర్ణరంజితమైన వస్త్రంతో కప్పబడిన ఏనుగులవరుసతో వింజామరలు, విసనకర్రలతో స్వామి అయ్యప్ప దేవాలయానికి చేరుతుంది. అయ్యప్ప పూజ తరువాత అయ్యప్ప స్వామిని తీసుకుని సకలవిధలతో సేవించబడుతూ 10.30 గంటలకు బయలుదేరి పంచరిమేళంతో కూడిన చండమేళంతో ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి చేరుకుంటాడు. అయ్యాప్ప స్వామి తిరిగి తన ఆలయానికి బయలుదేరగానే ఆదికేశవ పెరుమాళ్‌కు మధ్యాహ్న పూజ మొదలు పెడతారు.

ఊరేగింపు

[మార్చు]

మద్యాహ్నపూజ అయిన తరువాత సాయంత్రం 3.30 గంటలకు ఉత్సమమూర్తిని ఊరేగింపులు సిద్ధం చేసి ఆలయం నుండి వెలుపలకు తీసుకు వస్తారు. వర్ణరంజితంగా అలంకరించబడిన 18 ఏనుగులు ఆదికేశవపెరుమాళ్ ఆలయం ముందు నిలిపి ఉంచుతారు.

నడ పాండి మేళం

[మార్చు]

అయ్యప్ప స్వామి ఆలయం నుండి నడపాడి మేళం ఆదికేశవపెరుమాళ్ ఆలయం చేరుకోగానే మహార్నవమి పూజ చివరిస్థాయికి చేరుకుంటుంది. ఆదికేశవ పెరుమాళ్ మేళతాళాల నడుమ ఆలయానికి చేరుంటాడు. సాయంత్రం 6 గంటల సమయానికి ఈ నవమి పూజ ముగింపుకు చేరుకుంటుంది. తరువాత నెయ్యప్పం స్వామికి నివేదించబడుతుంది. తరువాత ప్రసాదం భక్తులందరికీ పంచిపెట్టబడుతుంది. ఉత్సవ నిర్వహణ బాధ్యత మహార్నవమి కమిటీ వహిస్తుంది.

పాఠశాలలు , కళాశాలు

[మార్చు]

పాఠశాలలు, కళాశాలల్లో, సహా అనేక ఉన్నాయి:

  • ప్రభుత్వం విక్టోరియా కాలేజ్, పాలక్కాడ్ 1866 లో స్థాపించబడింది.
  • ఇంజనీరింగ్ NSS కాలేజ్, పాలక్కాడ్ 1960 లో స్థాపించబడింది.
  • ఎన్.ఎస్.ఎస్. కాలేజీ, నెమ్మర 1966 లో స్థాపించబడింది.
  • గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ, శ్రీకృష్ణపురం 1999 లో స్థాపించబడిన ఒక సాంకేతిక విద్యాసంస్థ
  • బాసెల్ ఎవాంజెలికల్ మిషన్ హయ్యర్ సెకండరీ స్కూల్
  • భరత మాతా హయ్యర్ సెకండరీ స్కూల్
  • వ్యాస విద్యా పీఠం సెంట్రల్ స్కూల్.
  • కనిక్కమాథా కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం గర్ల్ యొక్క ఉన్నత మాధ్యమిక పాఠశాల.
  • ఎస్.ఎన్.జి.ఎస్ కోల్లెజ్ పట్టామ్బి
  • సెయింట్. డొమినిక్ కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, శ్రీకృష్ణపురం.
  • ప్రభుత్వ కళాశాల చిత్తూరు

పర్యాటక ప్రాంతాలు

[మార్చు]
View from outside the northern wall of Palakkad fort.
Sri Killikkurussi Mahadeva Kshetram (Shiva temple of Killikkurussimangalam).

పాలక్కడు కోట

[మార్చు]

పాలక్కాడు కోట:- పట్టణం కేంద్రస్థానంలో ఉంది. కేరళాలో చక్కగా సరంక్షించబడుతున్న అందమైన కోటగా ఇది ప్రశశించబడుతుంది. ఇది పలు విరోచిత చర్యలకు, ధైర్యసాహసాలకు చిహ్నంగా నిలిచి ఉంది. ఈ కోటను మైసోర్ రాజు హైదర్ అలి నిర్మించాడు. 1784లో పదకొండు రోజుల పోరాటం తరువాత బ్రిటిష్ కల్నల్ " విలియం ఫుల్లర్టన్ " దీనిని స్వాధీనం చేసుకున్నాడు. తరువాత దీనిని జమోరిన్ సైన్యాలు స్వాధీనం చేసుకున్నాయి. తరువాత 1790లో దీనిని బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకుంది. చక్కగా సంరక్షించబడుతున్న ఈ కోట టిప్పుసుల్తాన్ కోటగా పిలువబడి తరువాత టిప్పు సుల్తాన్ కుమారుడు హైదర్ అలి స్వాధీనంలోకి మారింది. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షణలో నిర్వహించబడుతుంది.

మాలంపుళా ఆనకట్ట

[మార్చు]
  • మాలంపుళా ఆనకట్ట:- అతిపెద్ద నీటిపారుదల ఆనకట్టగా గుర్తించబడుతుంది. ఇది భరతపుళా నది మీద పశ్చిమ ఘాట్ లోయలలో నిర్మించబడింది. ఇక్కడ అందమైన తోటలు, పిల్లలకు అమ్యూజిమెంటు పార్క్, బోటింగ్ వసతులు కలిగిన రిజర్వాయర్ ఉంది.

పరంబికుళం విల్డ్ లైఫ్ శాక్చ్యురీ

[మార్చు]

పరంబికుళం వన్యప్రాణి శాల్చ్యురీ 285 చ.కి.మీ వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇది పాలక్కడు నుండి 135చ.కి.మీ దూరంలో ఉంది. ఇది తమిళనాడు లోని ఇందిరాగాంధి నేషనల్ పార్క్, వన్యప్రాణి అభయారణ్యం ఆనుకుని ఉంది. ఇక్కడ ఏనుగులు, అడవి పంది, సాంబార్, దున్నపోతు, గౌర్, మొసళ్ళు, కొన్ని పులులు, చిరుతపులులు ఉన్నాయి. ఇక్కడ అధికంగా సెమీ- ట్రాపికల్ మొక్కలు, చెట్లు ఉన్నాయి. ముందుగా అనుమతి తీసుకుని పర్వతారోహణ అనుమతించబడుతుంది. సరోవరంలో బోటింగ్ సౌకర్యం లభిస్తుంది. తునకడవు వద్ద ఉన్న " కన్నిమేరీ టేకు చెట్టు " ఆసియాలో అతి పెద్ద టేకు చెట్టుగా గుర్తించబడుతుంది.

సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్

[మార్చు]

సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్‌లో అరుదైన జాతులకు చెందిన చెట్లతో కూడిన దట్టమైన వర్షారణ్యం ఉంది. ఇది నేషనల్ పార్ ఆఫ్ ఇండియా ప్రకటించబడ్జింది. ఇది పాలక్కాడుకు 80 కి.మీ దూరంలో ఉంది. ఇది సాధారణంగా సతతహరితారణ్యంగా గుర్తించబడింది. ఇది చాలా నిశ్శబ్ధంగా ఉంటుంది. సాధారణంగా అరణ్యాలలో ఉండే కీవురాళ్ళ ధ్వని ఇక్కడ వినిపించదు కనుక అంతటా నిశ్శబ్ధం తాండవిస్తుంది. పశ్చిమకనుమలలో ఇది ప్రముఖ భయీస్ఫేర్ రిజర్వ్ గా గుర్తించబడుతుంది. ఇక్కడ ఇండియన్ గిరిజన ప్రజలు నివసిస్తున్నారు. వ్యాలీలో లైన్- టెయిల్డ్ మకాక్యూ పక్షులు కనిపిస్తుంటాయి. పార్క్ పులుల శరణాలయంగా ఉంది.

కిల్లిక్కురుస్సిమంగళం

[మార్చు]

కిల్లిక్కురుస్సిమంగళం ఇది ప్రముఖ మలయాళ వ్యగ్య కవి, ఓట్టంతుల్లాల్ కళారూపం రూపకర్త కుంచన్ నంబియార్ జన్మస్థలం. గ్రామంలో ఆయన స్మారకార్ధం స్థాపించిన గ్రంథాలయం ఉంది. ఇక్కడ ప్రముఖ కిల్లిక్కురుస్సి శివాలయం ఉంది. అభినయ ఏక్టింగ్ అథారిటీ, నాట్యాచార్య విదూషకరత్నం పద్మశ్రీ గురు మణి మాధవ చక్యర్ (కోడియాట్టం నృత్యాన్ని సరికొత్ర శిఖరానికి తీసుకు వెళ్ళిన వ్యక్తి) లకు స్వస్థలం. ఇక్కడ కొడియాట్టం శిక్షణ ఇవ్వబడుతున్న " మణి మాధవ చక్యర్ స్మారక గురుకులం " ఉంది.

నెల్లియంపాఠి

[మార్చు]

నెల్లియంపాటీ - కేరళ ఉటీగా గుర్తించబడుతుంది. ఇది పాలక్కాడుకు 80 కి.మి దూరంలో ఉంది. ఇది దట్టమైన అరణ్యానికి సమీపంలో ఉన్న ఒక హిల్ స్టేషను.

షోలయార్

[మార్చు]

షొలయార్ జిల్లలో ఎత్తైన శిఖరంగా గుర్తించబడుతుంది.

అట్టపాడి

[మార్చు]

అట్టప్పాడి మన్నార్కాడ్‌కు ఈశాన్యభూభాగంలో 38కి.మీ దూరంలో ఉంది. మానవ శాస్త్రజ్ఞులలకు ఇది ఆసక్తికరమైన ప్రదేశం. ఇక్కడ ఇరుళర్, ముదుగర్ నివసిస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న ఆదివాసులు ఇక్కడున్న కొండశిఖరాన్ని మల్లీశ్వరునిగా ఆరాధిస్తున్నారు. గిరిజన ప్రజల మద్య కొండ శిఖరం, భవాని నది ఆధ్యాత్మిక ప్రధాన్యత కలిగి ఉన్నాయి.

పొతుండి ఆనకట్ట

[మార్చు]

పోతుండి ఆనకట్ట - భారతదేశంలో రెండావా మట్టి ఆనకట్టగా గుర్యించబడుతుంది. (సిమెంటు లేకుండా ఆనకట్ట నిర్మించబడడం విశేషం). ఇది నిలయాంపతి పర్వత లోయలలో నిర్మించబడింది. ఇక్కడ అందమైన పూదోట ఉంది. ఇక్కడి నుండి నిలయాపతి పర్వతదేశ్యాలు అద్భుతంగా కనిపిస్తుంటాయి.

వలయార్ ఆనకట్ట

[మార్చు]

వలయార్ ఆనకట్ట పాలక్కడుకు 25 కి.మీ దూరంలో కేరళ, తమిళనాడు సరిహద్దులో ఉంది. ఇది సులువుగా చేరుకోగలిగిన ప్రదేశం. వలయార్ నుండి 3 కి.మీ దూరంలో జింకలపార్క్ ఉంది.

చులనూర్

[మార్చు]

చులనూర్ ఒక నెమలి అభయారణ్యం.

షొలయార్ అరణ్యం

[మార్చు]

షొలయార్ అరణ్యం జిల్లాలో ఎత్తైన శిఖరంగా గుర్తించబడింది. కాఫీ, టీ ప్లాంటేషన్లు, ఆనకట్ట ఉన్నాయి. చలక్కుడి వద్ద వాల్పారై, జలపాతం ఉన్నాయి.

ధోని

[మార్చు]

దోని పాలక్కాడుకు 15కి.మీ దూరంలో ఉంది. అరణ్యంలో పలు ఆసక్తికరమైన ప్రదాశాలు ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. ధోని పర్వతపాదాల నుండి 3 గంటల పర్వతారోహణ చేసిన తరువాత జలపాతం చేరుకోవచ్చు.

జైనిమేడు

[మార్చు]

జైనమేడు జైన ఆలయం పాలక్కడు పట్టణ పశ్చిమ సరిహద్దులో రైల్వే స్టేషను సమీపంలో ఉంది. ఇది చారిత్రక జైన ఆలయం. ఈ ఆలయ ప్రాంతాన్ని జైనమేడు అంటున్నారు. కేరళలో జైనిజం ఉనికికి ఇది చిహ్నంగా ఉంది. ఆలయంలోని గ్రానైట్ రాళ్ళు అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. ఆలయంలో తీర్ధంకర, యక్షిణి శిల్పాలు ఉన్నాయి. కుమరన్ ఆసాన్ ఆయన గురువు నారాయణ్ గురు వద్ద స్వల్పకాలం నివసించిన సమయంలో ఆయన స్మారకార్ధం " వీణా పూవు" (రాలిన పూవు) పద్యం వ్రాసాడు.

మీన్‌వల్లం జలపాతం

[మార్చు]

కాలడికోడ్ సమీపంలో మీన్‌వల్లం జలపాతం ఉంది. జలపాతం పైనుండి పలు పాయలుగా విడివడి ప్రవహిస

ఇవి కూడ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. "List of Districts in Kerala - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-10.
  3. "Census GIS India". Archived from the original on 2015-04-25. Retrieved 2014-06-30.
  4. "'Rice bowl' will loose 30,000 hectares if conversion legalised". The Hindu. 2012-07-20. Retrieved 2013-12-29.
  5. "Ittipangi Achan passes away". The New Indian Express. 2011-07-31. Archived from the original on 2013-12-31. Retrieved 2012-07-12.
  6. "Fact sheet on Indian dams at Diehardindian.com". Archived from the original on 2006-12-13. Retrieved 2014-06-30.
  7. 7.0 7.1 "*** Official WebSite Of Palakkad District ***". Palakkad.nic.in. Archived from the original on 2019-01-09. Retrieved 2011-10-18.
  8. 8.0 8.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  9. "ITI Limited". Archived from the original on 2018-08-14. Retrieved 2020-06-17.
  10. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Jamaica 2,868,380 July 2011 est
  11. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Utah 2,763,885
  12. ""District at a Glance", statistics on Tamil". Archived from the original on 2014-01-22. Retrieved 2014-06-30.
  13. M. Paul Lewis, ed. (2009). "Allar: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  14. M. Paul Lewis, ed. (2009). "Aranadan: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  15. "Ottapalam Welfare Trust". Owelt.org.in. Archived from the original on 2014-05-16. Retrieved 2013-12-29.
  16. "Thangam PMRC Hospital Palakkad Kerala". Thangampmrc.com. Archived from the original on 2013-12-30. Retrieved 2013-12-29.
  17. "It works!!". Ahaliafoundationeyehospital.org. Archived from the original on 2014-03-23. Retrieved 2013-12-29.
  18. "lakshmihospitalpalakkad.com". lakshmihospitalpalakkad.com. Archived from the original on 2013-12-31. Retrieved 2013-12-29.

ఉపగ్రహ చిత్రాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]