త్రిస్సూర్ జిల్లా
Thrissur district
Trichur district | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
Clockwise from top: Thrissur Kole Wetlands, Cape of Kodungallur, Kerala Kalamandalam, Athirappilly Falls, Shakthan Thampuran Palace, Chimmini Wildlife Sanctuary | ||||||||
Nickname: Cultural capital of Kerala | ||||||||
Coordinates: 10°31′N 76°13′E / 10.52°N 76.21°E | ||||||||
Country | India | |||||||
State | Kerala | |||||||
Headquarters | Thrissur | |||||||
Government | ||||||||
• District Collector & District Magistrate | Haritha V. Kumar, IAS | |||||||
• Police Commissioner (City) | R. Aadithya, IPS | |||||||
• S.P (Rural) | Aishwarya Dongre, IPS | |||||||
• Divisional Forest Officer, Thrissur | Kurra Srinivas IFS | |||||||
విస్తీర్ణం | ||||||||
• Total | 3,032 కి.మీ2 (1,171 చ. మై) | |||||||
జనాభా (2018)[1] | ||||||||
• Total | 32,43,170 | |||||||
• జనసాంద్రత | 1,070/కి.మీ2 (2,800/చ. మై.) | |||||||
Languages | ||||||||
• Official | Malayalam, English | |||||||
Time zone | UTC+5:30 (IST) | |||||||
Vehicle registration | KL-08 Thrissur, KL-45 Irinjalakuda, KL-46 Guruvayur, KL-47 Kodungallur, KL-48 Wadakkancherry, KL-64 Chalakkudy, KL-75 Thriprayar | |||||||
HDI (2005) | 0.781[2] ( High) |
త్రిస్సూర్ జిల్లా, (మలయాళం:തൃശൂര്) భారతదేశం, కేరళ రాష్ట్రం లోని జిల్లా. [3]దీనిని త్రిచూర్ అని కూడా అంటారు. ఇది రాష్ట్రానికి కేంద్ర స్థానంలో ఉంది. పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. కేరళ రాష్ట్రంలో 10% శాతం త్రిస్సూర్ జిల్లాలో ఉంది. 1949 జూలై 1 త్రిసూర్ కేంద్రంగా జిల్లా రూపొందించబడింది. త్రిస్సూర్ కేరళ రాష్ట్ర సాంస్కృతిక కేంద్రంగా ఉంది. త్రిసూర్ పూరం భూమిగా గుర్తించబడుతుంది. జిల్లాలో పురాతన ఆలయాలు, చర్చిలు, మసీదులు ఉన్నాయి. త్రిసూర్ పూరం మహోత్సవం కేరళ రాష్ట్రంలో వరణరంజితమైన ఉత్సవాలలో ఒకటిగా భావించబడుతుంది.సుమారు 3,032 కిమీ2 (1,171 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో విస్తరించి ఉన్న త్రిస్సూర్ జిల్లా కేరళ జనాభాలో 9% మందికి పైగా నివాసంగా ఉంది.
త్రిస్సూర్ జిల్లాకు ఉత్తరాన పాలక్కాడ్, మలప్పురం జిల్లాలు, దక్షిణాన ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలు, తూర్పున కోయంబత్తూరు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. అరేబియా సముద్రం పశ్చిమాన ఉంది. పశ్చిమ కనుమలు తూర్పు వైపు విస్తరించి ఉన్నాయి. ఇది చారిత్రక మలబార్ తీరంలో భాగం, ఇది పురాతన కాలం నుండి అంతర్జాతీయంగా వర్తకం చేస్తోంది. ప్రధానంగా మాట్లాడే భాష మలయాళం. త్రిస్సూర్‌ను కేరళ సాంస్కృతిక రాజధానిగా, పూరమ్‌ల భూమిగా పిలుస్తారు. జిల్లా పురాతన దేవాలయాలు, చర్చిలు, మసీదులకు ప్రసిద్ధి చెందింది. త్రిస్సూర్ పూరం కేరళలో అత్యంత రంగుల ఆలయ పండుగ.
పేరువెనుక చరిత్ర
[మార్చు]త్రిసూర్ అనే పేరుకు మూలం " తిరు- శివ - పేరూర్ " (మలయాళం/తమిళం) పరమశివుని పేరు కలిగిన నగరం ఇది. పురాతన కాలంలో త్రిసూర్ " వ్రిషంభాద్రిపురం ", "కైలాసం " (దక్షుణ కైలాసం " అని పిలువబడింది. మరొక కథనం అనుసరించి " త్రి- శివ - పేరూర్ " అంటే మూడు శివాలయాలు ఉన్న పెద్ద ఊరు అని అర్ధం. అందుకు నిదర్శనంగా ఈ ప్రాంతంలో వడక్కునాథన్ దేవాలయం, అశోకేశ్వరం శివాలయం, ఇరత్తచిరా శివాలయం అనే మూడు ఆలయాలు ఉన్నాయి.
చరిత్ర
[మార్చు]పురాతన కాలం నుండి త్రిసూర్ జిల్లా దక్షిణ భారతదేశ రాజకీయాలలో ప్రధాన పాత్ర వహించింది. జిల్లా ఆరంభకాల రాజకీయ చరిత్ర సమ్ఘకాలానికి చెందిన చేరసామ్రాజ్యంతో ముడిపడి ఉంది. వంచి నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన చేరచక్రవర్తులు కేరళ రాష్ట్రంలోని అత్యధిక భాగాన్ని పాలించారు. పురాతన, మద్యయుగంలో కేరళప్రాంతం, వెలుపలి ప్రపంచం మద్య వ్యాపారం అభివృద్ధి చేయడానికి త్రిసూర్ ప్రధాన పాత్రవహించింది.
కొడుంగల్లోర్ " ప్రీమియం ఎంపోరియం ఇండియా " గా గుర్తించబడుతుంది. మలబార్ (ఉత్తర కేరళ) అభివృద్ధికి సహకరిస్తున్న మూడు సమూహాలకు (క్రైస్తవులు, జ్యూలు, ముస్లిములు) కొడుంగల్లోర్ ఆశ్రయం కల్పిస్తుంది. త్రిసూర్ ప్రాంతాన్ని 9-12 శతాబ్దాలలో మహోదయపురానికి చెందిన కులశేఖరాలు పాలించారు. 12వ శతాబ్దం తరువాత త్రిసూర్ చరిత్రలో పెరుంపడప్పు స్వరూపం చోటుచేసుకుంది.
1790 లో రాజా రాం వర్మ (శక్తన్ తంబురాన్) (1790-1805) కొచ్చిన్ సామ్రాజ్య సింహాసనం అధిరోహించాడు. శక్తన్ తంబురాన్ పట్టాభిషేకంతో ఈ ప్రాంతంలో ఆధునిక చరిత్ర ఆరభం అయింది. ప్రాంతీయ నాయర్ రాజప్రతినిధుల పతనానికి సరికొత్త రాజరిక వ్యవస్థకు శక్తన్ తంబురాన్ శ్రీకారం చుట్టాడు. తరువాత త్రిసూర్ దాని పరిసర ప్రాంతాన్ని పాలించిన పాలకులలో నంబూద్రి, మేనన్‌లు ప్రధానులు. త్రిసూర్ తాలూకాలోని అత్యధిక భాగం వడక్కునాథన్, పెరుమనం దేవస్థానాలకు చెందిన మతప్రతినిధులైన యోగియాతిరిప్పదాస్ పాలనలో కొనసాగింది. 20వ శతాబ్ద ఆరంభ కాలంలో దేశం అంతటా వ్యాపించిన రాజకీయ చైతన్యం, జాతీయవాదం త్రిసూర్ ప్రాంతంలో కూడా ప్రభావం చూపింది. అంటరానితనం, ఆలయప్రవేశం వంటి సంఘ సంస్కరణ ఉద్యమాలలో త్రిసూర్ తమ వంతు పాత్ర చక్కగా వహించింది. జాతీయ ఉద్యమంలో గురువాయూర్ సత్యాగ్రహం చిరస్థాయిగా నిలిచిపోయింది.
2011 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,110,327,[4] |
ఇది దాదాపు. | మంగోలియా దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | లోవా నగర జనసంఖ్యకు సమం..[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 113వ స్థానంలో ఉంది..[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1026 .[4] క్ |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 4.58%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1019 [4] |
జాతీయ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 95.32%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జొల్లాలో అధికభాగం నగరీకరణ చేయబడి ఉంది. నగరీకరణలో జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఎర్నాకుళం ఉంది. .[7]
2001 గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య | 2,975,440.[8] |
పురుషుల శాతం | 49% |
స్త్రీలశాతం | 51%. |
పురుషుల అక్షరాస్యత | 87%, |
స్త్రీల అక్షరాస్యత | 85% |
6 వయసు లోపు పిల్లాలు | 10% |
హిందువులు | 59.24%, |
ముస్లిములు | 16.43% |
క్రైస్తవులు | 24.21% |
ప్రజలు
[మార్చు]త్రిసూరులో ఎళవాలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. తరువాత స్థానంలో ధీవారార్లు, నాయర్లు ఉన్నారు. హిందూ ప్రజలలో అంబలవాసీలు, తమిళ బ్రాహ్మణులు ఉన్నారు. హిందూ ప్రజలు షెడ్యూల్డ్ కులాల ప్రజలు జిల్లా జనసంఖ్యలో 12% ఉన్నారు. క్రైస్తవులలో ప్రధానంగా కాథలిక్కులు (సియో మలబార్ చర్చ్, లాటిన్ ), జాకోబైట్ సిరియన్ క్రిస్టియన్లు, చల్డీన్‌లు ఉన్నారు. కాథలిక్కులలో 90% మంది జిల్లాలో ప్రదేశాలలో (త్రిసూర్ (4,60,000), ఇరింజలక్కుడా (2,52,000), కోట్టపురం (75,000) ) ఉన్నారు.
ఇక్కడి వ్యక్తులు
[మార్చు]- డెల్నా డేవీస్ - నటి
- అయ్యప్పనుమ్ కోషియుమ్ - సినిమా దర్శకుడు సచీ కొడుంగల్లూర్ లోనే జన్మించాడు.
కున్నంకుళం
[మార్చు]జిల్లాలో ఉత్తరభూభాగంలో ఉన్న చిన్న గ్రామం కున్నంకుళం. ఇది జాకోబైట్స్ (50,000 అనుయాయులు) కేంద్రంగా ఉంది. త్రిసూరులో ఉన్న చల్డియన్ సిరియన్లు 25,000. తొళియూర్ చర్చ్ ప్రధాన కేంద్రంగా 7,000 అనుయాయులు ఉన్నారు. మలంకర ఆర్థడాక్స్ సిరియన్ చర్చ్ అనుయాయుల సంఖ్య కొన్ని వందలు ఉన్నారు. జిల్లాలోని సముద్రతీరంలో ముస్లిములు దీర్ఘకాలంలో ఉన్నారు. మస్లిములు గురువాయూర్, చవక్కాడ్ ప్రాంతాలలో అధికంగా ఉన్నారు. కైపమంగళం, నత్తిక ప్రాంతాలలో సున్ని ముస్లిములు అధికంగా ఉన్నారు.
భౌగోళికం
[మార్చు]త్రిస్సూర్ నైరుతి భారతదేశంలో 10°31′N 76°13′E / 10.52°N 76.21°E భారతదేశంలోని కేరళ మధ్య భాగంలో ఉంది. త్రిస్సూర్ సముద్ర మట్టంలో ఉంది. సుమారు 3032 కిమీ² విస్తీర్ణంలో ఉంది.
సరిహద్దులు
[మార్చు]జిల్లా ఉత్తర సరిహద్దులో మలప్పురం జిల్లా, తూర్పు సరిహద్దులో ఇడుక్కి జిల్లా, పాలక్కాడు జిల్లా, తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా, దక్షిణ సరిహద్దులో ఎర్నాకుళం జిల్లా, పశ్చిమ సరిహద్దులో అరేబియన్ సముద్రం (54 కి.మీ పొడవు) ఉన్నాయి. జిల్లా తూర్పు భాగంలో పశ్చిమ కనుమలు పశ్చిమంగా దిగుడుగా ఉంటుంది. జిల్లా మొత్తంగా ఎగువభూములు, మైదానం, సముద్రతీరం అనే మూడు భౌగోళిక భాగాలుగా ఉంటుంది.
నదులు
[మార్చు]జిల్లాలో పెరియార్ నది, చలకుడి నది, కురుమలి నది (కురువన్నూర్ నదికి ఉపనది), పొన్నై (భారతపుళా) మొదలైన నదులు ప్రవహిస్తున్నాయి. నదులన్ని తూర్పున ఉన్న పర్వతాలలో జన్మించి అక్కడ నుండి పశ్చిమంగా ప్రవహిస్తూ అరేబియన్ సముద్రంలో కలుస్తున్నాయి. ఈ ప్రధాన నదులలో పలు ఉపనదులు సంగమిస్తున్నాయి. జిల్లాలో అథిరపల్లి జలపాతాలు (భారతీయ నయాగరాఅంటారు) ఉన్నాయి.
వాతావరణం
[మార్చు]వాతావరణం
[మార్చు]విషయ వివరణ | వాతావరణ వివరణ |
---|---|
వాతావరణ విధానం | తేమతో కూడిన వేడి |
గరిష్ఠ ఉష్ణోగ్రత | ° సెల్షియస్ |
కనిష్ఠ ఉష్ణోగ్రత | ° సెల్షియస్ |
వేసవి | మార్చి- మే |
వర్షాకాలం | జూన్ - సెప్టెంబరు |
శీతాకాలం | అక్టోబరు- ఫిబ్రవరి |
వర్షపాతం | విస్తారమైన వర్షపాతం 3000 మి.మీ |
సంస్కృతి
[మార్చు]చర్చి
[మార్చు]త్రిసూర్ ఆర్కియాజికల్ సంపద, చారిత్రక, సాంస్కృతిక సంప్రదాయంతో సుసంపన్నమై ఉంది. ఇది కేరళ సాంస్కృతిక కేంద్రంగా గుర్తించబడుతుంది. త్రిసూర్ పూరం ఉత్సవం త్రిసూర్‌కు ప్రత్యేకత కలిగిస్తుంది.
జిల్లా వివిధ సహజసంపదలను కలిగి ఉంది. అందమైన కేరళ భూభాగం త్రిసూర్‌తో మొదలౌతుంది. ప్రశాంతమైన అందమైన చిన్న చిన్న గ్రామాలు నిరంతరంగా ప్రవహించే నదులు సహజ సౌందర్యానికి మెరిగులు దిద్దుతున్నాయి. పురాతన సంప్రయ కేంద్రమైన త్రిసూరులో కేరళ కాలమండలం, కేరళ సాహిత్య అకాడమీ, కేరళ లలితకాళా అకాడమీ, కేరళ సంగీత నాడక అకాడమీ (త్రిస్సూర్) సాంస్కృతిక కళాకేంద్రాలు ఉన్నాయి. వడక్కునాథన్ శివాలయం ఉన్న కొండ చుట్టూ త్రిసూర్ నగరం అభివృద్ధి చెందింది. పురాతన కేరళ నిర్మాణ సంప్రదాయానికి ఆలయం ప్రతిబింబంగా ఉంది. జిల్లాలో పలు పవిత్ర ఆలయాలు ఉన్నాయి. మాలిక్ బిన్ దీనార్, 20 మంది ముహమ్మద్ (ఇస్లాం మత స్థాపకుడు) అనుయాయులు భారతదేశానికి వచ్చినప్పుడు మొదటిసారిగా త్రిసూరులోని కొడుగనల్లుర్‌లో అడుగుపెట్టారు. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ఇస్లాంకు రాజమర్యాద పొందిన తరువాత భారతదేశం అంతటా విస్తరించింది. మాలిక్ బిన్ దీనార్ నగరంలో " చెర్మన్ జుమా మసీద్ " నిర్మించాడు. చెర్మన్ జుమా మసీద్ హిందూ ఆలయ శైలిలో నిర్మించబడింది. ప్రపంచంలో మదినా తరువాత నిర్మించబడిన రెండవ మసీదుగా ఇది భావించబడుతుంది.
త్రిసూర్ జిల్లాలో " చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ డోలోర్స్ " (న్యూచర్చ్) ఉంది. దక్షిణాసియాలో ఇది అతిపెద్ద చర్చిగా గుర్తించబడుతుంది. భారతదేశంలో మొదటి చర్చిగా గుర్తించబడుతున్న ఎస్.టి థోమస్ చర్చ్ జిల్లాలోని పలయూర్‌లో ఉంది. చల్దీన్ సిరియన్ చర్చ్ (చర్చ్ ఆఫ్ ది ఈస్ట్) ప్రధాన కార్యాలయం త్రిసూర్‌లో ఉంది. మతసంబంధిత ప్రచురణా సంస్థలు అనేకం మార్ నర్సై ప్రెస్‌లో ప్రచురించబడుతున్నాయి. అతిపెద్ద యాత్రా ప్రదేశం " ఎస్.టి. జోసెఫ్స్ ష్రైన్ " జిల్లాలోని పవరథి వద్ద ఉంది. సా.శ. 52లో సెయింట్ థోమస్ (అపోస్టిల్) మొదటిసారిగా కొడుంగల్లూర్‌లో అడుగు పెట్టాడు. సెయింట్ థోమస్ త్రిసూరులో " సెయింట్ థోమస్ చర్చ్ " స్థాపించాడు. ఈ చర్చిలో పలు పురాతన అవశేషాలు బధ్రపరచబడి ఉన్నాయి. అయినప్పటికీ చరిత్రకారులు దీనిని అంగికరించడం లేదు.
గురువాయూర్
[మార్చు]గురువాయూర్‌లో ప్రఖ్యాత కృష్ణుని ఆలయం ఉంది. ఇది త్రిసూరుకు 25 కి.మీ దూరంలో ఉంది. ప్రంపంచంలోని హిందువులు అందరూ ఇక్కడకు కృష్ణుని దర్శనార్ధం వస్తుంటారు. చవకడి, కున్నంకుళం వరుసగా ముస్లిములకు, క్రైస్తవులకు యాత్రా స్థాలాలుగా ఉన్నాయి. త్రిప్రయార్ ఆలయం మరొక ప్రముఖ ఆరధనాప్రాంతగా ఉంది. కేరళ రాష్ట్రంలోని మూడు ప్రసిద్ధ శ్రీరాముని ఆలయాలలో ఇది ఒకటి. మిగిలిన రామాలయాలలో తిరువిల్వమాల ఆలయం, కడవల్లూరు రామాలయాలు ప్రధానమైనవి.
కొడుంగల్లూర్
[మార్చు]కొడుంగల్లూర్ మునుపటి చేర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇది ఆర్కియాలజీ, చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. ఇక్కడ ఉన్న భగవతి ఆలయం వేలాది భక్తులను ఆకర్షిస్తూ ఉంది. చెరామన్ జుమా మసీద్ భారతదేశంలో అతిపురాతన మసీదుగా విశ్వసించబడుతుంది. ఇరింజల్కుడాలో దేశంలో ఒకేఒక ఆలయమని భావిస్తున్న " భారత టెంపుల్ " ఉంది. కూడల్‌మాణిఖ్యం ఆలయం వద్ద ఉనై వారియార్ స్మరకా కల్యాణనిలయం ఉంది. కథాకళి నృత్య శిక్షణకు ఇది కేంద్రంగా ఉంది. పురాతన కాలం నుండి కేరళ రాష్ట్రంలో త్రిసూర్ వేదాధ్యానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ భూమిలో ఇప్పటికీ యాగాలు నిర్వహించబడుతుంటాయి. ఇది త్రిసూర్ కేంద్రస్థానంలో ఉంది.
ప్రభుత్వం, రాజకీయాలు
[మార్చు]- అసెంబ్లీ నియోజకవర్గాలు :- త్రిసూర్: ఒల్లూర్ అసెంబ్లీ నియోజకవర్గం, గురువాయూర్, చలక్కుడి, కైపమంగళం, నత్తిక, కొడంగలూర్, ఇరింజికుడా, పుదుకాడ్, మణలూర్, కున్నంకుళం, వడక్కంచెరి, చెక్కర.
- జిల్లాలో 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి:- త్రిసూర్ పార్లమెంటు నియోజకవర్గం, చలకుడి పార్లమెంటు నియోజకవర్గం.
- త్రిసూర్ జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి
- త్రిసూరులో 151 గ్రామాలు ఉన్నాయి.
మాధ్యమం
[మార్చు]త్రిసూర్ జిల్లాలో మొదటి వార్తాపత్రికగా 1920లో " లోకమాన్యన్ " స్థాపించబడింది. తరువాత 1941లో దీనబంధు పత్రిక స్థాపించబడింది. జిల్లాలో ప్రధానంగా మలయాళ మనోరమా, మాత్రుభూమి, దేశాభిమాని, దీపిక (వార్తాపత్రిక), కేరళకౌముది, మధ్యమం మొదలైన మలయాళ వార్తాపత్రికలు ప్రచురించబడుతున్నాయి. నగరంలో పలు ఈవెనింగ్ పేపర్లు ప్రచురించబడుతున్నాయి. జిల్లాలో హిందీ, కన్నడం, తమిళం, తెలుగు మొదలైన ఇతరభాషా పత్రికలు అధిక సంఖ్యలో విక్రయించబడుతున్నాయి.
పరిశ్రమలు
[మార్చు]త్రిసూర్ చేనేతకు పరిశ్రమకు, టెక్స్‌టైల్స్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. అళగప్పా నగర్‌లో ఉన్న " అళగప్పా టెక్స్‌టైల్స్", కేరళ లక్ష్మీ మిల్స్ (పుళలి), త్రిసూర్ కాటన్ మిల్స్ (నత్తిక), రాజ్‌గోపాల్ టెక్స్‌టైల్స్ (అథాని), సీతారాం స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్" (త్రిసూర్), వనజ టెక్స్‌టైల్స్ (కురియచిరా), భగవతి స్పిన్నింగ్ మిల్స్, (థానికుడం), కున్నథ్ టెక్స్‌టైల్స్, (త్రిసూర్) మొదలైన వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి.
కాయిర్, టైల్స్ పరిశ్రమ
[మార్చు]కాయిర్, టైల్స్ పరిశ్రమలు జిల్లాలో అనేకమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 1905లో మొదటి సా మిల్ స్థాపించబడింది. సామిల్లుకు అవసరమైన టింబర్ త్రిసూర్, చలకుడి అరణ్యాల నుండి లభిస్తుంది. త్రుసూర్‌లో ఆహారపదార్ధాల తయారీ పరిశ్రమ అభివృద్ధి చెంది ఉంది. జిల్లాలో దారికో కేనింగ్స్, కాయీ కేనింగ్స్ సంస్థలు ప్రధానమైనవి.రెండింటికీ త్రిసూరులో ప్రధాన యూనిట్లు ఉన్నాయి. నదతర వద్ద త్రిసూర్ ఫ్రూట్స్, వెజిటబుల్ మార్కెటింగ్ సొసైటీ కేనిగ్ ఇండస్ట్రియల్ యూనిట్‌ను స్థాపించింది. ఇది ప్రస్తుతం విజయవంతంగా నడుస్తుంది. జిల్లాలో అదనంగా అగ్గిపుల్లల పరిశ్రమ, మందులతయారీ పరిశ్రమ, ప్రింటింగ్ పరిశ్రమలు ఉన్నాయి. త్రిసూర్ పరిశ్రమలు శీగ్రగతిలో అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తించబడుతుంది. 1957లో త్రిసూర్‌లో మొదటి " వర్కర్స్ ఇండియన్ కాఫీ హౌస్ స్థాపించబడింది. థానిక్కుడం సమీపంలోని మదక్కర వద్ద 400 కి.వా విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన పవర్ స్టేషను స్థాపించబడింది. ఈ పవర్ స్టేషను రాష్ట్ర విద్యుత్తు అవసరాలలో 30% అందిస్తుంది. త్రిసూర్‌కు దక్షిణంలో ఉన్న అవనిసేరి గ్రామం కుటీరపరిశ్రమలు, ఖాది కేంద్రంగా ఉంది.
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]- అథిరపల్లి వాటర్ ఫాల్స్ (63 కి.మీ; త్రిస్సూర్ సిటీ నుండి కి.మీ): లొంకోడ్ పరిధులలో షోలయర్ గడప వద్ద ఈ 80 అడుగుల ఎత్తైన జలపాతం ఒక ప్రముఖ పిక్నిక్ స్పాట్ ఉంది. రెండు వినోద ఉద్యానవనాలు , డ్రీంవరల్డ్, సిల్వర్‌స్ట్రోం - దగ్గరలోనే ఉన్నాయి.
- వళచల్: దట్టమైన అడవులు దగ్గరగా, చలకుడి రివర్ భాగంగా అథిరపిల్లి నుండి కేవలం ఒక చిన్న డ్రైవ్.
- పున్నత్తూరు కొత్త ఏనుగు అభయారణ్యం (23 కి.మీ; నగరం నుండి కి.మీ ): 60 పైగా ఏనుగులు, ప్రపంచంలో అతిపెద్ద ఏనుగు పార్క్.
- పీచి డ్యాం: (20 కి.మీ; నగరం నుండి కి.మీ) ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ ఉంది
- పూమల ఆనకట్ట: ఒక నీటిపారుదల ఆనకట్ట ఒక సుందరమైన సహజ రిజర్వ్, పర్యాటక స్పాట్.
- చవకాడ్ బీచ్ (25 కి.మీ ): అరుదైన అత్యద్భుతమైన అందాన్ని ఒక సముద్ర తీరం. పశ్చిమ తీరం వెంట ఉత్తమ బీచ్లు ఒకటి గుర్తించాడు.
- వళని ఆనకట్ట (24 కి.మీ; నగరం నుండి కి.మీ) : ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ ఉంది
- స్నేహతీర్ధం బీచ్: ఈ అందమైన, ప్రశాంతత బీచ్ నట్టిక గ్రామం ద్వారా త్రిస్సూర్ పట్టణం నుండి సుమారు 23 కి.మీ సమీపంలో ఉంది. అనేక ఫిషింగ్ బోట్లు, కమ్యూనిటీ seen.Few బీచ్ రిసార్ట్స్ సమీపంలోని కూడా ఉన్నాయి.
- చిమ్మోనీ ఆనకట్ట (35 కి.మీ; నగరం నుండి కి.మీ): ఇది బోటింగ్ సౌకర్యాలు ఒక అందమైన పిక్నిక్ స్పాట్ ఉంది
- కేరళ కాలమండలం (30): చెరుతురుతిలో ఉంది, కవి శ్రీ స్థాపించారు. వల్లతోల్ నారాయణ మీనన్, ఇది మోహినియాట్టం, కథాకళి .
- కూడళ్ ఆలయం.
- అనేక ఉన్నాయి త్రిస్సూర్ గ్రామీణ జిల్లాలో హిందూ మతం దేవాలయాలు.
జిల్లాలో ముఖ్య పట్టణాలు
[మార్చు]- పుదుకాడ్ పుదుకాడ్
- చాలకుడేలో
- చావక్కాద్
- చెలక్కరా
- గురువాయూర్
- హరినగర్ పూంకున్నం
- ఇరింజలకుడా
- కెచేరి
- కొడకర
- కొడంగలూర్
- కున్నంకుళం
- త్రిప్రయార్
- వదనపళ్ళి
- వాడకంచెరి
- మణితర
చిత్రమాలిక
[మార్చు]-
Guruvayur Temple entrance - 25 km from Thrissur City.
-
East Gate of Vadakumnathan Temple.
-
Poothan and Thira for the Machattu Vela festival, near Wadakkanchery.
-
Muthuvara Shiva Temple.
మూలాలు
[మార్చు]- ↑ Annual Vital Statistics Report - 2018 (PDF). Thiruvananthapuram: Department of Economics and Statistics, Government of Kerala. 2020. p. 55. Archived from the original (PDF) on 2021-11-02. Retrieved 2023-06-04.
{{cite book}}
: More than one of|accessdate=
and|access-date=
specified (help); More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Kerala | UNDP in India". UNDP.
- ↑ "List of Districts in Kerala - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-10.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Mongolia 3,133,318 July 2011 est.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Iowa 3,046,355
- ↑ http://www.censusindia.gov.in/2011-prov-results/paper2-vol2/data_files/kerala/Chapter_IV.pdf
- ↑ "The Official Website of Thrissur District". Archived from the original on 2011-02-08. Retrieved 2014-06-30.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)
బయటి లింకులు
[మార్చు]
నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి