కొచ్చిన్ రాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొచ్చిన్ రాజ్యం

సా.శ.12వ శతాబ్దం[1]–1949
కొచ్చిన్ రాజ్యం
జండా
గీతం: ఓం నమో నారాయణాయ
కొచ్చిన్
స్థాయి
  • స్వతంత్ర రాజ్యం (సా.శ.12వ శతాబ్దం–1370)
  • విజయనగర సామ్రాజ్యంలో భాగం (1370–1565)
  • స్వతంత్ర రాజ్యం (1565–1766)
  • మైసూరు రాజ్యం (1766–1799)
  • అర్ధ స్వతంత్ర రాజ్యం; ఈస్టిండియా కంపెనీతో సామంత ఒప్పందం (1799–1815)
  • బ్రిటిషు సామ్రాజ్యంలో సంస్థానం (1815–1947)
రాజధానిపెరుంపడుప్పు పొన్నాని
కోడుంగల్లూర్
త్రిపునితుర
త్రిస్సూర్
మట్టన్‌చెర్రి
సామాన్య భాషలుమలయాళం
మతం
మెజారిటీ: హిందీమతం (అధికారిక)
మైనారిటీ:
క్రైస్తవం
యూదుమతం
ఇస్లాం
ప్రభుత్వంరాచరికం
సంస్థానం
రాజా 
• సా.శ.12వ శతాబ్దం (first)
వీర కేరళ వర్మ
• 1948–1949 (చివరి)
రామవర్మ XVIII
దివాన్ 
• 1812–1818 (మొదటి)
జాన్ మున్రో
• 1944–1947 (చివరి)
సి.పి.కరుణాకర మీనన్
చరిత్ర 
• స్థాపన
సా.శ.12వ శతాబ్దం[1]
• పతనం
1949
GDP (PPP)estimate
• Total
600.03 కోట్ల USD
ద్రవ్యంరూపాయి, ఇతర స్థానిక ద్రవ్యాలు
Preceded by
Succeeded by
చేర వంశం
ట్రావన్కూర్-కొచ్చిన్
Today part ofభారతదేశం

కొచ్చి (కొచ్చిన్) నగరం రాజధానిగా అదే పేరుతో ఉన్న రాజ్యం, కొచ్చిన్ రాజ్యం. ప్రస్తుత కేరళ రాష్ట్రానికి మధ్య భాగంలో ఉన్న రాజ్యం ఇది. 12వ శతాబ్దపు తొలి భాగంలో ప్రారంభమై, 1949 లో భారత డొమినియన్ రాచరికాలను రద్దు చేసే వరకు ఈ రాజ్యం కొనసాగింది.

చారిత్రికంగా కొచ్చిన్ రాజ్య రాజధాని కోడుంగల్లూర్‌లో ఉండేది. కానీ 1341లో వినాశకరమైన వరదల బారి నుండి తప్పించుకున్నాక, రాజధానిని కొచ్చిన్‌కి మార్చారు. 15వ శతాబ్దం ప్రారంభం నాటికి కొచ్చిన్ తనను తాను పూర్తిగా రక్షించుకునే సామర్థ్యాన్ని కోల్పోయింది. 15వ శతాబ్దం చివరి నాటికి కాలికట్ జామోరిన్ దండయాత్రల ఫలితంగా రాజ్య విస్తీర్ణం కనిష్ఠ స్థాయికి కుదించుకుపోయింది.

పోర్చుగీసు సైనిక దళాలు భారతదేశానికి వచ్చినప్పుడు జమోరిన్ల ధాటికి కొచ్చిన్ రాజ్యం, ఎడపల్లి, క్రాంగనోరే వంటి సామంతులను కోల్పోయింది. వీటిలో తరువాతిది చారిత్రికంగా రాజ్యానికి కేంద్రంగా కూడా ఉండేది. కొచ్చిన్ ప్రమాదంలో పడిన తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే అవకాశం కోసం చూస్తోంది. 1500 డిసెంబరు 24న రాజు ఉన్ని గోదా వర్మ పోర్చుగీసువాడైన పెడ్రో అల్వారెస్ కాబ్రాల్‌ను హృదయపూర్వకంగా స్వాగతించి, కాలికట్ జామోరిన్కు వ్యతిరేకంగా పోర్చుగల్, కొచ్చిన్ రాజ్యాల మధ్య కూటమి ఒప్పందాన్ని చర్చించాడు. ఈ ప్రాంతంలో పోర్చుగీస్ ఈస్ట్ ఇండీస్ నియంత్రణలో అనేక కోటలు నిర్మించారు. వీటిలో అత్యంత ముఖ్యమైనది ఫోర్ట్ మాన్యుయెల్. కొచ్చిన్, భారతదేశంలో స్థానిక, విదేశీ శక్తులకు వ్యతిరేకంగా సహాయం అందించే దీర్ఘకాలిక పోర్చుగీస్ రక్షిత రాష్ట్రంగా మారింది (1503 - 1663). లూసో - డచ్చి యుద్ధం తరువాత డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ (1663 - 1795) కొచ్చిన్ కు మిత్రరాజ్యంగా మారింది. దీని తరువాత 1809 మే 6న ఆంగ్లో - డచ్ యుద్ధం తరువాత కొచ్చిన్ రాష్ట్రంపై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ (1795 - 58) ఆధిపత్యం మొదలైంది.

ట్రావెన్కోర్ రాజ్యం కొచ్చిన్ రాజ్యంలో విలీనం అయ్యి 1950లో ట్రావెన్కోర్ - కొచ్చిన్ రాజ్యం ఏర్పాటైంది. విలావన్కోడె, కల్కులం, తోవలై, అగస్తీస్వరం, సెంగోట్టై అనే ఐదు తమిళ మెజారిటీ తాలూకాలను 1956లో ట్రావెన్కోర్ - కొచ్చిన్ నుండి మద్రాస్ రాష్ట్రానికి బదిలీ చేశారు.[2] ట్రావెన్కోర్ - కొచ్చిన్ లోని మలయాళం మాట్లాడే ప్రాంతాలు మలబార్ జిల్లాలో (లక్కదీవ్, మినికాయ్ దీవులు, మద్రాస్ రాష్ట్రంలోని దక్షిణ కెనరా జిల్లాలోని కాసరగోడ్ తాలూకాతో సహా) విలీనమయ్యాయి. భారత ప్రభుత్వ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం 1956 నవంబరు 1న ఆధునిక కేరళ రాష్ట్రం ఏర్పడింది.[2]

భూభాగాలు

[మార్చు]

1800 నుండి 1947 మధ్యకాలంలో కొచ్చిన్ రాజ్యంలో ఆధునిక త్రిస్సూర్ జిల్లాలో చావక్కడ్‌ను మినహాయించి చాలా భాగం, అలత్తూర్ తాలూకాలోని కొన్ని ప్రాంతాలు, పాలక్కాడ్ జిల్లాలోని చిత్తూరు తాలూకా మొత్తం, కొచ్చి తాలూకా (ఫోర్ట్ కొచ్చి మినహా), ఎడప్పల్లి మినహా కనాయన్నూర్ తాలూకా, ఆలువా తాలూకాలోని కరుకుట్టి, అంగమాలి, కలాడి, చౌవారా, కంజూర్, శ్రీమూలనగరం, మలాయత్తూర్, మంజప్రా లు, కున్నతునాడ్ తాలూకాలోని భాగాలు, ఇప్పుడు కేరళలో భాగమైన ఎర్నాకుళం జిల్లాలోని పరవూర్ తాలూకులోని భాగాలు (చెండమంగళం) ఉండేవి.

చరిత్ర

[మార్చు]

ప్రారంభ చరిత్ర

[మార్చు]

ఈ రాజ్యపు అసలు రాజధాని ప్రస్తుత మలప్పురం జిల్లాలోని పొన్నాని సమీపంలోని పెరుంపడప్పు వద్ద ఉండేది.[1] మధ్యయుగ ప్రారంభంలో, తిరునవయ యుద్ధం తరువాత కాలికట్ జామోరిన్ పొన్నాని, ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు పెరంపడప్పు పాలకుడు (పొన్నాని సమీపంలో) కోడుంగల్లూర్కు పారిపోయాడు.[1]

1341 వరదలు - రాజధాని మార్పు

[మార్చు]

1341లో వచ్చిన వరద కారణంగా వైపిన్ ద్వీపం ఏర్పడింది. కొచ్చిన్‌కు సహజ నౌకాశ్రయం ఏర్పడింది. దీని తరువాత రాజధాని కోడుంగల్లూర్ నుండి ప్రస్తుత కొచ్చిలోని వైపిన్కు మారింది.[3] అందువల్ల <i id="mwpg">పెరుమ్పడప్పు స్వరూపం</i> అనే రాజ్యం పేరును కొచ్చిన్ రాజ్యంగా మార్చారు.[1]

మింగ్ రాజవంశంతో పొత్తు (1411 - 1433)

[మార్చు]

కోళికోడ్ నౌకాశ్రయం మధ్యయుగ కేరళ తీరంలో ఉన్నతమైన ఆర్థిక, రాజకీయ స్థానాన్ని కలిగి ఉండగా, కన్నూర్, కొల్లాం, కొచ్చిలు వాణిజ్యపరంగా ముఖ్యమైన ద్వితీయ స్థాయి నౌకాశ్రయాలుగా ఉండేవి. ఇక్కడ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వ్యాపారులు గుమిగూడేవారు.[4] 15వ శతాబ్దం ప్రారంభంలో మలబార్ తీరంలో కాలికట్, కొచ్చిన్ ల మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉండడంతో, చైనాకు చెందిన మింగ్ రాజవంశం కొచ్చిన్ పాలకుడికి ప్రత్యేక హోదాను మంజూరు చేయడం ద్వారా జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ప్రాంతంలో కాలికట్ ప్రధాన ఓడరేవు నగరంగా ఉండగా, కానీ కొచ్చిన్ దాని ప్రధాన ప్రత్యర్థిగా ఉద్భవించింది.[5] ఐదవ మింగ్ నిధి సముద్రయానం కోసం అడ్మిరల్ జెంగ్ కొచ్చిన్ కు చెందిన కెయిలీ పేరిట ఒక ముద్ర వేయాలని, తన రాజ్యంలో ఒక పర్వతాన్ని దేశాన్ని రక్షించే జెంగువో జి షాన్ (పర్వతం) గా గుర్తించాలని ఆదేశించాడు.[5] జెంగ్, యోంగ్లే చక్రవర్తి స్వయంగా రచించిన ప్రకటనతో చెక్కబడిన ఒక రాతి పలకను కొచ్చిన్కు అందించాడు.[5] కొచ్చిన్ మింగ్ చైనా రక్షణలో ఉన్నంత కాలం కాలికట్ జామోరిన్ కొచ్చిన్పై దాడి చేయలేకపోయాడు. ఆ విధంగా సైనిక సంఘర్షణ నివారించబడింది.[5] మింగ్ నిధి ప్రయాణాలు ఆగిపోయాక, కాలికట్ జామోరిన్ కొచ్చిన్పై దండయాత్రను ప్రారంభించడంతో మళ్ళీ కొచ్చిన్కు చెడు కాలం వచ్చింది.[5] 15వ శతాబ్దం చివరలో జామోరిన్ కొచ్చిన్ను ఆక్రమించి తన ప్రతినిధిని రాజుగా నియమించాడు.[5]

పోర్చుగీస్ కూటమి (1500 - 1663)

[మార్చు]
మట్టన్చేరి ప్యాలెస్ - ఆలయం పోర్చుగీసు వారు మొదటి రాజా వీర కేరళ వర్మకు బహుమతిగా నిర్మించారు

పోర్చుగీసు వారు 1498లో కోళికోడ్ లోని కప్పడ్ చేరుకున్నారు. తద్వారా ఐరోపా నుండి భారతదేశానికి ప్రత్యక్ష సముద్ర మార్గం ప్రారంభమైంది.[6] భారతదేశంలో మొట్టమొదటి యూరోపియన్ స్థావరం కొచ్చిన్ లో ఉంది. 1500 సంవత్సరంలో పోర్చుగీస్ అడ్మిరల్ పెడ్రో అల్వారెస్ కాబ్రాల్ కాలికట్ నుండి తిప్పికొట్టబడిన తరువాత కొచ్చిన్ చేరుకున్నాడు. కొచ్చిన్ రాజు పోర్చుగీసులను స్వాగతించి, వారితో స్నేహ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కొచ్చిన్ లో ఒక కర్మాగారాన్ని నిర్మించడానికి రాజు వారిని అనుమతించాడు. కాబ్రాల్ నిష్క్రమణ తరువాత కొచ్చిన్, ముప్పై పోర్చుగీసు, నలుగురు ఫ్రాన్సిస్కాన్ సన్యాసులను రాజ్యంలో ఉండటానికి అనుమతించాడు. పోర్చుగీసు మద్దతుతో భరోసా పొందిన రాజు, తన శత్రువు కాలికట్ జామోరిన్లపై యుద్ధం ప్రకటించాడు.

1502లో వాస్కో డా గామా ఆధ్వర్యంలో ఒక కొత్త యాత్ర కొచ్చిన్ కు చేరుకుంది. వారి మధ్య స్నేహం పునరుద్ధరించుకున్నారు. ఆ తరువాత వాస్కో డా గామా కాలికట్ మీద బాంబు దాడి చేసి అక్కడ ఉన్న అరబ్ కర్మాగారాలను నాశనం చేశాడు. ఇది కాలికట్ పాలకుడైన జామోరిన్కు కోపం తెప్పించింది. వాస్కో డా గామా నిష్క్రమణ తర్వాత అతను కొచ్చిన్పై దాడి చేసి పోర్చుగీస్ కర్మాగారాన్ని నాశనం చేశాడు. కొచ్చిన్ రాజు, అతని పోర్చుగీస్ మిత్రరాజ్యాలు వైపిన్ ద్వీపానికి పారిపోవలసి వచ్చింది. అయితే, పోర్చుగీసు నౌకాదళానికి చెందిన చిన్న ఉపదళం రాక, ఆ తరువాత కొన్ని రోజులకు డువార్టే పచెకో పెరీరా రాక, చుట్టుముట్టిన రుతుపవనాలు జామోరిన్ను అప్రమత్తం చేశాయి. అతను కాలికట్ సైన్యాన్ని వెనక్కి పిలిపించి ముట్టడిని విడిచిపెట్టాడు.

కొచ్చిన్ రాజాకు సింహాసనాన్ని అందించిన తరువాత పోర్చుగీసు వారు ఒక కోటను నిర్మించడానికి అనుమతి పొందారు. అదే ఇమ్మాన్యుయేల్ కోట (పోర్చుగల్ రాజు పేరు పెట్టబడిన కొచ్చి కోటలో). 1503 సెప్టెంబరు 27 న పోర్చుగీస్ ఫ్యాక్టరీని కాలికట్ నుండి తదుపరి దాడుల నుండి రక్షించడానికి దాని చుట్టూ కలప కోటకు పునాదులు వేసారు. భారతదేశంలో పోర్చుగీసు నిర్మించిన మొదటి కోట అది. నిర్మాణ పనులన్నింటినీ స్థానిక రాజాలు ప్రారంభించారు. వారు కార్మికులను, సామగ్రినీ సరఫరా చేశారు. 1505 లో చెక్క కోట స్థానంలో రాతి కోట వచ్చింది. తరువాత పట్టణాన్ని మెరుగ్గా రక్షించడానికి వైపీన్ ద్వీపంలో కాస్టెలో డి సిమా అనే కోటను నిర్మించారు. పోర్చుగీస్ నౌకాదళం తిరిగి వెళ్తూ, డువార్టే పచెకో పెరీరాను, ఒక చిన్న నౌకాదళాన్నీ మాత్రమే కొచ్చిలో ఉంచి వెళ్ళారు. ఇంతలో కాలికట్ జామోరిన్ భారీ బలగాన్ని సమకూర్చుకుని వారిపై దాడి చేశాడు. పాచెకో పెరీరా, అతని మనుషుల సహాయంతో ఐదు నెలల పాటు కొచ్చిన్ రాజ్యం కాలికట్ దాడులను తిప్పికొట్టగలిగింది.

కొచ్చిన్ రాజు పోర్చుగీసు వారి సహాయంతో పాలన కొనసాగించాడు. ఇంతలో పోర్చుగీసు వారు రహస్యంగా జామోరిన్ తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. తరువాత కొచ్చిన్ నౌకాశ్రయాన్ని జయించడానికి జామోరిన్ చేసిన కొన్ని ప్రయత్నాలను పోర్చుగీసు వారి సహాయంతో కొచ్చిన్ రాజు అడ్డుకున్నాడు. కొచ్చిన్ ను రక్షించడంలో రాజుకు సహాయపడటానికి కొచ్చిన్ వద్ద పోర్చుగీస్ ఆయుధాగారాన్ని క్రమంగా వృద్ధి చేసారు. గోవా తరువాత చాలా కాలం పాటు ఈస్ట్ ఇండీస్ మధ్యలో ఉన్న కొచ్చిన్, భారతదేశంలో పోర్చుగల్ కు ఉన్న ఉత్తమ నెలవు. అక్కడి నుండి పోర్చుగీసు వారు పెద్ద మొత్తంలో సుగంధ ద్రవ్యాలను, ముఖ్యంగా మిరియాలను, ఎగుమతి చేసేవారు.

1530లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వచ్చి లాటిన్ క్రిస్టియన్ మిషన్ను స్థాపించాడు. పోర్చుగీసు వైస్రాయ్ వాస్కో డా గామా సమాధి కొచ్చిన్ లో ఉంది. అతని అవశేషాలను, 1539లో పోర్చుగల్ కు తిరిగి పంపే వరకు, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చిలో ఖననం చేసారు. అఫోన్సో డి అల్బుకెర్కీ కాలం తరువాత కేరళలో పోర్చుగీసు ప్రభావం తగ్గింది.[7]

డచ్చి కూటమి (1663 - 1766)

[మార్చు]
1744లో డచ్ వ్యాపారులు నిర్మించిన బోల్గట్టి ప్యాలెస్ నెదర్లాండ్స్ వెలుపల ఉన్న పురాతన డచ్ రాజభవనాలలో ఒకటి.

పోర్చుగీసు తోను, వారి మిత్రపక్షాల తోనూ వివిధ పోరాటాల తరువాత క్విలన్ను స్వాధీనం చేసుకున్న డచ్ వారు పోర్చుగీస్ కూటమిని అనుసరించారు. కొచ్చిన్ రాజకుటుంబంలోని అసంతృప్త సభ్యులు కొచ్చిన్ రాజాను పడగొట్టడంలో సహాయం కోసం డచ్ సహాయం కోసం పిలుపునిచ్చారు. డచ్ వారు విజయవంతంగా న్జారకల్ వద్ద దిగి, పల్లిప్పురం వద్ద ఉన్న కోటను స్వాధీనం చేసుకుని, దానిని జామోరిన్కు అప్పగించారు.

మైసూరు దండయాత్ర (1766 - 1799)

[మార్చు]

మైసూరు పాలకుడు హైదర్ అలీ కొచ్చిన్ను జయించాడు. 1763లో బెడ్నూర్ను జయించిన తరువాత కన్నానూర్కు చెందిన అలీ రాజాను కలిసాడు. వెంటనే కేరళపై దాడి చేసి కాలికట్ జామోరిన్ తో యుద్ధంలో తనకు సహాయం చేయమని అలీని కోరాడు. పొరుగున ఉన్న శక్తివంతమైన కోలతిరి పాత ప్రత్యర్థి అయిన కన్ననూర్ ముస్లిం నాయకుడు మైసూరుకు మంచి మిత్రుడు.

అలీ రాజా కోలత్తిరి రాజ రాజభవనాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని తగలబెట్టాడు. తరువాతి తన అనుచరులతో కలిసి తెలిచెర్రీలోని అప్పటి బ్రిటిష్ స్థావరానికి పారిపోయాడు. విజయం తరువాత అలీ ప్రస్తుత ఉత్తర మలబార్ లోని కొట్టాయం రాజ్యంలో ప్రవేశించి, కొట్టాయం సైన్యం నుండి కొంత ప్రతిఘటన ఎదుర్కొని తరువాత స్థానిక ముస్లింల సహాయంతో దానిని ఆక్రమించాడు.

రక్తపాత యుద్ధంలో కాలికట్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత అలీ, పెద్ద మొత్తంలో డబ్బుతో పాల్ఘాట్ మీదుగా ఆగ్నేయ దిశలో కోయంబత్తూర్ వైపు తరలాడు. మైసూరు రాజ్యం, ఆలీ రాజాను సైనిక గవర్నరుగాను, మడోన్నాను (మాజీ రెవెన్యూ అధికారి) కొత్తగా స్వాధీనం చేసుకున్న మలబార్ ప్రావిన్సుకు సివిల్ గవర్నరుగానూ నియమించింది.

బ్రిటిష్ సంస్థానంగా

[మార్చు]

1814లో ఆంగ్లో - డచ్ ఒప్పందం ప్రకారం కొచ్చి కోట, దాని భూభాగంతో సహా కొచ్చి దీవులను బాంకా ద్వీపానికి బదులుగా యునైటెడ్ కింగ్డమ్‌కు అప్పగించారు. ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే కొచ్చిలో ఆంగ్లేయులు నివసించినట్లు ఆధారాలు ఉన్నాయి.[8] బ్రిటిష్ పాలన కాలంలో కొచ్చిన్ సంస్థానాన్ని మూడు వైపుల బ్రిటిష్ పాలన లోని మలబార్ జిల్లా, తూర్పున, దక్షిణాన ట్రావెన్కోర్ చుట్టుముట్టి ఉండేవి.[8] 20వ శతాబ్దం ప్రారంభంలో ఓడరేవు వద్ద వాణిజ్యం గణనీయంగా పెరిగింది. రాజు ఓడరేవును మరింత అభివృద్ధి చేయాలనుకున్నాడు. అప్పటి మద్రాసు గవర్నర్ లార్డ్ విల్లింగ్డన్ సహాయంతో రాజు 1920లో ఒక నౌకాశ్రయ ఇంజనీర్ రాబర్ట్ బ్రిస్టోను కొచ్చిన్ రప్పించాడు. 21 సంవత్సరాల కాలంలో అతను కొచ్చిన్ను దక్షిణ ఆసియాలో అత్యంత సురక్షితమైన నౌకాశ్రయంగా మార్చడానికి కొచ్చిన్ రాజుకు సహాయం చేశాడు. కొత్తగా నిర్మించిన అంతర్గత నౌకాశ్రయంలో పొడవైన ఆవిరి క్రేన్లు ఉండేవి. వరుసగా నౌకలు నిలబడి ఉండేవి.[9]

ఇంతలో 1956 వరకు మలబార్ జిల్లాలో భాగంగా ఉన్న కొచ్చిన్ కోటను 1866 నవంబరు 1న కన్నూర్ తలస్సేరి కోళికోడ్, పాలక్కాడ్ లతో పాటు మునిసిపాలిటీగా మార్చారు. 1883లో 18 మంది సభ్యుల బోర్డుతో మొదటి మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి.[10][11][12][13] కొచ్చిన్ మహారాజు 1896లో మట్టన్చేరి, ఎర్నాకుళం పట్టణ మండళ్లను ఏర్పాటు చేసి, స్థానిక పరిపాలనను ప్రారంభించాడు. పరిపాలనలో ప్రజలు పాల్గొనడానికి 1925లో కొచ్చి శాసనసభ కూడా ఏర్పాటు చేసాడు. ఈ అసెంబ్లీలో 45 మంది సభ్యులు ఉండేవారు. వీరిలో 10 మంది అధికారికంగా నామినేట్ చేయబడినవారు. తొట్టక్కట్టు మాధవియమ్మ, భారతదేశంలో ఏ శాసనసభలోనైనా సభ్యురాలైన మొదటి మహిళ.[14]

1947లో కొత్త డొమినియన్ ఆఫ్ ఇండియాలో ఇష్టపూర్వకంగా చేరిన మొదటి రాచరిక రాష్ట్రం కొచ్చిన్.[15] 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ట్రావెన్కోర్ కొచ్చిలో విలీనం అయ్యి ట్రావెన్కోర్ - కొచ్చిన్ ను ఏర్పడింది. ఇది మద్రాస్ ప్రెసిడెన్సీలోని మలబార్ జిల్లాతో ఏకీకృతం చేయబడింది. కాసరగోడ్‌ను దానిలో విలీనం చేసారు. కన్యాకుమారిని దాని నుండి తీసేసారు. 1956 నవంబరు 1న భారత రాష్ట్రమైన కేరళ ఏర్పడింది.[16]

పరిపాలన

[మార్చు]

పరిపాలనా ప్రయోజనాల కోసం కొచ్చిన్ రాజ్యాన్ని ఏడు తాలూకాలుగా విభజించారు (క్రీ. శ. 1860 నుండి 1905 వరకు). అవి: చిత్తూరు, కొచ్చిన్, క్రాంగనోర్, కనాయన్నూర్, ముకుందపురం, త్రిచూర్, తలపిల్లి.

తాలూకా విస్తీర్ణం (చదరపు మైళ్ళలో) ప్రధాన కార్యాలయం
చిత్తూరు 285 చిత్తూరు
కొచ్చిన్ 63 మట్టన్చేరి
క్రాంగనోర్ 19. క్రాంగనోర్ (ఇప్పుడు కొడుంగల్లూర్)
కనాయన్నూర్ 81 ఎర్నాకుళం
ముకుందపురం 418 ఇరింజలకుడ
తలపల్లి 271 వడక్కంచేరి
త్రిచూర్ 225 త్రిచూర్ (ఇప్పుడు త్రిస్సూర్)
మొత్తం 1,362

కొచ్చిన్ మహారాజుల జాబితా

[మార్చు]

చేరమాన్ పెరుమాళ్ మేనల్లుడు వీరకేరళ వర్మ కొచ్చిన్ మొదటి మహారాజు అని భావిస్తున్నారు. అయితే రాజవంశపు లిఖిత రికార్డులు క్రీ. శ. 1503 నాటి నుండే ఉన్నాయి. కొచ్చిన్ మహారాజును అన్ని దేవాలయాలకు అధిపతి అని అర్ధం వచ్చే గంగాధర కోవిల్ అధికారికల్ అని కూడా పిలిచేవారు.[17]

రామ వర్మ XIV 1868లో కొచ్చిన్ రాజ
రామ వర్మ XV, ఆయన అబ్దికేటెడ్ హైనెస్ గా ప్రసిద్ధి చెందారు
మహారాజా కేరళ వర్మ తమ్పురాన్ ఎ. కె. ఎ.<br id="mwAcY"><br><br><br> ఐక్య కేరళ తంపురాన్

పోర్చుగీసు మిత్రదేశంగా

[మార్చు]
  1. రెండవ ఉన్నీరామన్ కొయికల్ (1503 - 1537)
  2. మొదటి వీర కేరళ వర్మ (1537 - 1565)
  3. కేశవ రామ వర్మ (1565 - 1601)
  4. వీర కేరళ వర్మ II (1601 - 1615)
  5. మొదటి రవివర్మ (1615 - 1624)
  6. వీర కేరళ వర్మ III (1624 - 1637)
  7. మొదటి గోడు వర్మ (1637 - 1645)
  8. వీరరాయిర వర్మ (1645 - 1646)
  9. వీర కేరళ వర్మ IV (1646 - 1650)
  10. మొదటి రామ వర్మ (1650 - 1656)
  11. రాణి గంగాధరలక్ష్మి (1656 - 1658)[18]
  12. రెండవ రామ వర్మ (1658 - 1662)
  13. రెండవ గోడా వర్మ (1662 - 1663)

డచ్ మిత్రదేశంగా

[మార్చు]
  1. వీర కేరళ వర్మ V (1663 - 1687)
  2. మూడవ రామ వర్మ (1687 - 1993)
  3. రెండవ రవివర్మ (1693 - 1697)
  4. రామ వర్మ IV (1697 - 1701)
  5. ఐదవ రామ వర్మ (1701 - 1721)
  6. మూడవ రవివర్మ (1721 - 1731)
  7. ఆరవ రామ వర్మ (1731 - 1746)
  8. కేరళ వర్మ I (1746 - 1749)
  9. రామ వర్మ VII (1749 - 1760)
  10. కేరళ వర్మ II (1760 - 1775)
  11. రామ వర్మ VIII (1775 - 1790)
  12. రామ వర్మ IX (శక్తన్ తమ్పురాన్) (1790 - 1805)

బ్రిటిష్ రాచరిక రాజ్యంగా

[మార్చు]
  1. రామ వర్మ X (1805 - 1809) - వెల్లారపల్లి - యిల్ తీపెట్ట తమ్పురాన్ (వెల్లారపాలిలో మరణించిన రాజు)
  2. మూడవ కేరళ వర్మ (వీర కేరళ వర్మ) (1809 - 28) - కర్కిడక మాసతిల్ తీపెట్ట తమ్పురాన్ (కర్కిడక నెలలో మరణించిన రాజు)
  3. రామ వర్మ XI (1838 - 1837) - తులం - మాసతిల్ తీపెట్టా తమ్పురాన్ (తులం మాసంలో మరణించిన రాజు)
  4. రామ వర్మ XII (1837 - 1844) - ఎడవ - మాసతిల్ తీపెట్టా తమ్పురాన్ (ఎడవం మాసంలో మరణించిన రాజు)
  5. రామ వర్మ XIII (1844 - 1851) - త్రిశూర్ - ఇల్ తీపెట్టా తమ్పురాన్ (త్రిశివపెరూర్ లేదా త్రిశూర్లో మరణించిన రాజు)
  6. నాలుగో కేరళ వర్మ (వీర కేరళ వర్మ) (1851 - 1853) - కాశీ - యిల్ తీపెట్టా తమ్పురాన్ (కాశీ లేదా వారణాసిలో మరణించిన రాజు)
  7. నాలుగవ రవివర్మ (1853 - 1864) - మకర మాసతిల్ తీపెట్టా తమ్పురాన్ (మకరం మాసంలో మరణించిన రాజు)
  8. రామ వర్మ XIV (1864 - 1888) - మిథున మాసతిల్ తీపెట్టా తమ్పురాన్ (మిథునం మాసంలో మరణించిన రాజు)
  9. కేరళ వర్మ V (1888 - 1895) - చింగమ్ మాసతిల్ తీపెట్టా తమ్పురాన్ (చింగమ్ మాసంలో మరణించిన రాజు)
  10. రామ వర్మ XV (సర్ శ్రీ రామ వర్మ) (1895 - 19 14) - రాజర్షిహిహిహిహినిస్ట్గా పిలువబడే (1932లో మరణించారు)
  11. రామ వర్మ XVI (1914 - 1932) - మద్రసిల్ తీపెట్టా తమ్పురాన్ (మద్రాసు లేదా చెన్నైలో మరణించిన రాజు)
  12. రామ వర్మ XVII (1932 - 1941) - ధర్మిక చక్రవర్తి (ధర్మ చౌరా - యిల్ తీపెట్టా తమ్పురాన్ రాజు)
  13. కేరళ వర్మ VI (1941 - 1943) - మిడుక్కన్ తమ్పురాన్
  14. రవి వర్మ V (రవి వర్మ కుంజప్పన్ తమ్పురాన్) (1943 - 1946) - కుంజప్పన్ తంబురాన్ (మిడుక్కన్ తమ్పురన్ సోదరుడు)
  15. కేరళ వర్మ VII (1946 - 1948) - ఐక్య కేరళం తమ్పురాన్ (కేరళను ఏకం చేసిన రాజు)
  16. రామ వర్మ XVIII (1948 - 1964) ను పరీక్షిత్ తమ్పురాన్ అనే పేరుతో పిలిచేవారు. ఆయన కొచ్చిన్ సంస్థానానికి చివరి అధికారిక పాలకుడు. 1949లో ఆయన భారత యూనియన్లో చేరడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఏకీకరణ మరో సంవత్సరంలో పూర్తయింది.

స్వాతంత్య్రానంతరం (నామమాత్రం)

[మార్చు]
  1. రామ వర్మ XVIII (1948 - 1964) ను పరీక్షిత్ తమ్పురాన్ అనే పేరుతో పిలిచేవారు.
  2. రామ వర్మ XIX (1964 - 1975) - లాలన్ తంబురాన్ - ఇందిరా గాంధీ ప్రభుత్వం 1971లో భారత రాజ్యాంగం 26వ సవరణ కింద అధికారిక గుర్తింపును తొలగించింది.
  3. రామ వర్మ XX (1975 - 2004) - అన్యన్ కొచున్ని తమ్పురాన్
  4. కేరళ వర్మ VIII (2004 - 2011) - కొచున్ని తమ్పురాన్
  5. రామ వర్మ XXI (2011 - 2014) - కొచనియన్ తమ్పురాన్
  6. ఆరవ రవివర్మ (2014 - 2020) - కొచనియన్ తంబురాన్
  7. రవివర్మ (2020 - ప్రస్తుతం)

కొచ్చిన్ ప్రధాన మంత్రులు (1947 - 1949)

[మార్చు]
No.[a] పేరు. చిత్రం పదవీకాలం[19] పార్టీ అసెంబ్లీ నియమించారు

(మొనార్క్యూ)

నుండి. కు. ఆఫీసులో రోజులు
1. పనంపిల్లి గోవింద మీనన్ 1947 ఆగస్టు 14 1947 అక్టోబరు 22 51 రోజులు స్వతంత్రంగా ఆరవ కౌన్సిల్

(1945 - 1948)

కేరళ వర్ణ VII

కొచ్చిన్ మహారాజు

2. టి. కె. నాయర్ 1947 అక్టోబరు 27 1948 సెప్టెంబరు 20 334 రోజులు
3. ఇ. ఇక్కండ వారియర్ 1948 సెప్టెంబరు 20 1949 జూన్ 30 283 రోజులు శాసనబద్ధం

అసెంబ్లీ

(1948 - 1949)

మాతృస్వామ్య వారసత్వం

[మార్చు]

కొచ్చిన్ రాజ కుటుంబం మరుమక్కటయం అని పిలువబడే మాతృస్వామ్య వారసత్వ వ్యవస్థను అనుసరించింది.సాంప్రదాయకంగా కుటుంబంలోని మహిళా సభ్యులు నంబూదిరి బ్రాహ్మణులతో వివాహం చేసుకుంటారు. పురుష సభ్యులు సమంతన్ నాయర్ తరగతికి చెందిన మహిళలను వివాహం చేసుకుంటారు. మాతృవంశ వ్యవస్థ ప్రకారం ఈ పురుషుల భార్యలు రాణులు కారు. వీళ్ళు నేత్యార్ అమ్మ అనే బిరుదు పొందుతారు.[20]

గమనికలు

[మార్చు]
  1. A parenthetical number indicates that the incumbent has previously held office.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 A Survey of Kerala History, A. Sreedhara Menon, DC Books, Kottayam (2007)
  2. 2.0 2.1 "The States Reorganisation Act, 1956" (PDF). legislative.gov.in. Government of India.
  3. "Kingdom of Cochin & the Cochin Royal Family. Genealogy project".
  4. The Portuguese, Indian Ocean and European Bridgeheads 1500–1800. Festschrift in Honour of Prof. K. S. Mathew (2001). Edited by: Pius Malekandathil and T. Jamal Mohammed. Fundacoa Oriente. Institute for Research in Social Sciences and Humanities of MESHAR (Kerala)
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 Sen, Tansen (2016). "The Impact of Zheng He's Expeditions on Indian Ocean Interactions". Bulletin of the School of Oriental and African Studies. 79 (3): 609–636. doi:10.1017/S0041977X16001038..
  6. DC Books, Kottayam (2007), A. Sreedhara Menon, A Survey of Kerala History
  7. Kerala.com (2007). "Kerala History". Archived from the original on 10 January 2008. Retrieved 7 January 2008.
  8. 8.0 8.1 Kochi Rajyacharithram by KP Padmanabha Menon. P(1914)
  9. "The Cochin Saga". Robert Charles Bristow employed to develop Kochi port. Corporation of Kochi. Archived from the original on 3 May 2006. Retrieved 23 May 2006.
  10. "CHRONOLOGICAL LIST OF CENTRAL ACTS (Updated up to 17-10-2014)". Lawmin.nic.in. Archived from the original on 7 January 2018. Retrieved 2016-08-07.
  11. Lewis McIver, G. Stokes (1883). Imperial Census of 1881 Operations and Results in the Presidency of Madras ((Vol II) ed.). Madras: E.Keys at the Government Press. p. 444. Retrieved 5 December 2020.
  12. Presidency, Madras (India (1915). Madras District Gazetteers, Statistical Appendix For Malabar District (in ఇంగ్లీష్) (Vol.2 ed.). Madras: The Superintendent, Government Press. p. 20. Retrieved 2 December 2020.
  13. HENRY FROWDE, M.A., Imperial Gazetteer of India (1908–1909). Imperial Gazetteer of India (New ed.). Oxford: Clarendon Press. Retrieved 2 December 2020.
  14. "History and culture of Kochi". Corporation of Kochi. Archived from the original on 3 May 2006. Retrieved 23 May 2006.
  15. "Instrument of Accession of the State of Cochin". Cochin State- Instrument of Accession and Standstill Agreement signed between Kerala Varma, Ruler of Cochin State and the Dominion of India. New Delhi: Ministry of States, Government of India. 1947. p. 2. Retrieved 31 August 2022 – via National Archives of India.
  16. PBS (2007). "Hidden India:The Kerala Spicelands". PBS. Retrieved 7 January 2008.
  17. Thampuran, Rameshan (2007). "Emergence Of Kingdom of Cochin and Cochin Royal Family". Archived from the original on 13 January 2008. Retrieved 6 January 2008.
  18. Education, Kerala (India) Department of; Menon, A. Sreedhara (1965). Kerala District Gazetteers: Ernakulam (in ఇంగ్లీష్). Superintendent of Government Presses. p. 128.
  19. Responsible Governments (1947–56). Kerala Legislature. Retrieved on 22 April 2014.
  20. Staff Correspondent (3 March 2003). "Seeking royal roots". The Hindu. Archived from the original on 22 October 2010. Retrieved 5 January 2012.