కాలడి
| ?కాలడి కేరళ • భారతదేశం | |
| అక్షాంశరేఖాంశాలు: 10°09′58″N 76°26′20″E / 10.1661°N 76.4389°E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| జిల్లా (లు) | ఎర్నాకుళం జిల్లా |
కాలడి (మళయాళం: കാലടി / అడుగుజాడ ) కేరళ రాష్ట్రంలో పెరియార్ నది ఒడ్డున ఎర్నాకుళం జిల్లాలోని పల్లెటూరు. ఇక్కడే ఆది శంకరాచార్యుడు జన్మించాడు[1]. ఇదొక హిందూ పుణ్యక్షేత్రము. కేరళలో ఎర్నాకులం జిల్లాలో గురువాయూర్ కు 75 కిలోమీటర్ల దూరంలో కాలడి గ్రామం ఉంది. ఇదే జగద్గురువులు ఆది శంకరాచార్యులు జన్మించిన పవిత్ర క్షేత్రం. ఇక్కడి నుండే కాలి నడకన ఆసేతు హిమాచల పర్యంతం అనేక సార్లు తిరిగి నాలుగు ఆమ్నాయ పీఠాలు స్తాపించి ఆర్షధర్మాన్ని నిలబెట్టారు. వైదిక మతోద్ధారణ చేశారు. అద్వైతమత స్థాపనాచార్యులుగా కీర్తి శిఖరాన్ని అధిరోహించారు. పరమవిశిష్టమైన కాశ్మీర్ శారదా పీఠాన్ని సమర్ధత నిరూపించి శారదామాత అంగీకారంతో అధిరోహించి జగద్గురువు లనిపించుకొన్నారు. ఆ మహానుభావుడే లేకపోతే చైనా, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న భారతదేశ ప్రజలు ధర్మానికి దూరమైపోయి ఉండేవారు. కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లాలో పెరియార్ నదికి తూర్పున ఉంది. ఈ గ్రామాన్ని గుర్తుపట్టటం మొదట పెద్ద సమస్యగా మారింది. అప్పుడు శృంగేరి పీఠంవారు మహాపండితుడు, చారిత్రక పరిశోధకుడు, శంకరుల జీవితంపై నిష్ణాతుడు అయిన నడుకావేరి శ్రీనివాసశాస్త్రిని కాలడికి పంపారు[2]. అసలు ఆదిశంకరుల జన్మస్థలాన్ని అన్ని ఆధారాలతో తేల్చమని పంపారు. అతను ఇక్కడికి వచ్చి పరిశీలనా పరిశోధన చేసి కైఫీయత్తులను తిరగవేసి ఇప్పుడు శ్రీ శంకరుల దేవాలయం కట్టబడిన ప్రదేశమే అసలైన ఆదిశంకరుల జన్మక్షేత్రం అని నిర్ధారించి ఋజువులతో సహా తెలియజేశారు.

అప్పుడు ఈ ప్రదేశం అంతా ‘’కప్పిల్లి మన‘’ అనే కుటుంబం స్వాధీనంలో ఉండేది .ఈ విషయాన్ని శృంగేరి వారు తిరువాన్కూర్ మహారాజా వారికి తెలియ జేశారు. ఆ స్థలాన్ని తమకు ఇస్తే అక్కడ శంకర ఆలయం నిర్మించి స్మృతిచిహ్నంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మహారాజు మహదానందం పొంది’’ కప్పిల్లి మన’’ వారి నుంచి 1905లో ఈ ప్రాంతాన్ని స్వాధీన పరచుకుని శృంగేరి పీఠానికి అప్పగించాడు. శృంగేరిమఠం ఇక్కడ 1910 లో శ్రీ ఆదిశంకరుల ఆలయాన్ని నిర్మించింది. అదే కాలడి ఆవిర్భావ సంవత్సరంగా భావించారు. సరిగ్గా వంద ఏళ్ళకు 2010లో కాలడి శతవత్సర ఉత్సవాలను పీఠం ఘనంగా నిర్వహించింది. ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని పీఠం నిర్మించి ప్రచారంలోకి తెచ్చింది. లేకపోతే కాలడి అలాగే చరిత్ర గర్భంలో కలిసిపోయి ఉండేదేమో!

దేవాలయాలు, ఆధ్యాత్మిక నిర్మాణాలు
[మార్చు]శంకర దేవాలయం
[మార్చు]శ్రీ ఆదిశంకరులు కాలడిలో శివగురు, ఆర్యాంబ అను నంబూతిరి దంపతులకు ఏకైక పుత్రుడుగా జన్మించారు[1]. కాలడిలో శృంగేరి పీఠంవారు శంకరాచార్యుల వారి దేవాలయాన్ని నడుపుతున్నారు. ఈ శంకరుల ఆలయం పెరియార్ (పూర్ణా) నది ఉత్తరతీరములో ఉన్న విశాలమైన పాక్షిక బహిరంగ నిర్మాణం. ఈ ఆలయంలో రెండు మందిరాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీ శంకరాచార్యుల వారి మందిరం. రెండవది శారదాంబ మందిరం. శారదాంబ శృంగేరిలో ముఖ్యదేవత. ఇక్కడ శ్రీ శంకరాచార్యుల తల్లి ఆర్యాంబ వారి సమాధి కూడా ఉంది. ఇక్కడనే ఉన్న గణపతి మందిరంలో ప్రతి సాయంకాలం ప్రార్థనాగీతాలను చేతాళముల ధ్వనులతో లయబద్ధంగా ఆలపిస్తారు. ఈ ఆలయాల్లో పూజలను తమిళ, లేక, కన్నడ స్మార్తబ్రాహ్మణులు నిర్వహిస్తారు, నంబూతిరులు పూజలు నిర్వహించరు.
రామకృష్ణ అద్వైతాశ్రమం.
[మార్చు]రామకృష్ణ అద్వైత ఆశ్రమంలో బేలూరు మఠంలో గల శ్రీ రామకృష్ణ ఆలయపు నమూనాలో కట్టిన విశాలమైన ప్రార్థనా మండపము, మందిరం ఉన్నాయి. ఈ ఆశ్రమంలో ‘బ్రహ్మానందోదయం’ అనే పాఠశాలను[3], ఒక ఉచిత వైద్యశాలను, ఒక గ్రంథాలయాన్ని నడుపుతున్నారు.
ఆదిశంకర కీర్తిస్తంభ మండపం
[మార్చు]
శ్రీ ఆదిశంకర కీర్తిస్తంభ మండపం కంచి కామకోటి మఠం నిర్మించిన ఎనిమిది అంతస్తుల స్మారకం. స్మారక ప్రవేశ ద్వారమునకు, రెండు ఏనుగు విగ్రహాలు కాపలాగా చెరొక పక్కన ఉంటాయి. ఈ ద్వారం పాదుకా మండపం వైపు వెళుతుంది. రెండు వెండి గుబ్బలు గురువు పాదుకలను (చెక్క చెప్పులను)
సూచిస్తాయి. స్మారకపు గోడలపై ఆదిశంకరాచార్యుల కథను చెప్పే చట్రాలలో బిగించిన ఉబ్బెత్తు వర్ణచిత్రాలు (ఫ్రేమ్డ్ రిలీఫ్ పెయింటింగ్స్) అమర్చబడి ఉన్నాయి.[4] ఈ వర్ణచిత్రాలు ఆదిశంకరులు ప్రోత్సహించిన శైవం, వైష్ణవం, శాక్తం, గాణపత్యం, సౌరం, కౌమారం అను షణ్మతములను కూడ వర్ణిస్తాయి. ఈ ఆరు మతాలు సనాతన ధర్మంలో వివిధ శాఖలు. గణపతి, ఆదిశంకరులు, అనేక ఇతర విగ్రహాలు కూడా ఈ స్మారకచిహ్నంలో ఉన్నాయి. కలాడిలోని ఆదిశంకర మందిరాలు మతంతోను, కులంతోను సంబంధం లేకుండా యాత్రికులందరికీ తెరిచి ఉంటాయి. సందర్శకులు శంకరాచార్య జీవితాన్ని పైకి ఎక్కినప్పుడు వీక్షించవచ్చు[4].
శ్రీకృష్ణ దేవాలయం
[మార్చు]
శృంగేరి మఠమునకు పశ్చిమంగా శ్రీకృష్ణ దేవాలయం ఉంది. ఈ దేవాలయ దైవము శ్రీ శంకరాచార్యుల వారి కులదైవముగా శ్రీ శంకరాచార్యులు వారి ‘ప్రబోధ సుధాకరం’ 243 వ శ్లోకంలో పేర్కొనబడింది. ఈ శ్రీకృష్ణ దేవాలయం కాలడి దేవస్థానంవారి యాజమాన్యంలో, ఆదిశంకరులకు దగ్గఱవారైన రెండు నంబూతిరి కుటుంబాల ధర్మకర్తృత్వంలో ఉంది. ఈ ఆలయం ఒక్కటే శంకరుల కాలం నుండి నిలిచి ఉన్న కట్టడం[5]. నంబూతిరులే ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.
మాణిక్యమంగళం కాత్యాయిని దేవాలయం
[మార్చు]కాలడికి ఒక కిలోమీటర్ దూరంలో మాణిక్యమంగళంలో శ్రీ కాత్యాయిని మాత దేవాలయం ఉంది[6]. ఇది దుర్గామాత ఆలయం. ఇక్కడే శంకరుల బాల్యంలో తండ్రి శివశర్మ ఏదో పనిమీద వెళుతూ కొడుకుకు అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టిరమ్మని పంపాడు. అలానే బాలశంకరుడు అమ్మవారి ముందు పాలచెంబు ఉంచి నైవేద్యం పెట్టి తాగమని గోల చేశాడు అమ్మ వారు తాగకపోయేసరికి ఏడుపు లంకించుకొన్నాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఆ క్షీరాన్ని తృప్తిగా త్రాగి శంకరులకు ఆనందాన్ని కలిగించింది[6]. ఈ అమ్మవారి గురించే తరువాత ‘’సౌందర్య లహరి’’ వ్రాశారు శంకరాచార్య.
మట్టూరు తిరువెల్లమాన్ తుల్లి శివాలయం
[మార్చు]కాలడికి రెండు కిలోమీటర్ల దూరంలో ‘’మట్టూరు తిరు వెల్లమాన్ శివ దేవాలయం’’ ఉంది. దీన్ని శంకరుల తండ్రి శివశర్మ ప్రతిష్టించాడు .ముసలితనంలో శంకరుని తల్లిదండ్రులు ఇంత దూరం వచ్చి పూజాదికాలు చేయలేక శివుడిని ప్రార్ధించారు. అప్పుడు కలలో కనకనిపించి ‘’నాట్యం చేసే తెల్లజింక ‘’ను అనుసరించి వెళితే తన లింగం దగ్గరకు చేరుస్తుందని చెప్పాడు. అలానే రోజూ చేసేవారు. అందుకే ఈ గుడికి ‘’తిరు వెల్లమాన్ తుల్లి ‘’ అనే పేరు వచ్చింది[7]. అంటే ‘’నాట్యం చేసే తెల్లజింక ‘ ’అని అర్ధం .
నయతోడు శంకరనారాయణ దేవాలయం
[మార్చు]నయతోడు శంకరనారాయణ దేవాలయం కాలడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అద్వైత అర్చనకు గొప్పస్థానంగా ప్రసిద్ధమైంది. ఈ శివాలయంలో శంకరాచార్య విష్ణువును ప్రార్ధిస్తే ఆయన ప్రత్యక్షమై ఇక్కడి శివునిలో కలిసిపోయి శివ కేశవులకు భేదం లేదని నిరూపించిన గొప్ప క్షేత్రం ఇది[8]. అందుకే ఇక్కడ ముందు శివుడికి తర్వాత విష్ణువునకు అర్చన నిర్వహిస్తారు.
తెక్కె మధోం
[మార్చు]తెక్కే మధోం (మళయాళం: തെക്കേമഠം) శ్రీ కృష్ణ దేవాలయానికి సమీపంలో ఉంది. దీనిని శ్రీ శంకరాచార్య త్రిస్సూర్ లో స్థాపించారు[9]. శ్రీ శంకరాచార్యులపై గౌరవంతో ఈ మఠానికి శంకరాచార్యుల కులదైవము గల శ్రీ కృష్ణ దేవాలయపు పూజల బాధ్యత 825 లో ఇవ్వడం జరిగింది. ఈ మఠనిర్వహణ గుత్తాధిపత్యానికి కాలడి దేవస్వము భూములు సమకూర్చింది. ఈ మఠానికి కావడిలో 1730 లో రాచహక్కులు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా శంకర సంకేతపు పరిధులు నిర్ణయించబడ్డాయి. శ్రీ శంకరుల సాంప్రదాయంలో ఉన్న ఈ మఠము మాత్రమే కాలడి గౌరవ ప్రతిష్టలను పవిత్రతను శతాబ్దాలుగా నిలబెట్టింది. నవతరంలో ఈ ప్రాంతాన్ని శ్రీ శృంగేరి మఠం వారు గుత్తకు తీసుకొని ఇందులో ఒక వేదపాఠశాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఆర్యాదేవి సమాధి మండపం
[మార్చు]శ్రీ శంకరాచార్యులవారి తల్లి ఆర్యాదేవికి దహనసంస్కారం జరిగిన స్థలంలో ఆర్యాదేవి సమాధిమండపం నిర్మించబడి ఆమెకు అంకిత మివ్వబడింది[10]. ఆర్యాదేవి మరణం పిదప, శ్రీ శంకరాచార్య కావడిలో ఉన్న పది నంబూతిరి కుటుంబాలలో రెండు కుటుంబాల వారి సహాయంతో ఆమెకు దహనక్రియలు సలిపారు. వారిలో ‘కప్పిల్లి మన’ కుటుంబంవారు ఆ సమాధి మండపంలో శతాబ్దాలుగా దినదినము దీపాలు వెలిగించి ఆమెను గారవించారు[11]. శ్రీ శృంగేరిమఠం వారి ప్రత్యేక ప్రతినిథి శ్రీ నడుకవేరి శ్రీనివాసశాస్త్రి గారు ఆ దైనందిన దీపారాధనను గమనించి, కాలడి శ్రీ శంకరాచార్యులవారి జన్మస్థలంగా 1905 లో గుర్తించి, నిర్ధారించారు. ట్రావన్కోరు ప్రభువులు ఆ ప్రాంతమునంతా ‘కప్పిల్లి మన’ కుటుంబంనుండి 1905 లో స్వాధీనపఱచుకొని దానిని శృంగేరి మఠానికి సమర్పించారు[11]. నాటినుండి శృంగేరి మఠంవారు ఆర్యాదేవి సమాధి మండప నిర్వహణ కొనసాగిస్తున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Hoiberg, Dale (2000). Students' Britannica India (in ఇంగ్లీష్). Popular Prakashan. ISBN 978-0-85229-760-5.
- ↑ "Vijaya Yatras of Sri Sacchidananda Shivabhinava Nrisimha Bharati Mahaswamiji". www.sringeri.net (in ఇంగ్లీష్). Retrieved 2025-05-18.
- ↑ "KaladyCenter". web.archive.org. 2011-04-14. Archived from the original on 2011-04-14. Retrieved 2025-05-17.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 4.0 4.1 "Adi Shankara Keerti Sthambam-Pillar of Fame- Kalady, Kerala". www.kamakoti.org. Retrieved 2025-05-17.
- ↑ "Kalady Sri Krishna Temple - Kerala". lightuptemples (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-11-22. Archived from the original on 2025-05-24. Retrieved 2025-05-17.
- ↑ 6.0 6.1 "KERALA TEMPLES - MANIKYAMANGALAM KARTHIAYANI". www.thekeralatemples.com. Retrieved 2025-05-18.
- ↑ link, Get; Facebook; X; Pinterest; Email; Apps, Other. "Thiru Vellaman Thulli Temple Kalady – Information – Story". Retrieved 2025-05-17.
{{cite web}}:|last2=has generic name (help) - ↑ admin (2021-05-17). "Sree Siva-Narayana Temple, Nayathodu". Kshetradanam (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-05-17.
- ↑ "The Mutts of Trichur and Tirunavaya – Seats of Vedic learning in Kerala". Retrieved 2025-05-17.
- ↑ "Adi Shankara". My Dattatreya (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-05-17.
- ↑ 11.0 11.1 https://www.kochionline.in/guide/kalady-near-kochi.
{{cite web}}: Missing or empty|title=(help)