వికీపీడియా:అనువాదకులకు వనరులు
స్వరూపం
ఈ పేజీలో ఔత్సాహిక అనువాదకులకు ఉపయోగపడే వివిధ వనరులు, సూచనలు పొందుపరచబడతాయి.
ప్రాజెక్టు
[మార్చు]వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి
సాధారణం
[మార్చు]- మక్కీకి మక్కీ అనువాదాలు బాగుండవు
- అనువాదాలకు పదకోశాలు ఆయువుపట్టు లాంటివి. పదకోశాలు ముఖ్యమే కానీ సందర్భాన్ని బట్టి కొన్ని పదాలకు వేరే అర్ధాలు ఉంటాయి అని కూడా గ్రహించాలి. కాబట్టి పదాన్ని ప్రయోగించిన సందర్భం కూడా అనువాదానికి ముఖ్యం.
- ఇలా సందర్భోచిత అర్థాలు చాలాసార్లు మీకు పదకోశంలో దొరక్కపోవచ్చు.
- అనువాదంలో వీలైనంత వరకు మూలంలోని సమాచారాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించండి.
- సర్వనామాన్ని చాల ఎక్కువగా వాడడం ఇంగ్లీషు భాషకు ఆనవాయితీ. దాదాపు ప్రతివాక్యం లోనూ he గానీ she గానీ ఉంటుంది. ఉన్నా అక్కడ బానే ఉంటుంది. ఉంటేనే వాక్యం కుదురుగా ఉంటుంది. కానీ తెలుగులో అలా ప్రతీ వాక్యంలోనూ వాడక్కర్లేదు. వాడితే ఎబ్బెట్టు గానూ ఉంటుంది. "అతను" అనే మాట వాడకుండా "ఆ తరువాత మ్యాచ్‌లో మరో శతకం చేసాడు" అనే అర్థవంతమైన వాక్యాన్ని తెలుగులో రాయొచ్చు. 1999 మార్చిలో వెస్టిండీస్‌తో ఆడిన మ్యాచ్‌లో అతను, 11 వికెట్లు తీసాడు. తరువాతి మ్యాచ్‌లో అతను, 4 వికెట్లు తీసాడు. మళ్ళీ లార్డ్స్‌లో అతను, రెండు ఇన్నింగ్సుల్లోనూ నాలుగేసి వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు. ఆ తరువాతి మ్యాచ్‌లో అతను 2 వికెట్లు తీసుకున్నాడు." ఇలా వెంటవెంటనే రాసే వాక్యాల్లో - ఇంగ్లీషులో రాసినట్టు - సర్వనామాన్ని రాయనక్కర్లేదు. రాయకపోతేనే బాగుంటుంది.
- తేదీ ఆకృతిని తెవికీకి అనుగుణంగా మార్చాలి.
క్రికెట్
[మార్చు]క్రికెట్ వ్యాసాలకు సంబంధించి కింది సూచనలను పరిశీలించండి
- అరంగేట్రం: తొలి మ్యాచ్ అడిన సమాచారాన్ని రాసే సందర్భంలో ఈ మాట వాడవచ్చు. తెలుగులో రంగప్రవేశం అనే చక్కటి మాట ఉంది. పునరుక్తి కాకుండా ఉండేందుకు ఈ రెండు మాటలూ వాడవచ్చు.
- "named in the squad" అని ఇంగ్లీషులో ఉంటే దాన్ని "పేరు పొందాడు" అని యంతరం అనువదిస్తుంది. పేరు పొందాడు అంటే ఫేమస్ అయ్యాడు అని అర్థం. ఈ సందర్భంలో అలా వాడడం తప్పు. అంచేత దాన్ని "చోటు సంపాదించాడు" "స్థానం పొందాడు" "చోటు దక్కింది" వగైరాలు వాడవచ్చు.
- 5-wicket haul ను ఐదు వికెట్ల పంట అని రాయవచ్చు
- four, boundary లను ఫోరు, బౌండరీ అనే రాయవచ్చు. sixer ను సిక్సరని రాయవచ్చు.
- century ని సెంచరీ అనీ, శతకం అనీ రాయవచ్చు.
- టెస్ట్ ను టెస్టు
- ODI ను వన్‌డే
- సంతకం చేయబడ్డాడు, కొనబడ్డాడు.. యంత్రం ఇలాంటి "బడు"లను రాస్తుంది. వాటిని కర్తరి రూపం లోకి మార్చాలి.
- బ్యాట్స్‌మన్ ను బ్యాటరు అని రాయాలి. మహిళలకు, పురుషులకూ ఒకేలా ఉండేందుకు అంతర్జాతీయంగా ఇలా వాడుతున్నారు
అనువదించవలసిన పదాల సహాయం
[మార్చు]చూడండి నిఘంటువు, విక్షనరీ, విక్షనరీ లో వెతకండి. కోరిన పదాలు లో కొత్తపదాల సహాయానికై చేర్చండి.
- తెలుగు అకాడమీ వారి పారిభాషిక పదకోశాలు వివిధ రంగాలలో ముద్రించబడ్డాయి.
- పేజీ అనువాదం