Jump to content

పారిభాషిక పదకోశం

వికీపీడియా నుండి
(పారిభాషిక పదకోశాలు నుండి దారిమార్పు చెందింది)

మహమ్మదీయ పరిపాలనా కాలములో వ్యవహారికమైన పార్శీ ఉరుదూ మాటలు కొన్ని విభాగములలోనూ ఆ తరువాత ఆంగ్లేయల పరిపాలనలో వున్నప్పుడు అనేక ఇంగ్లీషు మాటలు, పదాలు అనేక విభాగములలో తెలుగులో వాడుకలోకి వచ్చినవి. ఆ విధంగా వచ్చిన మాటలకు పదాలకు కాలక్రమేణా తెలుగులో పారిభాషిక పదాలు (equivalent terms) కూడా ఉద్భవించాయి. కానీ ఒకే భావముగల ఇంగ్లీషు మాటకు సూక్ష్మశబ్ధభేదముతోను, అర్ధభేదములతో స్థిరరూపములేని పారిభాషిక పదములు వాడుచూ సంస్కరించబడక పోవుటచే (not standardized) ఆయా మాటలు, పదాలు చాల కాలం దాకా తెలుగు నిఘంటువులలోకెక్కలేదని తెలియుచున్నది.[1] మేధావులైన పండితులు అటువంటి పారిభాషిక పదాలను సేకరించి విమర్శించి సవరించి ఆయా పదజాలములను ప్రచురించిన తరువాతనే ఆయా మాటలు పదాలు ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులలోకి వచ్చినవి. పారిభాషిక పదాలంటే పర్యాయపదాలు కాదని నిస్సందేహంగా చెప్పవచ్చు. తెలుగు భాషాభివృధ్ధికి పారిభాషక పదకోశములు ఎంతో దోహదముచేసినవనుటకు సందేహములేదు.

పారిభాషిక పదకోశ సంకలన దృష్టికోణములో పరివర్తనలు

[మార్చు]

పారిభాషికపదకోశ సంకలనములు అనేక సవరణలు, మార్పులతో పురోగమించిన సంగతి గమనార్ధము. వాడుకలోనున్న తెలుగు పారిభాషిక మాటలు (Equivalent terms) లను పొందుపరచే ప్రయత్నంతో పురోగమించింది. ఆధునికమైన అనేక కొత్త ఇంగ్లీషు మాటలు వాడుకలోకి వచ్చినవి చేర్చి, చాలకాలంనుండి విలీనమైయున్నమాటలు తీసివేయటం జరిగింది. అంతర్జాతీయస్థాయి విజ్ఞానశాస్త్రముల ఉన్నతవిద్యాబోధనకు సంబంధించిన పారిభాషిక పదాల విషయంలోను, ప్రాంతీయ రోజూవారి పరిపాలనా యంత్రాంగ విషయంలో పారి భాషిక పదాలకు వేరువేరు దృష్టికోణ ఆవశ్యకత గుర్తించటం జరిగింది. ప్రపంచ భాషలలో కల్ల ఇంగ్లీషు చాల అభివృధ్ధి చెంది వ్యాప్తిచెందగలుగుట కారణం ఆభాషలో అనేక ఇతరభాష మాటలును విలీనంచేసుకునటమేనని గ్రహించి తెలుగులోకూడా ఇంగ్లీషుభాషలలోనుండి వచ్చివాడుకలోనున్న మాటలు, పదాలను విలీనంచేసి పదకోశములను సంకలనంచేశారు. ఉదాహరణకు పేజి303 లో అకాడమీవారి Administrative and Legal Terms of 1985 Edition లో packing material. ప్యాకింగ్ అనే ఇంగ్లీషుమాటకి పారిభాషిక పదం అవసరంకలుగదు. ఎంతకాలనించో తెలుగులో విలీనమైనది.[2]

తెలుగు అకాడమీ ప్రారంభించక ముందు చరిత్ర

[మార్చు]

తెలుగు అకాడమీ ప్రారంభించక పూర్వము 19- 20 వ శతాబ్దములో పారిభాషిక పదకోశముల సంకలనమునకు చేసిన కృషి మరువరానిది. కొన్ని విశేషములు ప్రస్తావన చేయటమైనది. స్వల్ప శబ్దార్ధ భేదములతో సాగుతున్న అనేక ఇంగ్లీషు మాటలకు పారిభాషిక పదాలు సంస్కరించబడి స్థిర రూపము ధరించుటకు దోహదమైన ప్రచురణలలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు విజ్ఞాన చంద్రికామండలి ద్వారా ప్రచురించిన శాస్త్రవిజ్ఞాన సాంకేతిక పదజాలము ప్రముఖమైనది. 1930 దశాబ్దములోని మద్ర్రాసు ప్రావిన్సు ప్రభుత్వమువారు ప్రచురించిన “Telugu Equivalents of English Terms” కూడా ఆ మార్గములో చేదోడుగా సహకరించింది.[1]

వ్యక్తిగతంగా ప్రచురించిన పదకోశాలు

[మార్చు]

భారతదేశము స్వాతంత్ర్యము కాక ముందు ఇంగ్లీషువారిపరిపాలనా కాలంలో వ్యక్తిగత కృషి సలిపి సంకలనంచేసి 1934 లో ఆంధ్ర గ్రంథాలయ ప్రెస్సు బెజవాడలో ముద్రించి ప్రచురించిన D.V.SIVA RAO గారి “ENGLISH-TELUGU DICTIONARY OF TECHNICAL & SCIENTIFIC ( part 1 వ్యవహార కోశము, Part 2 శాస్త్ర పరిభాష)” ఆ పదకోశమును మద్రాసు హైకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి సర్ వేపా రామేశం గారితో సహా అనేక ప్రముఖుల మన్ననలందుకుని ప్రముఖమైనదని గుర్తించబడింది. ప్రముఖ దిన పత్రిక ది హిందూ 19/06/1934 తేదీన తమ పత్రికా సంపాదకీయ ప్రశంస ప్రచురించారు.[3]. 1988 లో వ్యవహార కోశము శాస్త్ర పరి భాష కలసిన సంపుటముగా ASIAN EDUCATIONAL SERVICES, NEW DELHI వారిచే 2వ సారి ప్రచురించబడింది.[1]

రాష్ట్ర శాసన సభ సచివాలయం వారు ప్రచురించిన పదకోశం

[మార్చు]

భాషాయుక్తమైన రాష్ట్రముగా 1954 లో ఆంధ్ర ప్రదేశ రాష్ట్రంను అవిధ్బవించి తెలుగును అధికార భాషగా 1955 లో చేసిన తీర్మానం తెలుగు భాషాభివృద్దికి దోహదమైనది. ఆ మార్గములోని ప్రగతే తెలుగు అకాడమీ స్థాపనతో పాటు తెలుగు పారిభాషిక పదకోశ సంకలనం కూడా. 1959 ఆగస్టు 21తేదీన భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు అకాడమీ ఆఫ్ సైన్సు అండ్ హిస్టరీని ప్రారంభోత్సవం చేశారు. ఆ సభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు గారు శాసన సభ, పరిపాలన మరియూ న్యాయశాస్త్రమునకు సంబంధించిన 27000ల ఇంగ్లీషు మాట లు, పదాలకు తెలుగులో పారిభాషిక పదాలతో గ్లాసరీ వెలువడునని ఉద్ఖాటనచేశారు.[4], [5] లోక్‌సభ సచివాలయం వారు (Parliament Secretariat) ప్రచురించిన Glossary of Parliamentary terms అను పదకోశంలోని సుమారుగా 26000 మాటలను ఆధారంగా చేసుకుని ఆంధ్ర ప్రదేశ శాసన సభ సచివాలయం వారు ప్రప్రథమ ప్రయత్నంగా 1960 లో శాసనసభ, న్యాయసంస్థలు, పరిపాలనా ఫ్రభుత్వవిభాగములలో అప్పటిలో వాడుకలోనున్న ఇంగ్లీషు మాటలకు, పదాలకూ గ్లాసరీని సంకల్పించి భారీఎత్తున సంకలనంచేసి “పారిభాషికపదకోశము (Glossary of Parliamentary, Legal and Administrative Terms with Telugu equivalents)” 1963 లో ప్రచురించారు. ఆ గ్లాసరీ సంకలనానికి ఎందరో మేధావులు కృషి చేశారు.[6]. పదకోశ సంకలనంముల కమిటీలు ఘటించి, విఘటించి దీర్ఘముగా సమీక్షలు చేసి పునర్మించుచూ చురుకుగా పని జరిపించుచూ చివరదశలో ప్రచురణ వెలువడకనే పదకోశ సంకలన సంకల్పకర్త అయిన కాళేశ్వరరావుగారు1962 లోపరమదించారు.

గ్లాసరి సంకలన కమిటీల వృత్తాంతం.

[మార్చు]

శాసన సభ స్పీకరు అయ్యదేవర కాళేశ్వరరావుగారి ఆధ్వర్యాన్న, 1957 అక్టోబరు 30 తేదిన మొట్టమొదటగా 3మంత్రులు, 5ఎమ్ఎల్ఎ లూ, 2ఎమ్ పి లు, మరికొంతమంది ప్రభుత్వోద్యోగులు, పత్రికాసంపాదకులు, సాహిత్యవేత్తలు, విశ్వవిద్యాలయ లోని మేధావుల కలిసిన 32 మంది సభ్యత్వముతో ఘటించిన గ్లాసరీ సంకలన కమిటీ. ఆలా ఘటించిన మొదటి కమిటీని రద్దు పరచి డిశంబరు 18, 1958తేదీన 16 మంది సభ్యులతో ఘటించన కమిటీ సభ్యులు 1961 జూలై నాటి రిపోర్టులోనున్న వరుసక్రమం లోఅయ్యదేవర కాళేశ్వరరావు (అధ్యక్షులు), దిగవల్లి వేంకట శివరావు, గరికిపాటి కృష్ణమూర్తి, కంభంపాటి సత్యనారాయణ, పెద్దింటి రామస్వామి నాయడు (ఎమ్.యల్ ఎ), బోయి భీమన్న, ఆర్ బి రామకృష్ణరాజు, రావి నారాయణరెడ్డి, కురుగంటి సీతారామయ్య, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, దేవులపల్లి రామానుజరావు, మన్ సబ్ జంగ్ బహదూర్, ఖండవల్లి లక్ష్మీరంజనం, కాళోజి నారాయణరావు, పి.వి.నరసింహరావు (ఎమ్.యల్ ఎ), పి.సి జేమ్స special officer GAd, Official Language Department.ఆ 16 మంది ప్రధాన కమిటీ సభ్యులను 4 ఉపసంఘములు (సబ్ కమిటీలుగా) 2 హైదరాబాదులోను, 2 విజయవాడలోను సంకలనం చేసేటట్లుగా ఘటన చేశారు.ుపసంఘ సభ్యుల సహాయార్ధం ఇంకా కొందమంది ప్రముఖులను కో ఆప్టు సభ్యులుగా చేర్చుకున్నతరువాత కార్యక్రమం కొన్నాళ్లు జోరుగా సాగింది. 1958 మే లో11మంది సభ్యులతో ఎడిటోర్యల్ సబ్ కమిటీని ఘటించారు పద్మభూషణ మాడపాటి హనుమంతరావు గారి అధ్యక్షతన 10 మంది ప్రధాన కమిటీలోని సభ్యులతో. ఆమొత్తం 17 మందేకాక, పూర్తిగా లేదా కొంతకాలం పనిచేసి విరమించిన వారు, కోఆప్టుగా వచ్చిన సభ్యులును కలుపుకుని పునరావృత్తికాని పేర్లు కాటూరి వెంకటేశ్వరరావు, యమ్.ఆర్ అప్పారావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, భమిడిపాటి కామేశ్వర రావు, మామిడిపూడి వెంకటరంగయ్య, గిడుగు వెంకట సీతాపతి, విశ్వనాధ సత్యనారాయణ, కోలవెన్ను రామకోటీశ్వరరావు. చివర ఇంకో రెండు సంవత్సరాలు అనేక మార్పుల చేర్పులతో సబ్ కమిటీల్లో కూడా తగ్గించిన సభ్యత్వంతో పని సాగించినవి. పూర్తిఅవుతున్న దశలో సంకలనానికి సంకల్పకారుడైన శాసనసభ స్పీకరు అయ్యదేవర వారు 1962 ఫిబ్రవరి 26 న కాలగతి చెందుటచే అప్పటిలో ఎడ్యుకేషన్ మంత్రిగానున్న పి.వి. నరసింహా రావుగారి అధ్యక్షతన సంకలనం పని పూర్తి చేశారు. కమిటీలలో సభ్యులుగా కాకపోయినా ఆ సంకలన, ప్రచురణ కార్యక్రమంలో గొప్పకృషి చేసిన ప్రముఖులు ఎ.పి ఆర్కైవ్సుకు డైరెక్టరుగా చేసి చరిత్ర, శాస్త్రవిజ్ఞాన అకాడమీకి కార్యదర్శిగా నుండిన డా.పుట్టపర్తి శ్రీనివాసాచారి గారు

తెలుగు అకాడమీ వారు ప్రచురించిన పదకోశాలు

[మార్చు]
పారిభాషిక పదకోశం - భౌతికశాస్త్రం.

తెలుగు మాధ్యంలో పాఠ్యపఠనీయ గ్రంథాలు ప్రచురించడంలో తెలుగు అకాడమి ఎదుర్కొన్న సమస్యలలో పారిభాషిక పదాలను సంతరించుకోవడం ఒకటి. ఇంటర్మీడియెట్, డిగ్రీ స్థాయిలలో పాఠ్యగ్రంథాలు తయారుచేసే సమయంలో అకాడమిలోని భాషానిపుణులు, శాస్త్ర నిపుణులు, పాఠ్యగ్రంథ రచయితలు సమష్టిగా కృషిచేసి, పాఠ్యగ్రంథ రచయితల ఉపయోగం కోసం అవసరమైన పారిభాషిక పద పట్టికలను శాస్త్రాల వారీగా తయారుచేశారు. అనంతరం పునరభ్యసన గోష్ఠుల ద్వారాను, ప్రశ్నావళుల ద్వారాను, అధ్యాపకుల నుంచి, శాస్త్ర నిపుణుల నుంచి వచ్చిన సూచనలను గ్రహిస్తూ ఆ పారిభాషిక పట్టికలను ఎప్పటికప్పుడు పునః పరిశీలిస్తూ వచ్చారు. ఆ విధంగా పరిష్కరించిన పదకోశాలను వివిధ శాఖలుగా ప్రచురించారు.[2]

ప్రచురించిన శాఖలు

[మార్చు]
  1. పరిపాలనా, న్యాయపారిభాషిక పదకోశము (1980, 1985)
  2. ప్రభుత్వ పాలనాశాస్త్రం, 1994, 2005, 2008
  3. భౌతికశాస్త్రం
  4. భూవిజ్ఞాన, భూగోళశాస్త్రాలు, 1973, 1994, 1997, 2008
  5. రసాయనశాస్త్రం, 1997, 1999, 2003, 2006
  6. గణిత, సాంఖ్యక శాస్త్రాలు, 1973, 1991, 1995, 2001, 2003, 2005, 2008
  7. జంతుశాస్త్రం, 1973, 1990, 1997, 2001, 2008
  8. వైద్యశాస్త్రం, 1996, 2000, 2005
  9. వాణిజ్యశాస్త్రం, 1997, 2003, 2005, 2008

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "ENGLISH-TELUGU DICTIONARY OF TECHNICAL & SCIENTIFIC TERMS" D.V.SIVA RAO(1988) పీఠిక PP 1-5 Published by J.Jetley For Asian Educational Services, New Delh-110016
  2. 2.0 2.1 "GLOSSARY OF ADMINISTRATIVE AND LEGAL TERMS పరిపాలన, న్యాయ పదకోశం” తెలుగు అకాడమీ (1985) Printed by Kanthi Printing Press, Vijayawada-520002
  3. The Hindu 19/06/1934
  4. The Deccan Chronicle 22-08-1959
  5. గోలకొండపత్రిక 22-08-1959
  6. “TELUGU GLOSSARY COMMITTEE TO FIX TELUGU EQUIVALENTS FOR LEGISLATIVE LEGAL AND ADMINISTRATIVE TERMS REPORT” ANDHRA PRADESH LEGISLATURE SECRETARIATE, HYDERABAD(1961)