పాలక్కాడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?పాలక్కాడ్
కేరళ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 10°46′N 76°39′E / 10.77°N 76.65°E / 10.77; 76.65Coordinates: 10°46′N 76°39′E / 10.77°N 76.65°E / 10.77; 76.65
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 84 మీ (276 అడుగులు)
జిల్లా (లు) పాలక్కాడ్ జిల్లా
జనాభా 2,617,094 (2001 నాటికి)
Chairman Position Empty
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 678XXX
• +91 491
• KL-9


పాలక్కాడ్ మధ్య కేరళ రాష్ట్రానికి చెందిన ఒక పట్టణం, పాలక్కాడ్ జిల్లా కేంద్రం. దీని పూర్వ నామం పాలఘాట్. పశ్చిమ కనుమల గుండా ప్రవహించే పొన్నాని నదికి సమీపంలో ఉంది. పాలక్కాడ్ కోటను 1766 లో మైసూరుకి చెందిన హైదర్ ఆలీ నిర్మించాడు. తర్వాత 1783 లో దీనిని ఆంగ్లేయులు తాత్కాలికంగానూ, 1790లో శాశ్వతంగా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉండే ప్రదేశం వ్యూహాత్మకమైనది కావడంతో వాణిజ్య పరంగా ప్రాముఖ్యతను పొందడమే కాకుండా, రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పేరు గాంచింది.

పాలక్కాడ్ దేశంలో నూటికి నూరు శాతం విద్యుదీకరణ జరిగిన మొట్టమొదటి జిల్లాగా ఫిబ్రవరి 16న కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రకటన చేశాడు.[1] ఆ జిల్లాలోని ప్రతి ఇంటికీ ఇప్పుడు విద్యుత్‌ కనెక్షన్‌ ఉంది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం, కేరళ రాష్ట్ర విద్యుత్‌ బోర్డు (కేఎస్‌ఈబీ) ల కృషి వల్లే సాధ్యమయింది

మూలాలు[మార్చు]

  1. ఈనాడు ఆదివారం 25, ఏప్రిల్ 2010