అక్షాంశ రేఖాంశాలు: 12°01′00″N 75°17′00″E / 12.0167°N 75.2833°E / 12.0167; 75.2833

మలబార్ తీరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మలబార్ తీరం
Region
పొన్నాని వద్ద దీపస్థంభం
పొన్నాని వద్ద దీపస్థంభం
Nickname: 
భారత సముద్ర ద్వారం[1][2] భారత సుగంధ ద్రవ్యాల తోట
మ్యాపులో మలబార్ తీరం
మ్యాపులో మలబార్ తీరం
Coordinates: 12°01′00″N 75°17′00″E / 12.0167°N 75.2833°E / 12.0167; 75.2833
దేశంభారతదేశం
రాష్ట్రంకేరళ, కర్ణాటక, తమిళనాడు
 • జనసాంద్రత816/కి.మీ2 (2,110/చ. మై.)
భాషలు
 • అధికారికకొంకణి భాష, మలయాళం, తుళు, కన్నడం, ఇంగ్లీషు, తమిళం
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-KL, IN-TN and IN-KA
జిల్లాల సంఖ్య8 (కేరళలో 4, కర్ణాటకలో 3, తమిళనాడులో 1
శీతీష్ణస్థితిTropical (Köppen)

మలబార్ తీరం భారత ఉపఖండంలోని నైరుతి ప్రాంతం. కొంకణ్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న భారతదేశంలోని పశ్చిమ తీరప్రాంతాన్ని ఇది సూచిస్తుంది. భౌగోళికంగా, ఇది ఉపఖండంలోని అత్యంత తేమతో కూడిన ప్రాంతాలలో ఒకటి. ఇందులో కర్ణాటకలోని కెనరా ప్రాంతం, యావత్తు కేరళ ఇందులో భాగం.[3]

భారతదేశంలో కెల్లా అతి తక్కువ ఎత్తులో ఉన్న కుట్టనాడ్, మలబార్ తీరంలో ఉంది. కేరళ ధాన్యాగారం అని కూడా పేరున్న కుట్టనాడ్, సముద్ర మట్టానికి దిగువన సాగు చేసే ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలలో ఒకటి.[4][5] హిమాలయాల వెలుపల భారతదేశంలో కెల్లా ఎత్తైన ప్రదేశమైన అనముడి శిఖరం, పశ్చిమ కనుమలపై మలబార్ తీరానికి సమాంతరంగా ఉంది.

మలబార్ తీరానికి సమాంతరంగా ఉన్న ప్రదేశం పశ్చిమ కనుమలలో ఎత్తైన తూర్పు ప్రాంతం నుండి పశ్చిమాన ఉన్న తీర పల్లపు ప్రాంతం వరకు మెల్లగా వాలుగా దిగుతుంది. తేమతో కూడిన నైరుతి రుతుపవనాలు, భారత ఉపఖండం లోని దక్షిణ భాగానికి చేరుకున్నప్పుడు, దాని స్థలాకృతి కారణంగా, "అరేబియా సముద్ర శాఖ", "బంగాళాఖాత శాఖ" అనే రెండు శాఖలుగా విడిపోతాయి.[6] "అరేబియా సముద్ర శాఖ" మొదట పశ్చిమ కనుమలను తాకుతుంది.[7] ఆ విధంగా నైరుతి రుతుపవనాల నుండి వర్షాలు కురిసే మొదటి రాష్ట్రం అనే విశిష్టత కేరళకు దక్కింది.[8][9]

వ్యుత్పత్తి

[మార్చు]
పశ్చిమ కనుమలు భారతదేశంలోని నైరుతి మలబార్ తీరానికి దాదాపు సమాంతరంగా ఉన్నాయి.

బ్రిటిష్ వారు వచ్చే వరకు మలబార్ అనే పదాన్ని విదేశీ వాణిజ్య వర్గాల్లో కేరళకు వాడుకలో ఉన్న పేరు.[1] అంతకు ముందు, మలబార్ అనే పదాన్ని ఆధునిక కేరళ రాష్ట్రంతో పాటు, నైరుతి తీరంలో కేరళకు ఆనుకుని ఉన్న తుళునాడు, కన్యాకుమారిలకు కూడా వాడేవారు.[10][11] మలబార్ ప్రజలను మలబార్లు అని పిలిచేవారు. భారతదేశంలోని మొత్తం నైరుతి తీరాన్ని సూచించడానికి మలబార్ అనే పదాన్ని ఉపయోగిస్తూంటారు.

ఐరోపా వ్యాపారులు, పండితులూ దక్షిణ భారతదేశం లోని, శ్రీలంకలోని తమిళులందరినీ కూడా మలబార్లనే అనేవారు. 18వ శతాబ్దంలో, JP ఫాబ్రిషియస్ తన తమిళ-ఇంగ్లీషు నిఘంటువును "డిక్షనరీ ఆఫ్ మలబార్ అండ్ ఇంగ్లీష్" అని అభివర్ణించాడు.[12]

ఈ రాష్ట్రాన్ని మలబార్ అని పిలిచిన మొదటి రచయిత అల్-బెరూని (క్రీ.శ. 973 - 1048) అయి ఉండవచ్చు.[1] ఇబ్న్ ఖోర్దాద్బే, అల్-బలాధురి వంటి రచయితలు తమ రచనలలో మలబార్ ఓడరేవుల గురించి ప్రస్తావించారు.[13] అరబ్ రచయితలు ఈ ప్రదేశాన్ని మలిబార్, మణిబార్, ములిబార్, మునిబార్ అని పేర్కొన్నారు. మలబార్ అంటే మలనాడు అంటే పర్వతాల భూమి అని అర్థం.

విలియం లోగాన్ ప్రకారం, మలబార్ అనే పదం ద్రావిడ పదమైన మల (పర్వతం), పర్షియన్ / అరబిక్ పదమైన బార్ (దేశం/ఖండం) ల కలయిక నుండి వచ్చింది.[1][14]

నిర్వచనాలు

[మార్చు]

చారిత్రకంగా మలబార్ తీరం అనే పదం, పశ్చిమ కనుమలకు, అరేబియా సముద్రానికీ మధ్య కర్ణాటక, కేరళ లోని సన్నటి తీర మైదానంలో ఉన్న నైరుతి తీరాన్ని సూచిస్తుంది.[15] భారతదేశపు దక్షిణ కొనపై గోవాకు దక్షిణం నుండి కన్యాకుమారి వరకు ఈ తీరం ఉంది. దేశపు ఆగ్నేయ తీరాన్ని కోరమాండల్ తీరం అంటారు.[16]

పురాతన కాలంలో భారత ద్వీపకల్పం లోని నైరుతి తీరం మొత్తాన్ని సూచించడానికి మలబార్ అనే పదాన్ని వాడారు. 12 వ శతాబ్దం ప్రారంభం వరకు ఈ ప్రాంతం పురాతన చేర రాజ్యంలో భాగంగా ఉండేది. చేర రాజ్యం విడిపోయిన తరువాత, ఈ ప్రాంతం లోని సామంతులు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. వీటిలో ముఖ్యమైనవి కోజికోడ్, కోళతునాడు, పెరుంబదప్పు స్వరూపం, వేనాడ్, వల్లువనాడ్ రాజ్యం వాటిలో ముఖ్యమైనవి.

భౌగోళికం

[మార్చు]

భౌగోళికంగా, మలబార్ తీరాన్ని మూడు విభిన్న శీతోష్ణస్థితి ప్రాంతాలుగా విభజించవచ్చు. అవి: ఎత్తైన తూర్పు ప్రాంతాలు ఒకటి, కఠినమైన చల్లని పర్వత భూభాగం, మధ్యలో ఉన్న మధ్య భూములు రెండవది, రోలింగ్ కొండలు, పశ్చిమ లోతట్టు ప్రాంతాలు; తీర మైదానాలు మూడవది.[17]

పశ్చిమ కనుమల పర్వత శ్రేణి ఎత్తైన తూర్పు ప్రాంతంలో తీరానికి సమాంతరంగా ఉంది. ఇవి మైదానాలను దక్కన్ పీఠభూమి నుండి వేరుపరుస్తాయి. ఈ పర్వతాలు ప్రపంచంలోని ఎనిమిది "హాటెస్ట్ హాట్‌స్పాట్‌లలో" ఒకటిగా గుర్తించబడ్డాయి. ఇవి యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఉన్నాయి.[18] కేరళలోని అనముడి శిఖరం భారతదేశంలో హిమాలయాల వెలుపల ఉన్న అత్యంత ఎత్తైన శిఖరం. ఇది 2,695 మీ. (8,842 అ.) ఎత్తున ఉంది.[19] ఇక్కడి అడవులు హిమాలయ పర్వతాల కంటే పురాతనమైనవిగా భావిస్తున్నారు.[18]

తూర్పు ప్రాంతంతో పోలిస్తే మలబార్ పశ్చిమ తీర ప్రాంతం సాపేక్షంగా చదునుగా ఉంటుంది.[17]: 33 ఈ ప్రాంతమంతా ఉప్పునీటి కాలువలు, సరస్సులు, కయ్యలు, [20] కేరళ బ్యాక్ వాటర్స్ అనే పేరున్న నదులూ విస్తరించి ఉన్నాయి.[21] కేరళ ధాన్యాగారం అనే పేరున్న కుట్టనాడ్ ప్రాంతం భారతదేశంలో కెల్లా అత్యంత తక్కువ ఎత్తున ఉన్న ప్రదేశం.[4][22] దేశంలోని అతి పొడవైన సరస్సు వెంబనాడ్ బ్యాక్ వాటర్స్‌లో ప్రముఖంగా కనిపిస్తుంది. ఇది అలప్పుజా, కొచ్చి ల మధ్య ఉంది. దీని విస్తీర్ఝ్ణం సుమారు 200 చ.కి.మీ. ఉంటుంది.[23] భారతదేశ జలమార్గాలలో దాదాపు ఎనిమిది శాతం కేరళ లోనే ఉన్నాయి.

మలబార్ వర్షారణ్యాలు

[మార్చు]

మలబార్ వర్షారణ్యాలలో జీవభూగోళ శాస్త్రవేత్తలు గుర్తించిన కింది పర్యావరణ ప్రాంతాలు ఉన్నాయి:

  1. మలబార్ తీరం లోని తేమతో కూడిన అడవులు గతంలో తీర ప్రాంతాన్ని సముద్ర మట్టం నుండి 250 మీటర్ల ఎత్తు వరకూ ఆక్రమించాయి (కానీ వీటిలో 95% అడవులు ఇప్పుడు లేవు)
  2. నైరుతి కనుమల లోని తేమతో కూడిన ఆకురాల్చే అడవులు మధ్యస్థ ఎత్తులలో పెరుగుతాయి
  3. నైరుతి కనుమల లోని పర్వత వర్షారణ్యాలు 1000 మీటర్ల కంటే ఎత్తున ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయి

మాన్‌సూన్డ్ మలబార్ కాఫీ బీన్ ఈ ప్రాంతం నుండే వస్తుంది.

రేవు పట్టణాలు

[మార్చు]

మలబార్ తీరంలో అనేక చారిత్రికంగా చాలా రేవు పట్టణాలు ఉన్నాయి (కొన్నైతే ఇప్పటికీ ఉన్నాయి). పురాతన కాలం నాటి నౌరా, విజింజం, ముజిరిస్, నెల్సిండా, బేపూర్, తుండి ( పొన్నాని లేదా కడలుండి సమీపంలో), మధ్యయుగ కాలంలో కోజికోడ్ (కాలికట్), కొల్లం, పొన్నాని, కన్నూర్ (కన్ననూర్), కొచ్చిన్ లు వీటిలో ముఖ్యమైనవి. సహస్రాబ్దాలుగా ఇవి హిందూ మహాసముద్రంలో వాణిజ్యానికి కేంద్రాలుగా పనిచేశాయి.

సముద్రం పట్ల సముద్ర వాణిజ్యం పట్ల ఇక్కడి ప్రజల ధోరణి కారణంగా, మలబార్ తీర నగరాలు చాలా కాస్మోపాలిటన్‌గా ఉంటాయి. యూదులకూ (నేడు కొచ్చిన్ యూదులు అని పిలుస్తారు), సిరియన్ క్రైస్తవులకూ ( సెయింట్ థామస్ క్రిస్టియన్స్ అంటారు) ముస్లింలకు (ప్రస్తుతం మాప్పిలాస్ అంటారు), ఆంగ్లో-ఇండియన్లకూ చెందిన తొలి సమూహాలు ఇక్కడే నివాసాలు ఏర్పరచుకున్నారు.[24][25]

చరిత్ర

[మార్చు]

1498 లో మొదటిసారిగా వాస్కో డి గామా కోజికోడ్‌కు సముద్ర మార్గంలో చేరాడు. ఇది ఐరోపా నుండి దక్షిణ ఆసియా మొదటి ఆధునిక సముద్ర మార్గం కూడా. ఇది భారతదేశంలో వలస యుగానికి నాంది పలికింది. డచ్చి, ఫ్రెంచి, బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీల వాణిజ్య ప్రయోజనాలు భారతదేశంలో వలసరాజ్యాల యుద్ధాల సమయంలో కేంద్ర బిందువుగా మారాయి. 1755 లో పురక్కాడ్ యుద్ధంలో శక్తివంతమైన కోళికోడ్ జామోరిన్‌ను ఓడించి ట్రావెన్కోర్, కేరళలో అత్యంత ఆధిపత్య రాష్ట్రంగా మారింది.[26] కొచ్చి ట్రావెన్కోర్ ల పాలియాత్ అచ్చన్ కలిసి కాలికట్ జామోరిన్ను కొచ్చి భూభాగాల నుండి పారదోలారు. మార్తాండ పిళ్ళై నాయకత్వంలో, ట్రావెన్కోర్ నాయర్ దళాలు, జనరల్ డి లన్నోయ్ మార్గదర్శకత్వంలో, 1763లో త్రిస్సూర్ యుద్ధంలో త్రిస్సూర్ను విజయవంతంగా స్వాధీనం చేసుకున్నాయి. తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ, జామోరిన్ దళాలు వెనక్కి తగ్గాయి. చివరికి కొచ్చిన్ భూభాగం నుండి వారు తప్పుకోవాల్సి వచ్చింది. శాంతి సాధనలో భాగంగా జామోరిన్, యుద్ధ ఖర్చుల కోసం ట్రావెన్కోర్కు నష్టపరిహారం చెల్లించడానికి అంగీకరించాడు.[27] ట్రావెన్కోర్ రాజు మార్తాండ వర్మ డచ్చి వారిని ఓడించిన తరువాత, ఉత్తర కేరళలో మలబార్ జిల్లాను సృష్టించి, రాష్ట్ర దక్షిణ భాగంలో కొత్తగా ఏర్పాటైన ట్రావెన్కోర్ సంస్థానంతో పొత్తు పెట్టుకుని బ్రిటిషు వారు కేరళపై నియంత్రణను పొందారు. ఈ ఏర్పాటు 1947 లో స్వాతంత్ర్యం వచ్చేవరకు కొనసాగింది. 1956 లో మాజీ ట్రావెన్కోర్-కొచ్చిన్ సంస్థానం, మలబార్ జిల్లా, మద్రాసు రాష్ట్రం లోని దక్షిణ కెనరా జిల్లా లోని కాసరగోడ్ తాలూకాలను కలిపి కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు.[28]

ఆంగ్లో-మైసూర్ యుద్ధాల తరువాత, బ్రిటిష్ వలసలుగా మారిన మలబార్ తీరంలోని కొన్ని భాగాలు బ్రిటిష్ పాలనలో ఒక జిల్లాగా ఏర్పాటయ్యాయి. బ్రిటిషు జిల్లాలో ప్రస్తుత కన్నూర్, కోళికోడ్, వయనాడ్, మలప్పురం జిల్లాలు, పాలక్కాడ్ ఎక్కువ భాగం (చిత్తూరు తాలూకాతో సహా) త్రిస్సూర్ కొన్ని ప్రాంతాలు (చావక్కాడ్ తాలూకాలు, ఎర్నాకుళం జిల్లా ఫోర్ట్ కొచ్చి ప్రాంతం, లక్షద్వీప్ లోని కొన్ని వివిక్త ద్వీపాలు ఉండేవి. పరిపాలనా ప్రధాన కార్యాలయం కోళికోడ్లో ఉండేది.

స్వాతంత్ర్యం తరువాత

[మార్చు]

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాస్ రాష్ట్రంగా మారింది. 1956 నవంబరు 1 న భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినపుడు ఉత్తరాన ఉన్న కాసరగోడ్ ప్రాంతాన్ని, దక్షిణాన ఉన్న ట్రావెన్‌కోర్-కొచ్చిన్ రాష్ట్రాన్నీ పక్కనే మలబార్‌తో కలిపి కేరళ రాష్ట్రంగా ఏర్పాటు చేసారు. అంతకు ముందు, కాసరగోడ్ మద్రాసు ప్రెసిడెన్సీలోని సౌత్ కెనరా జిల్లాలో భాగంగా ఉండేది. లక్షద్వీప్ దీవులు విడిపోయి కొత్త కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడ్డాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 Sreedhara Menon, A. (January 2007). Kerala Charitram (2007 ed.). Kottayam: DC Books. ISBN 9788126415885. Retrieved 19 July 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Etymology of Malabar" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. K. V. Krishna Iyer (1938). Zamorins of Calicut: From the earliest times to AD 1806. Norman Printing Bureau, Kozhikode.
  3. Fahlbusch, Erwin; Bromiley, Geoffrey William; Lochman, Jan Milic (2008). The Encyclodedia of Christianity. Wm. B. Eerdmans Publishing. p. 285. ISBN 978-0-8028-2417-2.
  4. 4.0 4.1 Press Trust of India (1 June 2020). "Kerala Boat Ferries Lone Passenger To Help Her Take Exam". NDTV. Retrieved 17 November 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "ndtv_2238752" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. Suchitra, M (13 August 2003). "Thirst below sea level". The Hindu. Archived from the original on 22 September 2019. Retrieved 17 November 2020.
  6. RK Jain. Geography 10. Ratna Sagar. p. 110. ISBN 978-8183320818. Retrieved 18 November 2012.
  7. Together with Social Science Term II. Rachna Sagar. p. 112. ISBN 978-8181373991. Retrieved 18 November 2012.
  8. Edgar Thorpe, Showick Thorpe; Thorpe Edgar. The Pearson CSAT Manual 2011. Pearson Education India. p. 7. ISBN 978-8131758304. Retrieved 18 November 2012.
  9. N.N. Kher; Jaideep Aggarwal. A Text Book of Social Sciences. Pitambar Publishing. p. 5. ISBN 978-8120914667. Retrieved 18 November 2012.
  10. J. Sturrock (1894). "Madras District Manuals - South Canara (Volume-I)". Madras Government Press.
  11. V. Nagam Aiya (1906). The Travancore State Manual. Travancore Government Press.
  12. Fabricius, Johann Philipp (1809). A Malabar and English dictionary. The Library of Congress. Vepery.
  13. Mohammad, K.M. "Arab relations with Malabar Coast from 9th to 16th centuries" Proceedings of the Indian History Congress. Vol. 60 (1999), pp. 226–234.
  14. Logan, William (1887). Malabar Manual, Vol. 1. Servants of Knowledge. Superintendent, Government Press (Madras). p. 1. ISBN 978-81-206-0446-9.
  15. Malabar Coast, Britannica.com. Accessed 7 March 2023.
  16. Map of Coromandel Coast Archived 10 ఫిబ్రవరి 2012 at the Wayback Machine on a website dedicated to the East Indian Campaign (1782–1783).
  17. 17.0 17.1 Chattopadhyay, Srikumar; Franke, Richard W. (2006). Striving for Sustainability: Environmental Stress and Democratic Initiatives in Kerala. Concept Publishing Company. ISBN 978-81-8069-294-9. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "ChattopadhyayFranke2006" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  18. 18.0 18.1 "UN designates Western Ghats as world heritage site". The Times of India. 2 July 2012. Archived from the original on 31 January 2013. Retrieved 27 November 2018.
  19. Hunter, William Wilson; James Sutherland Cotton; Richard Burn; William Stevenson Meyer; Great Britain India Office (1909). The Imperial Gazetteer of India. Vol. 11. Clarendon Press. Archived from the original on 16 December 2008. Retrieved 16 May 2015.
  20. Danny Moss (2010). Public Relations Cases: International Perspectives. Taylor & Francis. p. 41. ISBN 978-0415773362. Retrieved 18 November 2012.
  21. Edgar Thorpe (2012). The Pearson CSAT Manual 2012. Pearson Education India. p. 3. ISBN 978-8131767344. Retrieved 18 November 2012.
  22. Suchitra, M (2003-08-13). "Thirst below sea level". The Hindu. Archived from the original on 2019-09-22. Retrieved 2020-11-17.
  23. Majid Husain (2011). Understanding: Geographical: Map Entries: for Civil Services Examinations: Second Edition. Tata McGraw-Hill Education. p. 9. ISBN 978-0070702882. Retrieved 18 November 2012.
  24. The Jews of India: A Story of Three Communities by Orpa Slapak. The Israel Museum, Jerusalem. 2003. p. 27. ISBN 965-278-179-7.
  25. The Clash of Cultures in Malabar : Encounters, Conflict and Interaction with European Culture, 1498-1947 Korean Minjok Leadership Academy, Myeong, Do Hyeong, Term Paper, AP World History Class, July 2012
  26. Shungoony Menon, P. (1878). A History of Travancore from the Earliest Times (pdf) (in ఇంగ్లీష్). Madras: Higgin Botham & Co. pp. 162–164. Retrieved 5 May 2016.
  27. P. Shungoonny Menon (1878). History of Travancore from the Earliest Times. Servants of Knowledge. Higginbotham and Co. (Madras). ISBN 978-81-206-0169-7.
  28. "The land that arose from the sea". The Hindu. 1 November 2003. Archived from the original on 17 January 2004. Retrieved 2009-07-30.