తమిళులు
Total population | |||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
77,000,000 [1] | |||||||||||||||||
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |||||||||||||||||
India | 72,138,958 (2011)[2] | ||||||||||||||||
శ్రీలంక | 3,113,247 (2012)[3] | ||||||||||||||||
మలేషియా | 1,892,000 (2000)[4] | ||||||||||||||||
దక్షిణాఫ్రికా | 250,000 (2008)[5] | ||||||||||||||||
సింగపూర్ | 200,000 (2008)[5] | ||||||||||||||||
బర్మా | 200,000 (2008)[5] | ||||||||||||||||
కెనడా | 138,675 (2012) [6] | ||||||||||||||||
United Kingdom | 218,000 (2011)[7] | ||||||||||||||||
యు.ఎస్.ఏ | 132,573 (2005-2009)[8] | ||||||||||||||||
మారిషస్ | 115,000 (2008)[5] | ||||||||||||||||
ఫిజీ | 110,000 (2008)[9] | ||||||||||||||||
ఫ్రాన్స్ | 100,000 (2008)[9] | ||||||||||||||||
Germany | 50,000 (2008)[9] | ||||||||||||||||
ఇండోనేషియా | 40,000 (2011)[10] | ||||||||||||||||
స్విట్జర్లాండ్ | 40,000 (2008)[5] | ||||||||||||||||
ఆస్ట్రేలియా | 30,000 (2008)[5] | ||||||||||||||||
ఇటలీ | 25,000 (2008)[5] | ||||||||||||||||
నెదర్లాండ్స్ | 20,000 (2008)[5] | ||||||||||||||||
నార్వే | 10,000 (2008)[5] | ||||||||||||||||
థాయిలాండ్ | 10,000 (2008)[5] | ||||||||||||||||
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 10,000 (2008)[5] | ||||||||||||||||
డెన్మార్క్ | 7,000 (2008)[5] | ||||||||||||||||
బహ్రెయిన్ | 7,000 (2008)[5] | ||||||||||||||||
భాషలు | |||||||||||||||||
తమిళం | |||||||||||||||||
మతం | |||||||||||||||||
88% హిందూ మతం, 6% క్రైస్తవ మతం, 5.5% ఇస్లాం మతం (తమిళనాడు మాత్రమే)[11] నాస్తికత్వం, హేతువాదులు | |||||||||||||||||
సంబంధిత జాతి సమూహాలు | |||||||||||||||||
ద్రావిడలు · తెలుగు ప్రజలు · కన్నడిగలు · తుళువలు · మలయాళీలు · గిరావరులు[12] · సింహళీయులు |
తమిళులు (తమిళం: தமிழர், తమిళర్ (ఏక.) ? లేదా తమిళం: தமிழர்கள், తమిళర్గళ్ (బహు.) ?) అనేవారు ద్రావిడ జాతి సమూహానికి చెందినవారు. వీరి మాతృభాష తమిళం. వీరి వంశస్థుల జాడ భారత రాష్ట్రం అయిన తమిళనాడు లోనూ, భారత కేంద్రపాలిత ప్రాంతము అయిన పుదుచ్చేరి లోనూ, శ్రీలంకలో తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో గుర్తించబడ్డాయి. తమిళులు శ్రీలంక జనాభాలోని 24.87%, భారతదేశంలో 5.91%, మారిషస్ లో 5.83%, సింగపూర్ జనాభాలో 5%, మలేషియా జనాభాలోని 5.7% ఉన్నారు.
చరిత్ర
[మార్చు]వేల సంవత్సరాల క్రితం, పట్టణీకరణ, వర్తక కార్యకలాపాలతో పశ్చిమ, తూర్పు తీరం వెంబడి, నేటి కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో, నాలుగు పెద్ద తమిళ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇవి చోళ సామ్రాజ్యము, చేర సామ్రాజ్యం, పల్లవ సామ్రాజ్యం, పాండ్య సామ్రాజ్యం. 3వ శతాబ్దం BCE, 3వ శతాబ్దం AD మధ్య, తమిళ ప్రజలు సంగం సాహిత్యం అనబడు స్థానిక సాహిత్యం ప్రచురించారు. తమిళుల యుద్ధ, మతపర, వర్తక కార్యకలాపాలు వారి స్థానిక సరిహద్దులు దాటి గుర్తింపు చెందాయి. పాండ్యులు, చోళులు చారిత్రకంగా లంకపై ఆధిపత్యం చెలాయించేవారు. చోళ రాజవంశం ఆగ్నేయ ఆసియా యొక్క మలేషియా, దక్షిణ థాయిలాండ్, ఇండోనేషియాలలో భాగాలను విజయవంతంగా ముట్టడించారు. మధ్యయుగ తమిళ వృత్తిసంఘాలు, వాణిజ్య కేంద్రాలు అయిన అయ్యవోలు మఱియు మణిగ్రామం ఆగ్నేయాసియా వాణిజ్యంలో ముఖ్యపాత్ర పోషించాయి.
సంస్కృతి
[మార్చు]తమిళ దృశ్య కళ శైలీకృత ఆలయ కట్టడాలలో, రాతి కాంస్య విగ్రహ ఉత్పాదనల్లో కనబడుతుంది. చోళ కాంస్య నటరాజు శిల్పం హిందూమత చిహ్నంగా మారింది. తమిళ ప్రదర్శక కళలు ప్రజాదరణ, సాంప్రదాయ పద్ధతుల్లో విభజించబడ్డాయి. ప్రజాదరణ రూపాలు కూతు అని పిలుస్తారు. దీనిని గ్రామ దేవాలయాలు, వీధి మూలల్లో నిర్వహిస్తారు. అయితే సాంప్రదాయ రూపం భరతనాట్యం. కోలీవుడ్ అని పిలువబడే తమిళ సినిమా, భారతీయ సినిమా పరిశ్రమకు ఒక ముఖ్యమైన భాగం. సంగీతం సాంప్రదాయ కర్ణాటక రూపం, అనేక ప్రముఖ శైలులలో ఉంటుంది.
చాలావరకు తమిళులు హిందువులు. అయితే చాలామంది అపరిమిత గ్రామదేవతలను నమ్ముతూ జానపద మతాలను పాటిస్తారు. పెర్కొన్నదగ్గ సంఖ్యలో క్రైస్తవులు, ముస్లింలు ఉన్నారు. ఒక చిన్న జైన్ సంఘం సంగంకాలం నుండి ఉనికిలో ఉంది. తమిళ వంటకం సాధారణంగా స్థానికంగా అందుబాటులో ఉన్న సుగంధ ద్రవ్యాలు వాడికతో మారుతూ శాకాహారం, మాంసాహార రకాలు ఉన్నాయి. పురాతన దేశ ముక్కువ చూపే సంగీతం, ఆలయప్రాంగణ కట్టడాలు, శిల్ప నిర్మాణం నేటికి ఆదరణలో ఉన్నాయి. ఆధునిక ప్రపంచీకరణ జరుగుతున్నప్పటికీ తమిళుల నమ్మకం, సంస్కృతి, సంగీతం, సాహిత్యంలో గల వారి గత గణనీయ అంశాలు సంరక్షించబడినవి.
సూచికలు
[మార్చు]- ↑ "Top 30 Languages by Number of Native Speakers: sourced from Ethnologue: Languages of the World, 15th ed. (2005)", Vistawide – World Languages & Cultures, retrieved 3 April 2007
- ↑ "Census of India". Retrieved 2008-01-07.
- ↑ "A2 : Population by ethnic group according to districts, 2012". Department of Census & Statistics, Sri Lanka. Archived from the original on 2017-04-28. Retrieved 2016-01-16.
- ↑ "Ethnologue report for language code tam", Ethnologue: Languages of the World, retrieved 2007-07-31
- ↑ 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 5.12 ""History of the Tamil Diaspora by V. Sivasupramaniam", murugan.org
- ↑ groups (17A)&VNAMEF=Groupes d'âge#17A#
- ↑ http://www12.statcan.gc.ca/census-recensement/2011/dp-pd/prof/details/page.cfm?Lang=E&Geo1=CMA&Code1=535&Geo2=PR&Code2=35&Data=Count&SearchText=Toronto&SearchType=Begins&SearchPR=01&B1=All&Custom=&TABID=1
- ↑ "Indian Americans grow to 3.2m, top in income", The Times Of India, 16 November 2011
- ↑ 9.0 9.1 9.2 ""World Tamil Population Archived 2015-09-30 at the Wayback Machine", tamilo.com
- ↑ ""Tamils - a Trans State Nation, Indonesia Archived 2016-03-10 at the Wayback Machine", Tamilnation.org, 15 August 2011.
- ↑ "Census 2001 – Statewise population by Religion". Censusindia.gov.in. Retrieved 18 July 2010.
- ↑ Maloney, Clarence, Maldives People, archived from the original on 29 జనవరి 2002, retrieved 22 June 2008